Unstoppable with NBK: అన్‏స్టాపబుల్ షోకు రానున్న బాలీవుడ్ హీరో.. రష్మికతో కలిసి సందడి..

|

Nov 09, 2023 | 9:57 AM

ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం ఆహాలో అన్‏స్టాపబుల్ విత్ ఎన్బీకే షోకు హోస్టింగ్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు బాలయ్య. ఇప్పటివరకు రెండు సీజన్స్ విజయవంతగా కంప్లీట్ చేసుకున్న ఈషో.. ఇప్పుడు సీజన్ 3 రన్ అవుతుంది. ఇందులో సెలబ్రెటీల సినిమా అప్డేట్స్ మాత్రమే కాకుండా.. వారి వ్యక్తిగత విషయాల గురించి సైతం ఆసక్తికర ప్రశ్నలు వేసి అభిమానులకు కావాల్సిన విషయాలను తెలుసుకుంటారు బాలయ్య. అంతేకాకుండా తన కామెడీ టైమింగ్‏తో అలరిస్తుంటారు.

Unstoppable with NBK: అన్‏స్టాపబుల్ షోకు రానున్న బాలీవుడ్ హీరో.. రష్మికతో కలిసి సందడి..
Unstoppable
Follow us on

ఇప్పటివరకు సినిమాల్లో యాక్షన్ హీరోగా అలరించిన నందమూరి బాలకృష్ణ.. అటు యాంకరింగ్‏తోనూ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం ఆహాలో అన్‏స్టాపబుల్ విత్ ఎన్బీకే షోకు హోస్టింగ్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు బాలయ్య. ఇప్పటివరకు రెండు సీజన్స్ విజయవంతగా కంప్లీట్ చేసుకున్న ఈషో.. ఇప్పుడు సీజన్ 3 రన్ అవుతుంది. ఇందులో సెలబ్రెటీల సినిమా అప్డేట్స్ మాత్రమే కాకుండా.. వారి వ్యక్తిగత విషయాల గురించి సైతం ఆసక్తికర ప్రశ్నలు వేసి అభిమానులకు కావాల్సిన విషయాలను తెలుసుకుంటారు బాలయ్య. అంతేకాకుండా తన కామెడీ టైమింగ్‏తో అలరిస్తుంటారు. ఇక ఇటీవల స్టార్ట్ అయిన సీజన్ 3లో మొదటి ఎపిసోడ్ కోసం భగవంత్ కేసరి టీమ్ సందడి చేసిన సంగతి తెలిసిందే. బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన ఈసినిమాలో శ్రీలీల, కాజల్ హీరోయిన్లుగా నటించగా.. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. శ్రీలీల, కాజల్, అనిల్ రావిపూడి అన్ స్టాపబుల్ షోలో పాల్గొన్నారు.

ఇక ఇప్పుడు నెట్టింట వినిపిస్తోన్న సమాచారం ప్రకారం ఈషోలో యానిమల్ చిత్రయూనిట్ సందడి చేయబోతున్నట్లు తెలుస్తోంది. స్టార్ హీరో రణబీర్ కపూర్, రష్మిక మందన్నా, సందీప్ రెడ్డి వంగా రాబోతున్నారని తెలుస్తోంది. వీరి కాంబోలో తెరకెక్కిన యానిమల్ సినిమా డిసెంబర్ 1న థియేటర్లలోకి రానుంది. పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, ట్రైలర్, టీజర్ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేసింది.

ఇవి కూడా చదవండి

అయితే ఇప్పుడు వినిపిస్తోన్న సమాచారం ప్రకారం ఈ షోలో రణబీర్ కపూర్ పాల్గొంటే.. బాలయ్య హోస్టింగ్‏కు ఫిదా అయ్యే అవకాశం లేకపోలేదు. అంతేకాకుండా బాలయ్యకు రష్మిక ఫేవరేట్ హీరోయిన్ కూడా. దీంతో యానిమల్ టీం ఎపిసోడ్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉండబోతుందని తెలుస్తోంది. అయితే ఈ ఎపిసోడ్ రాబోతుందనేది మాత్రం ఇప్పటివరకు క్లారిటీ లేదు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.