చైల్డ్ ఆర్టిస్టుగా సత్తా చాటిన అనిఖా సురేంద్రన్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన చిత్రం బుట్టబొమ్మ. పల్లెటూరి ప్రేమకథ నేపథ్యంలో తెరకెక్కిన సినిమాలో సూర్య వశిష్ఠ్, అర్జున్ దాస్ కీలక పాత్రలు పోషించారు. మలయాళంలో తెరకెక్కిన సూపర్ హిట్ మూవీ కప్పెలాను తెలుగు ప్రేక్షకులకు అనుగుణంగా కొత్త దర్శకుడు శౌరి చంద్రశేఖర్ టీ రమేష్ బుట్టబొమ్మను తెరకెక్కించారు. సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగ వంశీ, సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. టీజర్లు, ట్రైలర్లతో రిలీజ్‌కు ముందు ఎన్నో అంచనాలు పెంచేసిన బుట్టబొమ్మ థియేటర్లలోకి విడుదలయ్యాక మాత్రం అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఫిబ్రవరి 4 న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఓ మోస్తరుగా మాత్రమే ఆడింది. అయితే ఫీల్ గుల్ లవ్ స్టోరీ కావడం, అనిఖా సురేంద్రన్ యాక్టింగ్ యువతను థియేటర్లకు రప్పించాయి. ఇదిలా ఉంటే థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడిన ఈ పల్లెటూరి ప్రేమకథా చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. ‘బుట్టబొమ్మ’ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. థియేట్రికల్ రన్ పూర్తి కావడంతో ఇవాల్టి (మార్చి 4) నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఈ మూవీ ప్రేక్షకులకు అందుబాటులో ఉంది.
బుట్టబొమ్మ సినిమాకు గోపీ సుందర్ స్వరాలు సమకూర్చారు. లవ్ స్టోరీకి హ్యూమన్ ట్రాఫికింగ్ పాయింట్‌ను జోడించి తెరకెక్కించిన ఈ సినిమాలో నవ్య స్వామి, జగదీశ్ ప్రతాప్ భండారి, రాజ్ తిరందాసు ముఖ్య పాత్రల్లో కనిపించారు. ఇదిలా ఉంటే సెన్సార్ లేకుండానే బుట్టబొమ్మను స్ట్రీమింగ్ చేయబోతున్నారని తెలుస్తోంది. మరి థియేటర్లలో బుట్టబొమ్మను మిస్ అయిన వారు ఎంచెక్కా ఇంట్లోనే చూసి ఎంజాయ్ చేయండి.
#StreamingNow?#ButtaBomma is now streaming on @NetflixIndia
Audio available in Tam, Kan, Mal.#Netflix #cinemaaghar pic.twitter.com/LJPOHvcTBC
— CinemaaGhar (@cinemaa_ghar) March 4, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..