Radhe Shyam Movie: ఓటీటీ సంస్థల చూపు ‘రాధేశ్యామ్’ మూవీ పైనే.. ప్రభాస్ సినిమాకు భారీ ఆఫర్ ఇచ్చిన ప్రైమ్ ?

|

Jun 09, 2021 | 7:31 AM

Radhe Shyam Movie Update: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. సాహో సినిమా తర్వాత చేస్తున్న సినిమా రాధేశ్యామ్. ఇందులో ప్రభాస్‏కు జోడీగా

Radhe Shyam Movie: ఓటీటీ సంస్థల చూపు రాధేశ్యామ్ మూవీ పైనే.. ప్రభాస్ సినిమాకు భారీ ఆఫర్ ఇచ్చిన ప్రైమ్ ?
Radhe Shyam
Follow us on

Radhe Shyam Movie Update: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. సాహో సినిమా తర్వాత చేస్తున్న సినిమా రాధేశ్యామ్. ఇందులో ప్రభాస్‏కు జోడీగా పూజా హెగ్డే హీరోయిన్‏గా నటిస్తుండగా.. జిల్ ఫేం రాధకృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. వారం రోజులు మినహా.. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ప్రస్తుతం కరోనా బ్రేక్ రావడంతో ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. 1960 శాతాబ్దం నాటి వింటేజ్ ప్రేమకథ నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కిస్తున్నాడు రాధకృష్ణ. ఈ సినిమా గురించి అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదైలన ఈ మూవీ పోస్టర్స్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. జూలై 30న ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్లో విడుదల చేయనుంది చిత్రయూనిట్. అయితే ఈ సినిమా విడుదల గురించి ఫిల్మ్ వర్గాల్లో పలు గాసిప్స్ వినిపిస్తున్నాయి.

ఇటీవలే రాధేశ్యామ్ మూవీని కూడా సల్మాన్ ఖాన్ రాధే సినిమా రిలీజ్ చేసినట్లు పే ఫర్ వ్యూ పద్దతిని మేకర్స్ ఫాలో అవనున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. దీంతో బడా ఓటీటీ సంస్థలు రాధేశ్యామ్ కోసం రంగంలోకి దిగాయి. జీ ఫైవ్, ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ ఇలా అన్ని సంస్థలు రాధేశ్యామ్ రైట్స్ కోసం పోటీ పడ్డాయి. అయితే ముందుగా పే ఫర్ వ్యూ పద్దతిని వద్దనుకున్న మేకర్స్.. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ఆఫ్షనే బెటర్ అని అనుకుంటున్నట్లుగా సమాచారం. సెకండ్ వేవ్ పూర్తిగా వెళ్లిపోయినా.. ఇప్పటికిప్పుడు థియేటర్లు ఓపెన్ చేస్తారా..? చేసినా హండ్రెడ్ పర్సెంట్ ఆక్యూపెన్సీ ఇస్తారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు.. ప్రభాస్ వరుస మూవీస్ చేస్తున్నాడు. అన్నింటినీ థియేటర్లలో విడుదల చేయాలంటే.. చాలా సమయం పడుతుంది. దీంతో పే ఫర్ వ్యూ పద్దతికే ఓటేయ్యాలని అనుకున్నారట మేకర్స్. ఇటు పోటీలో ఓటీటీ సంస్థలు ఎన్ని ఆఫర్లు పెట్టినా.. ప్రైమ్ మాత్రం చిత్ర నిర్మాణసంస్థ టీ సిరీస్ ముందుకు.. కళ్లు చెదిరే డీల్ ను తీసుకొచ్చినట్లుగా సమాచారం. ప్రైమ్ సంస్థ.. రాధేశ్యామ్ పై అన్ని హక్కుల కోసం ఏకంగా రూ. 400 కోట్లు ఇచ్చేందుకు సిద్ధమైందని.. టాలీవుడ్ టాక్. వాస్తవానికి రాధేశ్యామ్ మూవీ బడ్జెట్టే.. రూ. 330 కోట్లు అని చెబుతున్నారు. దీంతో ఈ పరిస్థితుల్లో ఇది మంచి ఆఫర్ అని అనుకుంటున్నారట. కానీ.. ఇంతకుముందే నెట్ ఫ్లిక్స్ రూ. 300 కోట్లు చెల్లించేందుకు ఆఫర్ చేసినా.. మేకర్స్ మాత్రం రిజెక్ట్ చేసారట. అయితే ప్రైమ్ డీల్ ను యాక్సెప్ట్ చేస్తుందా..? లేదా అన్నది.. కొన్ని రోజుల్లోనే తెలుస్తుంది.

Also Read: Bimbisara Movie: కళ్యాణ్ రామ్ సినిమాలో భాగం కానున్న ఎన్టీఆర్.. ‘బింబిసార’ కోసం యంగ్ టైగర్ వాయిస్ ?