ప్రతి వారం ఎగ్జయిటింగ్ కంటెంట్‌తో ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తున్న హండ్రెడ్ పర్సెంట్ ఓటీటీ మాధ్యమం ‘ఆహా’. బ్లాక్‌బస్టర్ సినిమాలు, వెబ్ షోస్‌లతో పాత్ బ్రేకింగ్ క్రియేట్ చేస్తున్న ఈ తెలుగు ఓటీటీ మాధ్యమం ఆహాలో ‘కుడి ఎడమైతే’ అనే ప్రెస్టీజియస్ సిరీస్ ప్రసారం అవుతుంది. అమలాపాల్, రాహుల్ విజయ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇండియాలో డిజిటల్ మాధ్యమం ద్వారా ప్రసారమవుతున్న తొలి సైంటిఫికల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ఇది. రామ్ విఘ్నేశ్ రూపొందించిన ఈ సిరీస్‌ను లూసియా, యూ టర్న్ వంటి సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు పవన్ కుమార్ తెరకెక్కించారు. ఈ సిరీస్ మోషన్ పోస్టర్‌ను శనివారం విడుదల చేశారు. ఈ మోషన్ పోస్టర్ చూపించినట్లు గోడపై అతికించిన నోటీసులు, గన్, గడియారం వంటి విజువల్స్ ప్రేక్షకుల్లో ఓ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇందులో అమలాపాల్, విజ్ఞత లేని క్రూరమైన పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తుంటే..రాహుల్ విజయ్ డెలివరీ బాయ్ పాత్రలో కనిపించారు.భిన్నమైన రంగాలకు చెందిన ఇద్దరు వ్యక్తులను జీవితం ఎలా కలిపింది? సైంటిఫిక్ అంశాలు ఈ క్రైమ్ థ్రిల్లర్‌లో ఎలా వచ్చాయి? అనేది తెలుసుకోవాలంటే త్వరలోనే ‘ఆహా’లో ప్రసారం కాబోయే ‘కుడి ఎడమైతే’ అనే సిరీస్ చూడాల్సిందే మరి.
ఆమె, నాయక్, ఇద్దరమ్మాయిలతో, లవ్ ఫెయిల్యూర్ వంటి వైవిధ్యమైన చిత్రాల్లో నటించి నటిగా తన ప్రత్యేకతను చాటుకున్న అమలపాల్‌కు యూత్‌లో మంచి ఆదరణ ఉన్న రాహుల్ విజయ్ వంటి యాక్టర్ తోడు కావటం మంచి సామర్థాన్ని పెంచింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోన్న ఈ సిరీస్‌లో ప్రేక్షకులకు మరిన్ని సర్‌ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఎదురుకానున్నాయి. డైరెక్టర్ పవన్ కుమార్ తన సినిమాలతో ప్రేక్షకుల్లో ఓ ఎగ్జయింట్‌మెంట్‌ను క్రియేట్ చేస్తారనే సంగతి తెలిసిందే. అదే తరహాలో డిఫరెంట్ ఎమోషన్స్, థ్రిల్స్, షాకింగ్ ట్విస్ట్‌లతో మరోసారి ఈ దర్శకుడు తన ప్రతిభను చాటుకోనున్నారు. 2021లో క్రాక్, నాంది, లెవన్త్ అవర్, ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్, చావు కబురు చల్లగా, సుల్తాన్, జాంబి రెడ్డి వంటి సినిమాలు, వెబ్ షోస్‌లతో ఆహా ప్రేక్షకులను అత్యద్భుతంగా ఎంటర్‌టైన్ చేసింది. నాణ్యత గల ఎంటర్‌టైన్‌మెంట్ కావాలనుకున్న తెలుగు ప్రేక్షకుల తొలి ప్రాధాన్యతకు ఉదాహరణగా నిలుస్తోంది ’ఆహా’.
మరిన్ని ఇక్కడ చదవండి :