బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ శివుని పాత్రలో నటించిన చిత్రం ఓ మై గాడ్ 2. 2012లో విడుదలై సూపర్ హిట్ హిట్ గా నిలిచిన ఓ మై గాడ్ ఇది సీక్వెల్. గతేడాది ఆగస్టులో థియేటర్లలో విడుదలైన ఓ మై గాడ్ 2 సూపర్ హిట్ గా నిలిచింది. బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ. 200 కోట్లు రాబట్టింది. అదే సమయంలో ఓ మై గాడ్ 2 సినిమా కథ, కథనం తీవ్ర వివాదాస్పదమయ్యాయి. అలాగే సినిమాలో అక్షయ్ శివుని పాత్రలో నటించడంపై కొందర అభ్యంతరం వ్యక్తం చేశారు. సినిమాపై పలు అభ్యంతరాలు రావడంతో సుమారు 20కి పైగా సీన్లను సెన్సార్ బోర్డ్ కట్ చేయడం గమనార్హం. ఇలా కోట్ల రూపాయల వసూళ్లతో పాటు కాంట్రవర్సీగా నిలిచిన మూవీ ఓ మై గాడ్ హిందీ వెర్షన్ ఇప్పుడే ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది. అయితే గత ఆరు నెలలుగా ఈ సూపర్ హిట్ సినిమా తెలుగు వెర్షన్ కోసం సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడీ నిరీక్షణకు తెరపడింది. మరో ప్రముఖ ఓటీటీ వేదిక జియో సినిమాలో ఓ మై గాడ్ 2 తెలుగు వెర్షన్ అందుబాటులోకి వచ్చింది. తెలుగుతో పాటు బంగ్లా, మరాఠీ భాషలతో పాటు దక్షిణాది లాంగ్వెజెస్ లోనూ ఓ మై గాడ్ 2 స్ట్రీమింగ్ అవుతోంది.
అమిత్ రాయ్ దర్శకత్వంలో వచ్చిన ఓ మై గాడ్ 2 సినిమాలో అక్షయ్ కుమార్ తో పాటు పంకజ్ త్రిపాఠి, యామీ గౌతమ్, గోవింద్ నామ్‌దేవ్ ప్రధాన పాత్రలు పోషించారు. సున్నితమైన లైంగిక విద్య- ప్రాధాన్యత, అవగాహన వంటి అంశాలకు సంబంధించిన కథ కావడంతో ఓ మై గాడ్ 2 మూవీ పలు వివాదాలు ఎదుర్కొంది. చివరికీ సెన్సార్ బోర్డు సైతం ఇందులోని సీన్లకు భారీ కత్తెర వేసింది. ఇలా కాంట్రవర్సీతో పాటు కోట్లాది రూపాయలు వసూళు చేసిన ఓ మై గాడ్ 2 తెలుగు వెర్షన్ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. మరి థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయ్యారా? ఎంచెక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి.
#OMG2 Now Streaming In Tamil Telugu Kannada On Jio Cinema with new ad free plan
Title Font created by me 🙂 pic.twitter.com/h1L1BDGDRs
— SRS CA TV (@srs_ca_tv) April 26, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి