Farhana OTT: ఓటీటీలోకి ఐశ్వర్య రాజేష్‌ కాంట్రవర్సీ మూవీ .. ఫర్హానా స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?

ఐశ్వర్య నటించిన ఫర్హానా చిత్రం ఇటీవల వివాదాల్లో నిలిచింది. ఐశ్వర్య ముస్లిం అమ్మాయి పాత్రలో కనిపించడం, ది కేరళ స్టోరీ తరహా కథాంశం ఉండడంతో ముస్లిం సంఘాలు ఈ సినిమాపై అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ చిత్రంలోని డైలాగ్స్‌, సీన్లు ముస్లిం మహిళలను, హిజాబ్‌ను అవమానించేలా ఉన్నాయని సినిమాపై నిషేధం విధించాలని కూడా డిమాండ్ చేశాయి.

Farhana OTT: ఓటీటీలోకి ఐశ్వర్య రాజేష్‌ కాంట్రవర్సీ మూవీ .. ఫర్హానా స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?
Farhana Movie

Updated on: Jun 13, 2023 | 9:33 AM

టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్‌లో లేడీ ఓరియంటెడ్‌ సినిమాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారింది ఐశ్వర్యా రాజేష్‌. తెలుగు మూలాలున్న ఈ నటి అందం, అభినయానికి అందరూ ముగ్ధులవుతున్నారు. ఈ ఏడాది ఆమె నటించిన ఐదు సినిమాలు విడుదల కావడం విశేషం. డ్రైవర్‌ జమున, ది గ్రేట్ ఇండియన్‌ కిచెన్‌, రన్‌ బేబీ రన్‌, సొప్పన సుందరి, ఫర్హానా సినిమాలు విడుదలై ప్రేక్షకులను మెప్పించాయి. ఇవన్నీ హీరోయిన్‌ ఓరియంటెడ్ సినిమాలే కావడాన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు ఐశ్వర్యకు ఎంత క్రేజ్‌ ఉందో. అయితే ఐశ్వర్య నటించిన ఫర్హానా చిత్రం ఇటీవల వివాదాల్లో నిలిచింది. ఐశ్వర్య ముస్లిం అమ్మాయి పాత్రలో కనిపించడం, ది కేరళ స్టోరీ తరహా కథాంశం ఉండడంతో ముస్లిం సంఘాలు ఈ సినిమాపై అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ చిత్రంలోని డైలాగ్స్‌, సీన్లు ముస్లిం మహిళలను, హిజాబ్‌ను అవమానించేలా ఉన్నాయని సినిమాపై నిషేధం విధించాలని కూడా డిమాండ్ చేశాయి. అయితే తమ సినిమాలో అలాంటివేవీ లేవని క్లారిటీ ఇవ్వడంతో (మే12)న ఫర్హానా థియేటర్లలో రిలీజైంది. తమిళంతో పాటు తెలుగులోనూ రిలీజైన ఈ మూవీ అనూహ్య విజయం సాధించింది. బాక్సాఫీస్‌ వద్ద మంచి కలెక్షన్లు వచ్చాయి. ఇప్పుడీ ఫర్హానా సినిమా ఓటీటీ రిలీజ్‌కు రెడీ అయ్యింది.

ఫర్హానా సినిమా హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ సోని లివ్ సంస్థ దక్కించుకుంది. థియేటర్లలో రిలీజై నెల రోజులు పూర్తి కావడంతో జూన్ 16 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. తమిళ్‌తో పాటు తెలుగులోనూ ఈ మూవీ ప్రసారం కానుంది. ఫర్హానా సినిమాలో ఐశ్వర్య రాజేష్‌తో పాటు కె. సెల్వరాఘవన్‌, అనుమోల్‌ మనోహరన్ కీలక పాత్రలు పోషించారు. నెల్సన్‌ వెంకటేషన్‌ దర్శకత్వం వహించి ఈ సినిమాను డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ పతాకంపై ఎస్‌ఆర్‌ ప్రకాష్‌బాబు, ఎస్‌ఆర్‌ ప్రభు నిర్మించారు. జస్టిన్‌ ప్రభాకరన్‌ స్వరాలు సమకూర్చారు. మరి థియేటర్లలో ఫర్హానా సినిమాను మిస్‌ అయిన వారె ఎంచెక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్‌ చేయండి.

 

ఇవి కూడా చదవండి

 

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

 

Follow Us