Balakrishna AHA: తనలోని మరో కోణాన్ని చూపించనున్న బాలయ్య.. ఆహా వేదికగా ‘అన్‌ స్టాబబుల్‌ విత్‌ ఎన్‌బీకే’..

|

Oct 10, 2021 | 12:38 PM

Balakrishna AHA: సరికొత్త సినిమాలు, వెబ్‌ సిరీస్‌లతో జోరు మీదున్న తొలి తెలుగు ఓటీటీ వేదిక 'ఆహా' తాజాగా మరో సంచలనానికి తెర తీస్తోంది. ఓటీటీలో తొలిసారి టాక్‌ షోలను నిర్వహించి సరికొత్త ఒరవడి సృష్టించిన ఆహా..

Balakrishna AHA: తనలోని మరో కోణాన్ని చూపించనున్న బాలయ్య.. ఆహా వేదికగా అన్‌ స్టాబబుల్‌ విత్‌ ఎన్‌బీకే..
Follow us on

Balakrishna AHA: సరికొత్త సినిమాలు, వెబ్‌ సిరీస్‌లతో జోరు మీదున్న తొలి తెలుగు ఓటీటీ వేదిక ‘ఆహా’ తాజాగా మరో సంచలనానికి తెర తీస్తోంది. ఓటీటీలో తొలిసారి టాక్‌ షోలను నిర్వహించి సరికొత్త ఒరవడి సృష్టించిన ఆహా తాజాగా ఏకంగా నట సింహం బాలకృష్ణతో టాక్‌ షో నిర్వహించనుంది. ‘అన్‌ స్టాపబుల్‌’ పేరుతో రానున్న ఈ షోకు సంబంధించి తాజాగా అధికారికంగా ప్రకటన చేసింది. మొదటి ఎపిసోడ్‌లో భాగంగా బాలకృష్ణ మంచు కుటుంబ సభ్యులతో ఈ షోను నిర్వహించనున్నారని సమాచారం. ఇప్పటి వరకు సినిమాల్లో పంచ్‌ డైలాగ్‌లతో సందడి చేసిన బాలయ్య ఇప్పుడు టాక్‌షో యాంకర్‌గా మారి తోటి తారలను ఆకట్టుకోనున్నాడన్నమాట.

అయితే తొలి ఎపిసోడ్‌ ఎప్పుడు ప్రసారమవుతుందన్న దానిపై మాత్రం ఆహా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఈ విషయాన్ని ట్వి్ట్టర్‌ వేదికగా ప్రకటించిన సంస్థ.. ‘ఆయన అడుగేసి, షో మొదలెడితే.. అన్ని టాక్‌షోలకు ఇది బాప్‌ లాంటిది. పైసా వసూల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌కు సిద్ధమవ్వండి’ అంటూ రాసుకొచ్చారు. దీంతో ఈ షోపై అటు బాలయ్య అభిమానుల్లో క్యూరియాసిటీ నెలకొంది. ఇప్పటి వరకు మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చిన బాలయ్య బాబు తొలిసారి ఇంటర్వ్యూ చేస్తుండడంపై అందరిలోనూ ఆసక్తినెలకొంది.

మరి బాలకృష్ణ తన ప్రశ్నలతో సెలబ్రిటీల నుంచి నిజాలను ఎలా రాబడుతారో చూడాలి. ఇదిలా ఉంటే ఈ షో షూటింగ్ నిర్వహిస్తున్న సమయంలో బాలయ్యకు చిన్న గాయమైనట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా జరిగిన మా అధ్యక్ష ఎన్నికల పోలింగ్‌కు బాలకృష్ణ హాజరు కావడంతో ఆయన ఫ్యాన్స్‌ ఊపిరి పీల్చుకున్నారు.

Also Read:  S S Rajamouli birthday special: టాలీవుడ్ సినిమా స్థాయిని పెంచిన ‘జక్కన్న’ అరుదైన ఫోటోలు.. ‘ఎస్.ఎస్.రాజమౌళి’ స్టైల్ మాములుగా లేదు..

MAA Elections 2021: మా ఎన్నికలకు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశాం: వెస్ట్‌జోన్‌ డీసీపీ ఏఆర్‌ శ్రీనివాస్‌

MAA Elections 2021: మా ఎన్నికల్లో గందరగోళం.. ప్రకాష్ రాజ్, నరేష్ మధ్య మరోసారి మాటల యుద్ధం..