Aha OTT : ఆహా సరికొత్త వెబ్ సిరీస్.. ఆకట్టుకుంటున్న “వేరే లెవెల్ ఆఫీస్” ట్రైలర్

|

Nov 25, 2024 | 2:09 PM

ఆర్ జే కాజల్, అఖిల్ సార్థక్, శుభశ్రీ, మిర్చి కిరణ్, రీతు చౌదరి, స్వాతి చౌదరి, వసంతిక, మహేశ్ విట్టా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. డిసెంబర్ 12వ తేదీ నుంచి వేరే లెవెల్ ఆఫీస్ వెబ్ సిరీస్ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కు రాబోతోంది.

Aha OTT : ఆహా సరికొత్త వెబ్ సిరీస్.. ఆకట్టుకుంటున్న వేరే లెవెల్ ఆఫీస్ ట్రైలర్
Vera Level Office
Follow us on

ఆహా ఓటీటీ ఒరిజినల్స్ గా స్ట్రీమింగ్ కు రాబోతోంది “వేరే లెవెల్ ఆఫీస్” వెబ్ సిరీస్. ఈ సిరీస్ ను వరుణ్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై వరుణ్ చౌదరి గోగినేని నిర్మిస్తున్నారు. ఇ సత్తిబాబు దర్శకత్వం వహిస్తున్నారు. ఆర్ జే కాజల్, అఖిల్ సార్థక్, శుభశ్రీ, మిర్చి కిరణ్, రీతు చౌదరి, స్వాతి చౌదరి, వసంతిక, మహేశ్ విట్టా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. డిసెంబర్ 12వ తేదీ నుంచి వేరే లెవెల్ ఆఫీస్ వెబ్ సిరీస్ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కు రాబోతోంది. ఈ రోజు ఈ సిరీస్ ట్రైలర్ ను హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో జరిగిన ఈవెంట్ లో రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో

నటుడు అఖిల్ సార్థక్ మాట్లాడుతూ – బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక ఒక మంచి ప్రాజెక్ట్ చేయాలని అనుకున్నాను. నాలుగేళ్లుగా ఇలాంటి ప్రాజెక్ట్ కోసం వెయిట్ చేస్తున్నా. వేరే లెవల్ ఆఫీస్ స్క్రిప్ట్ వినగానే నాకు పర్పెక్ట్ స్క్రిప్ట్ అనిపించింది. మా టీమ్ అంతా ఎంజాయ్ చేస్తూ ఈ సిరీస్ లో నటించాం. ఒక మంచి సిరీస్ తో మీ ముందుకు రాబోతున్నాం. డిసెంబర్ 12నుంచి ఆహాలో వేరే లెవెల్ ఆఫీస్ చూడండి. అన్నారు.

నటి శుభశ్రీ మాట్లాడుతూ – ఫ్రెండ్స్ వెబ్ సిరీస్ నా ఫేవరేట్ వెబ్ సిరీస్. అలాంటి ఒక సిరీస్ లో నటించే అవకాశం వస్తే బాగుండేది అని అనిపించేది. ఆ క్రమంలో నాకు వేరే లెవెల్ ఆఫర్ వచ్చింది. స్క్రిప్ట్ విన్నప్పుడు చాలా హ్యాపీగా ఫీలయ్యాను. 50 ఎపిసోడ్స్ గా ఈ సిరీస్ రాబోతోంది. మేమంతా సందడిగా షూటింగ్ చేశాం. ఇలాంటి సిరీస్ ఇప్పటిదాకా తెలుగులో రాలేదని చెప్పగలను. అన్నారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..