AHA OTT: ‘ఆహా’ ప్రేక్షకులకు ప్రతి రోజూ పండగే.. దసరా నుంచి నుంచి సంక్రాంతి వరకు నాన్‌స్టాప్‌ కొత్త సినిమాలు, షోలు..

|

Oct 12, 2021 | 5:28 PM

AHA OTT: తొలి తెలుగు ఓటీటీగా వచ్చిన 'ఆహా' అనతికాలంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఓటీటీలో సరికొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి ఓటీటీ చరిత్రలో సరికొత్త ట్రెండ్ తీసుకొచ్చింది ఆహా. ఇక కేవలం సినిమాలకే పరిమితం..

AHA OTT: ఆహా ప్రేక్షకులకు ప్రతి రోజూ పండగే.. దసరా నుంచి నుంచి సంక్రాంతి వరకు నాన్‌స్టాప్‌ కొత్త సినిమాలు, షోలు..
Follow us on

AHA OTT: తొలి తెలుగు ఓటీటీగా వచ్చిన ‘ఆహా’ అనతికాలంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఓటీటీలో సరికొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి ఓటీటీ చరిత్రలో సరికొత్త ట్రెండ్ తీసుకొచ్చింది ఆహా. ఇక కేవలం సినిమాలకే పరిమితం కాకుండా ఒరిజినల్‌ వెబ్‌ సిరీస్‌లతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలోనే మరికొంత మంది సబ్‌స్క్రైబర్లను పెంచుకోవడంతో పాటు ఇప్పటికే ఉన్న వారికి వినోదాన్ని అందించేందుకు దసరా నుంచి సంక్రాంతి వరకు నాన్‌స్టాప్‌గా ఎంటర్‌టైన్‌మెంట్ అందించేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగానే మొత్తం 12 వారాల్లో (90 రోజులు), 20 కొత్త సినిమాలు, షోలతో ఫుల్‌ ప్యాక్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందిస్తున్నట్లు ట్విట్టర్‌ వేదికగా ప్రకటించింది.

ఇంకా విడుదల కానీ సినిమాలను కూడా ఆహా ఈ మూడు నెలల్లో ప్రేక్షకుల కోసం తీసుకురానుంది. ఇందులో భాగంగానే ఆహా ఒక స్పెషల్‌ వీడియోను సైతం పోస్ట్‌ చేసింది. ఆహా ఈ పండక్కి అందిస్తోన్న సినిమాల్లో 9 వరల్డ్‌ డిజిటల్‌ ప్రిమియర్స్‌ సినిమాలు ఉన్నట్లు ప్రకటించింది. త్వరలో ఆహాలో రాబోతున్న ముఖ్యమైన సినిమాల్లో మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌, లవ్‌స్టోరీ, లక్ష్య (నాగశౌర్య), మంచి రోజులు వచ్చాయ్‌, డీజే టిల్లు, రొమాంటిక్‌ (ఆకాష్‌ పూరి), అనుభవించు రాజా, పుష్పక విమానం, గని వంటి చిత్రాలు ఉన్నాయి.

ఇక వీటితో పాటు ఆహా ఒరిజినల్స్‌.. సేనాపతి, భమా కలాపం (ప్రియమణి), త్రీ రోజేస్‌, అన్యాస్‌ ట్యూటోరియల్‌, అడల్టింగ్‌, ఇట్స్‌ నాటే ఏ లవ్‌ స్టోరీ, సేఘు టాకీస్‌, ఇంటింటి రామాయణం, క్యూబుల్‌ హై, సర్కార్‌లతో పాటు నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘అన్‌స్టాబబుల్‌ విత్‌ ఎన్‌బీకే’ వంటి షోలు ఉన్నాయి. ఇలా సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు, టాక్‌ షోలతో ఆహా సరికొత్త వీనుల విందును అందించేందుకు సిద్ధమైందన్న మాట. ఇంకెందుకు మరి ఆలస్యం వెంటనే ఆహాకు సబ్‌స్క్రైబ్‌ అయ్యి ఈ వినోదాల జడివానలో మీరూ తడిచిపోండి.

Also Read: Ram Gopal Varma: దేవుడిని నమ్మనని చెప్పే ఆర్‌జీవీ.. గుడి మెట్లు ఎక్కాడు. ఇదంతా ఎవరి కోసమో తెలుసా.?

MAA elections 2021 Winner list: సుడిగాలి సుధీర్‌కు, సంపూకు భారీగా ఓట్లు.. రికార్డ్ రేంజ్ విక్టరీ

AP CM Jagan Aasara: ఏపీలో ఆడపడుచులకు ఆసరా వారోత్సవాల పేరుతో మరో దసరా పండుగ తెచ్చిన జగన్ సర్కారు