అవకాయ బిర్యానీ సినిమాతో కథానాయికగా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది బింధుమాధవి. అందం.. అభినయం ఎంత ఉన్నా.. ఈ అమ్మడికి హీరోయిన్‍గా అవకాశాలు మాత్రం అంతగా రాలేదు. దీంతో తెలుగు తెరకు కాకుండా.. తమిళంలో బిజీ అయ్యింది బింధు. చాలా కాలం తర్వాత ఇటీవల బిగ్ బాస్ ఓటీటీలో ఆడపులిలా ఆడి విజేతగా నిలిచింది. తనకు పోటీగా ఉన్న అఖిల్ ను ఆడ ఆడ అంటూ కన్నీరు పెట్టించి.. టైటిల్ సొంతం చేసుకుంది. బిగ్ బాస్ ఓటీటీతో మరోసారి బింధుమాధవికి ఫాలోయింగ్ పెరిగింది. ఇక ఇప్పుడు సినిమాల్లో కాకుండా డిజిటల్ వేదికపై సత్తా చాటుతుంది బింధు. వరుస వెబ్ సిరీస్ చేస్తూ ఫుల్ బిజీ అయ్యింది. తాజాగా ఆమె నటిస్తోన్న వెబ్ సిరీస్ న్యూసెన్స్. సస్పెన్స్ థ్రిల్లర్ డ్రామాగా వస్తున్న ఈ సిరీస్ లో నవదీప్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ సిరీస్ మే12 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా శనివారం ట్రైలర్ రిలీజ్ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బింధుమాధవికి కొన్ని చిక్కు ప్రశ్నలు ఎదురయ్యాయి.
త్రిష బాయ్ ఫ్రెండ్ తో మీరు డేటింగ్ లో ఉన్నారనే రూమర్ వచ్చింది.. అది నిజమా ? అని ప్రశ్నించగా.. సూటిగా ఆన్సర్ ఇచ్చింది బింధుమాధవి. ఆమె మాట్లాడుతూ.. “ఔను నిజమే.. కానీ వేరు వేరు సందర్బాల్లో అది జరిగింది. ఒకే టైంలో ఇద్దరం చేయలేదు. త్రిషతో బ్రేకప్ అయిన తర్వాత నాతో డేట్. నిజాన్ని ఒప్పుకోవాలి తప్పదు’ అంటూ నిర్మొహమాటంగానే చెప్పేసింది. అలాగే తనకు వెబ్ సిరీస్ మాత్రమే కాకుండా మూవీస్ ఆఫర్స్ కూడా రావాలని కోరుకుంటున్నాని.. కానీ బిగ్ బాస్ తర్వాత అన్ని వెబ్ సిరీస్ ఆఫర్స్ వస్తున్నాయని చెప్పుకొచ్చింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.