AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mansion 24: మిస్టరీ థ్రిల్లర్‏గా వరలక్ష్మీ శరత్ కుమార్ ‘మాన్షన్ 24’.. ఆసక్తికరంగా అవికా పోస్టర్..

ఇప్పటివరకు వెండితెరపై మెప్పించిన వరలక్ష్మీ ఇప్పుడు డిజిటల్ ప్లాట్ ఫామ్ పై అలరించేందుకు సిద్ధమయ్యింది. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తోన్న వెబ్ సిరీస్ మాన్షన్ 24. మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్‏గా రాబోతున్న ఈ సిరీస్.. ఓ మాన్షన్ చుట్టూ అల్లుకున్న హారర్ స్టోరీ. దీనిని ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ హాట్ స్టార్ నిర్మించగా.. యాంకర్ ఓంకార్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సిరీస్.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇటీవల విడుదల చేసిన వరలక్ష్మి పోస్టర్ ఆసక్తిని పెంచేసింది.

Mansion 24: మిస్టరీ థ్రిల్లర్‏గా వరలక్ష్మీ శరత్ కుమార్ 'మాన్షన్ 24'.. ఆసక్తికరంగా అవికా పోస్టర్..
Mansion 24 Web Series
Rajitha Chanti
|

Updated on: Sep 23, 2023 | 11:03 AM

Share

ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో హీరోయిన్‏గా కాకుండా విలనిజంతో మెప్పిస్తోంది వరలక్ష్మీ శరత్ కుమార్. తమిళంతోపాటు.. తెలుగులో అనేక చిత్రాల్లో ప్రతి నాయకురాలి పాత్రలో తన అద్భుతమైన నటనతో ప్రశంసలు అందుకుంటుంది. అయితే ఇప్పటివరకు వెండితెరపై మెప్పించిన వరలక్ష్మీ ఇప్పుడు డిజిటల్ ప్లాట్ ఫామ్ పై అలరించేందుకు సిద్ధమయ్యింది. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తోన్న వెబ్ సిరీస్ మాన్షన్ 24. మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్‏గా రాబోతున్న ఈ సిరీస్.. ఓ మాన్షన్ చుట్టూ అల్లుకున్న హారర్ స్టోరీ. దీనిని ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ హాట్ స్టార్ నిర్మించగా.. యాంకర్ ఓంకార్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సిరీస్.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇటీవల విడుదల చేసిన వరలక్ష్మి పోస్టర్ ఆసక్తిని పెంచేసింది.

త్వరలోనే ఈ సిరీస్ స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు. ఈ క్రమంలోనే ఇందులోని మెయిన్ పాత్రలకు సంబంధించిన ఒక్కో పోస్టర్ రిలీజ్ చేస్తూ సిరీస్ పై మరింత క్యూరియాసిటిని పెంచేస్తున్నారు. తాజాగా ఈ సిరీస్ నుంచి అవికా గోర్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. రక్తంతో తడిసిన ఒక వెపన్ పట్టుకుని కసితో కూడిన చూపులతో కనిపిస్తోంది అవికా. ఆమె కళ్లల్లోనూ రక్తం కనిపిస్తుంది. తాజాగా విడుదలైన ఈ పోస్టర్ సిరీస్ పై ఆసక్తిని పెంచుతుంది. ఇందులో అవికా గోర్ బింధుమాధవి, మీనా కుమారి, విధ్యుల్లేఖ రామన్, అభినయ, తులసి, రావు రమేశ్, సత్యరాజ్, రాజీవ్ కనకాల కీలకపాత్రలు పోషిస్తున్నారు.

మాన్షన్ 24 తెలుగులో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. ఇప్పటికే ఎన్నో హారర్ సిరీస్ అందించిన హాట్ స్టార్.. ఇప్పుడు మరో కొత్త మిస్టరీ హర్రర్ థ్రిల్లర్ సిరీస్ జాబితాలో ఈ మాన్షన్ 24ను స్ట్రీమింగ్ చేయనుంది. రాజు గారి గది, రాజు గారి గది 2 చిత్రాలతో ప్రేక్షకులను నవ్వించి భయపెట్టిన ఓంకార్.. ఇప్పుడు మరోసారి టెన్షన్ పెట్టేందుకు రెడీ అయ్యారు. ఈ సిరీస్ ట్రైలర్ తోపాటు.. స్ట్రీమింగ్ తేదీని త్వరలోనే అనౌన్స్ చేయనున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

నాటు కోడి Vs ఫారం కోడి.. రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది..?
నాటు కోడి Vs ఫారం కోడి.. రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది..?
నవ్వితే పోయేదేం లేదు.. అనారోగ్యం తప్ప..! అందుకే హాయిగా నవ్వుకోండి
నవ్వితే పోయేదేం లేదు.. అనారోగ్యం తప్ప..! అందుకే హాయిగా నవ్వుకోండి
గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు.. కేంద్రం షాకింగ్ డెసిషన్!
గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు.. కేంద్రం షాకింగ్ డెసిషన్!
బాలీవుడ్‌ ఎంట్రీపై ఎగ్జైటింగ్‌గా యంగ్ బ్యూటీ!
బాలీవుడ్‌ ఎంట్రీపై ఎగ్జైటింగ్‌గా యంగ్ బ్యూటీ!
దేశంలోనే అద్భుతం.. ఈ గ్రామంలో ఒక్క ఇంట్లో కూడా వంట చెయ్యరు..
దేశంలోనే అద్భుతం.. ఈ గ్రామంలో ఒక్క ఇంట్లో కూడా వంట చెయ్యరు..
భర్త కాదు.. కాలయముడు.. భార్యను చంపి మృతదేహాంతో..
భర్త కాదు.. కాలయముడు.. భార్యను చంపి మృతదేహాంతో..
క్రిప్టో ఇన్వెస్టర్లకు అలర్ట్.. 2026లో ఈ 5 తప్పులు చేస్తే భారీ న
క్రిప్టో ఇన్వెస్టర్లకు అలర్ట్.. 2026లో ఈ 5 తప్పులు చేస్తే భారీ న
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది
హోటల్ స్టైల్ గ్రీన్ చికెన్ కర్రీ.. టేస్టీగా మీ ఓన్ కిచెన్‎లోనే..
హోటల్ స్టైల్ గ్రీన్ చికెన్ కర్రీ.. టేస్టీగా మీ ఓన్ కిచెన్‎లోనే..
చలి పెడుతుందని రూమ్ హీటర్ వాడుతున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి
చలి పెడుతుందని రూమ్ హీటర్ వాడుతున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి