OTT Movie: ఊహించని ట్విస్టులు.. దిమ్మతిరిగే క్లైమాక్స్.. అంజలి నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీని చూశారా..?

సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లలో అంజలి ఒకరు. తెలుగు, తమిళం భాషలలో వరుస సినిమాల్లో నటిస్తూ తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. గ్లామర్ రోల్స్ కాకుండా నటనకు ప్రాధాన్యత ఉన్న చిత్రాలను ఎంచుకుంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. అయితే అంజలి నటించిన అద్భుతమైన క్రైమ్ థ్రిల్లర్ ఇప్పుడు ఓటీటీలో దూసుకుపోతుంది.

OTT Movie: ఊహించని ట్విస్టులు.. దిమ్మతిరిగే క్లైమాక్స్.. అంజలి నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీని చూశారా..?
Iratta

Updated on: Apr 07, 2025 | 7:16 AM

ఓటీటీలో దూసుకుపోతున్న క్రైమ్ థ్రిల్లర్ చిత్రాల్లో హీరోయిన్ అంజలి నటించిన సినిమా ఒకటి. ఈ మూవీ గురించి చాలా మందికి తెలియకపోవచ్చు. కానీ ఓటీటీలో మాత్రం ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తుంది. . ఒక వ్యక్తి చేసిన అపరాధ భావన, తప్పులు అతనిని ఎలా చంపుతాయనేది ఈ సినిమా కథ. ఆ సినిమాలో బోజు జార్జ్ ప్రధాన పాత్ర పోషించారు. అంజలి నటించిన ఈ మూవీ పేరు ఇరట్ట. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో అందుబాటులో ఉంది. ఇరట్ట అంటే కవలలు అని అర్థం. మలయాళ చిత్ర పరిశ్రమలో ఇప్పటివరకు విడుదలైన సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ జానర్ చిత్రాల కంటే ఈ చిత్ర కథాంశం పూర్తిగా భిన్నంగా ఉంటుంది.

కథ విషయానికి వస్తే..

కేరళలోని ఇడుక్కి జిల్లాలోని వాగమోన్ పోలీస్ స్టేషన్ వద్ద కాల్పులు కలకలం సృష్టిస్తాయి. స్టేషన్ ASI వినోద్ (బోజు జార్జ్) రక్తపు మడుగులో చనిపోయి ఉంటాడు. వినోద్ సోదరుడు డీఎస్పీ ప్రమోద్ (బోజు జార్జ్) విషయం తెలుసుకుని అక్కడకు వచ్చి స్టేషన్‌లో ఏం జరిగింది? వినోద్ హత్యకు గురయ్యాడా? అతను ఆత్మహత్య చేసుకున్నాడా? ఒకవేళ హత్య జరిగి ఉంటే, హంతకులు ఎవరు? అనే విషయాలను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఈ చిత్రంలో ప్రతి సన్నివేశం ఆద్యంతం ఊహించని విధంగా ఉంటుంది.

ఇక చివరగా 24 నిమిషాలపాటు క్లైమాక్స్ ప్రేక్షకులను మరింత ఎమోషనల్ టచ్ ఇస్తూనే భయపెట్టిస్తుంది. ఈ సినిమాలో అంజలి, సునీల్ సూర్య, సాబుమోన్ అబ్దుసమద్, అభిరామ్ రాధాకృష్ణన్, స్రింత, ఆర్య సలీం, కీలకపాత్రలు పోషించారు. ఈ సినిమా జోజు జార్జ్ ద్విపాత్రాభినయంలో నటించిన వన్ మ్యాన్ షో.

ఇవి కూడా చదవండి : 

Tollywood: మరీ ఇంత క్యూట్‏గా ఉందేంటీ భయ్యా.. గిబ్లి ఆర్ట్‏కే మతిపోగొట్టేస్తోన్న టాలీవుడ్ హీరోయిన్..

Tollywood: అప్పుడు రజినీకాంత్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు బుల్లితెరపై క్రేజీ హీరోయిన్.. ఫోటోస్ చూస్తే..

Actress Indraja : నటి ఇంద్రజ కూతుర్ని చూశారా.. ? అందంలో తల్లిని మించిపోయింది.. స్టార్ హీరోయిన్స్ సైతం..

Tollywood : చేసిన ఒక్క సినిమా అట్టర్ ప్లాప్.. కట్ చేస్తే.. నెట్టింట గ్లామర్ అరాచకం ఈ వయ్యారి.. ఎవరీ ముద్దుగుమ్మ..