Dasara Movie: ఓటీటీలోకి వచ్చేస్తోన్న బ్లాక్ బస్టర్ హిట్ మూవీ.. ‘దసరా’ స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

|

Apr 16, 2023 | 11:43 AM

తొలి ప్రయత్నంలోనే సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల. సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో వచ్చిన ఈ మూవీలో నాని మునుపెన్నడూ కనిపించనంత మాస్ క్యారెక్టర్ లో కనిపించి ఆకట్టుకున్నారు. అలాగే కీర్తి సైతం గ్రామీణ అమ్మాయి అద్భుతంగా నటించి మెప్పించింది. ఈ సినిమాతో నాని మాస్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు.

Dasara Movie: ఓటీటీలోకి వచ్చేస్తోన్న బ్లాక్ బస్టర్ హిట్ మూవీ.. దసరా స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
Dasara
Follow us on

ఇటీవల బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన చిత్రాల్లో దసరా ఒకటి. న్యాచురల్ స్టార్ నాని.. కీర్తి సురేష్ జంటగా నటించిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మార్చి 30న ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకుంది. రిలీజ్ అయిన పదిరోజుల్లోనే ఏకంగా రూ. 100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి.. నాని కెరిర్ లోనే బిగ్గెస్ట్ హిట్ సాధించిన సినిమాగా నిలిచింది. అంతేకాదు..తొలి ప్రయత్నంలోనే సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల. సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో వచ్చిన ఈ మూవీలో నాని మునుపెన్నడూ కనిపించనంత మాస్ క్యారెక్టర్ లో కనిపించి ఆకట్టుకున్నారు. అలాగే కీర్తి సైతం గ్రామీణ అమ్మాయి అద్భుతంగా నటించి మెప్పించింది. ఈ సినిమాతో నాని మాస్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు.

మొదటి రోజే భారీ ఓపెనింగ్స్ తోపాటు.. అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టింది దసరా సినిమా. పాన్ ఇండియా లెవల్లో విడుదలైన కాసుల వర్షం కురిపించిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యింది. లేటేస్ట్ అప్డేట్ ప్రకారం మే 30 నుంచి దసరా సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. దాదాపు రూ. 22 కోట్లకు దసరా డిజిటల్ రైట్స్ కొనుగోలు చేసినట్లు సమాచారం. అయితే హిందీ వెర్షన్ హక్కులను మాత్రం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సంస్థ దక్కించుకుందని తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానున్నట్లు టాక్.

ఓవైపు థియేటర్లలో సత్తా చాటిన ఈ సినిమా .. ఇటు సోషల్ మీడియాలోనూ ట్రెండ్ అవుతుంది. ఇందులోని చమ్కీల అంగిలేసి సాంగ్ తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే. అలాగే ఈ మూవీలోని డిలిటెడ్ సీన్స్ కూడా యూట్యూబ్ లో మిలియన్స్ వ్యూస్ తో దూసుకుపోతున్నాయి. ఈ చిత్రానికి సంతోష్ నారాయణ్ సంగీతం అందించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.