Naga Chaitanya: ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వనున్న నాగచైతన్య.. వెబ్ సిరీస్‏లో ఆ పాత్రలో చైతూ..

అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya) ఇప్పుడు ఫుల్ జోష్ మీదున్నాడు. గతేడాది శేఖర్ కమ్ముల తెరకెక్కించిన

Naga Chaitanya: ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వనున్న నాగచైతన్య.. వెబ్ సిరీస్‏లో ఆ పాత్రలో చైతూ..
Naga Chaitanya

Updated on: Jan 29, 2022 | 7:41 AM

అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya) ఇప్పుడు ఫుల్ జోష్ మీదున్నాడు. గతేడాది శేఖర్ కమ్ముల తెరకెక్కించిన లవ్ స్టోరీ (Love Story)తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు చైతూ.. ఈ సినిమాతో నాగచైతన్య మంచి ఫాం మీద దూసుకుపోతున్నాడు. ఇక ఇటీవల నాగార్జున.. నాగచైతన్య కలిసి నటించిన బంగార్రాజు (Bangarraju) సినిమా కూడా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా మంచి వసూళ్లు రాబట్టింది. ప్రస్తుతం నాగచైతన్య థాంక్యూ (Thank You) మూవీ చేస్తున్నాడు. ఇందులో చైతూ సరసన రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ఇక మరోవైపు చైతూ.. అమీర్ ఖాన్ నటిస్తోన్న లాల్ సింగ్ చద్దా మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సినిమాలో కీలకపాత్రలో చైతూ కనిపించబోతున్నాడు..

ఇదిలా ఉంటే.. చైతూ ఇప్పుడు డిజిటల్ రంగంలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ సంస్థ నిర్మిస్తోన్న ఓ వెబ్ సిరీస్‏లో చైతూ ప్రధాన పాత్రలో నటించనున్నాడు. భారీ బడ్జెట్ తో ఈ వెబ్ సిరీస్ నిర్మించనున్నారట. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ వెబ్ సిరీస్‏లో చైతూ జర్నలిస్ట్ పాత్రలో నటించనున్నారని సమాచారం. చైతూ రోల్ పూర్తిగా నెగిటివ్ షెడ్స్ లో ఉండనుందట. అంతేకాదు… చైతన్య మేకోవర్ కూడా విభిన్నంగా ఉందనుందట. మూడు సీజన్లుగా ఈ సీరిస్ ను ప్రసారం చేయనున్నారని టాక్. ఒక్క సీజన్లో 8 నుంచి 10 ఎపిసోడ్లు కలిగి ఉంటాయని సమాచారం. అలాగే ఇది టైమ్ ట్రావెల్ స్టోరీ అన్నట్లుగా టాక్. త్వరలోనే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ప్రకటించనున్నారట.

Also Read: Samantha: పడిపోయినా లేచి నిల్చున్నాను.. వదిలేయాలని ఆలోచన వచ్చినా వదిలిపెట్టలేదు.. సమంత పోస్ట్ వైరల్..

Gangubai Kathiawadi: థియేటర్లలోకి గంగూబాయి కతియావాడి.. అలియా భట్ సినిమా రిలీజ్ ఎప్పుడంటే..

Aadavallu Meeku Johaarlu: ఆడవాళ్లు మీకు జోహార్లు రిలీజ్ అయ్యేది అప్పుడే.. విడుదల తేది ప్రకటించిన చిత్రయూనిట్..

Janhvi Kapoor: టాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైన అతిలోక సుందరి తనయ.. ఏ సినిమాతో అంటే..