Rajamouli: రాజమౌళి డిజిటల్‌ ఎంట్రీ కాన్ఫామ్‌ అయినట్లేనా.. జక్కన్నతో భారీ డీల్‌ కుదుర్చుకునే పనిలో ఓటీటీ సంస్థ..

Rajamouli: ప్రస్తుతం వెబ్ సిరీస్‌ల హవా నడుస్తోంది. ఓటీటీ సంస్థల హవా పెరగడం, డిజిటల్‌ స్క్రీన్‌కు జనాలు కూడా ఆకర్షితులవుతుండడంతో ఈ రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నారు. ఇక మేకర్స్‌ కూడా వెబ్‌ సిరీస్‌లను తెరకెక్కిచండానికి ఆసక్తి చూపిస్తున్నారు. తాము చెప్పదలుచుకున్న కథను...

Rajamouli: రాజమౌళి డిజిటల్‌ ఎంట్రీ కాన్ఫామ్‌ అయినట్లేనా.. జక్కన్నతో భారీ డీల్‌ కుదుర్చుకునే పనిలో ఓటీటీ సంస్థ..

Updated on: Jul 12, 2022 | 4:49 PM

Rajamouli: ప్రస్తుతం వెబ్ సిరీస్‌ల హవా నడుస్తోంది. ఓటీటీ సంస్థల హవా పెరగడం, డిజిటల్‌ స్క్రీన్‌కు జనాలు కూడా ఆకర్షితులవుతుండడంతో ఈ రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నారు. ఇక మేకర్స్‌ కూడా వెబ్‌ సిరీస్‌లను తెరకెక్కిచండానికి ఆసక్తి చూపిస్తున్నారు. తాము చెప్పదలుచుకున్న కథను ఎన్ని భాగాల్లో అయినా చెప్పే అవకాశం ఉండడం, ఎక్కువ మందికి చేరువ అయ్యే మార్గం ఉండడంతో అగ్ర దర్శకులు వెబ్‌ సిరీస్‌లకు సై అంటున్నారు. ఇప్పటికే పలువురు దర్శకులు వెబ్‌ సిరీస్‌లకు దర్శకత్వం వహించగా, ఇప్పుడీ జాబితాలోకి అగ్ర దర్శకుడు రాజమౌళి వచ్చి చేరనున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ జక్కన్నతో పనిచేయనుందని వార్తలు వస్తున్నాయి.

ఇదిలా ఉంటే రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి చిత్రానికి ప్రీక్వెల్‌గా ‘బాహుబలి: బిఫోర్‌ ది బిగినింగ్‌’ పేరుతో నెట్‌ఫ్లిక్స్‌ ఓ వెబ్‌ సిరీస్‌ను ప్రారంభించింది. అయితే ఈ ప్రాజెక్ట్‌ ప్రారంభమైన కొన్ని రోజులకే ప్రాజెక్టును రద్దు చేస్తున్నట్లు నెట్‌ఫ్లిక్స్‌ ప్రకటించింది. తాము ఆశించిన స్థాయిలో నిర్మాణం జరగలేదని నెట్‌ఫ్లిక్స్‌ ఆ సిరీస్‌ను పక్కన పెట్టేసింది. ఇప్పుడు ఏకంగా రాజమౌళితోనే వెబ్‌ సిరీస్‌ను తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ వెబ్‌ సిరీస్‌ను కేవలం ఇండియాకే పరిమితం కాకుండా ఇతర దేశాల భాషల్లోనూ విడుదల చేయనున్నట్లు సమాచారం. అయితే దీనిపై ఇప్పటి వరకు ఇటు రాజమౌళికానీ, అటు నెట్‌ఫ్లిక్స్‌ కానీ ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం చేయలేదు.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే ఆర్‌.ఆర్‌.ఆర్‌తో భారీ విజయాన్ని అందుకున్న తర్వాత రాజమౌళి మహేష్‌ బాబుతో ఓ సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. వచ్చే ఏడాది ఈ సినిమాను ప్రారంభించడానికి మేకర్స్‌ సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం కథపై చర్చలు జరుగుతున్నాయి. దీంతో ఈ గ్యాప్‌లో రాజమౌళి నెట్‌ఫ్లిక్స్‌ సిరీస్‌పై పని మొదలు పెట్టనున్నారని సమాచారం. మరి ఈ ప్రచారంలో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..