My Dear Donga OTT: ఆహాలో రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌ టైనర్‌.. ‘మై డియర్ దొంగ’ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

ప్రముఖ కమెడియన్‌ అభిన‌వ్ గోమ‌టం హీరోగా తెరకెక్కిన రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ 'మై డియర్ దొంగ'. షాలిని కొండెపూడి హీరోయిన్‌గా నటించింది. టక్క‌రి దొంగ విన్నారు. జేబు దొంగ విన్నారు. కానీ మై డియ‌ర్ దొంగ ఎవ‌రో తెలియాలంటే త్వ‌ర‌లో ఆహా ఓటీటీలో చూడాల్సిందే' అంటూ రిలీజ్‌ చేసిన ఈ పోస్టర్‌ అందరినీ ఆకట్టుకుంటోంది.

My Dear Donga OTT: ఆహాలో రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌ టైనర్‌.. 'మై డియర్ దొంగ' స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
My Dear Donga Movie
Follow us
Basha Shek

|

Updated on: Jan 17, 2024 | 12:07 PM

ఇండియాలో నెంబ‌ర్ వ‌న్ తెలుగు ఓటీటీ మాధ్య‌మం ఆహా ఎప్ప‌టిక‌ప్పుడు స‌రికొత్త ఎంట‌ర్‌టైనింగ్ ప్రోగ్రామ్స్‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తూ ఉంది. ఈ స‌క్సెస్‌ఫుల్ జ‌ర్నీలో మరొక స‌రికొత్త కామెడీ ఫిల్మ్ భాగం కానుంది. ప్రముఖ కమెడియన్‌ అభిన‌వ్ గోమ‌టం హీరోగా తెరకెక్కిన రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ ‘మై డియర్ దొంగ’. షాలిని కొండెపూడి హీరోయిన్‌గా నటించింది. తాజాగా ఈ ఒరిజిన‌ల్ ఫిల్మ్‌కు సంబంధించిన స్నీక్ పీక్‌ను ప్రేక్ష‌కుల‌కు అందించింది ఆహా. ఆహా క్యామ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ రూపొందించిన ఈ చిత్రానికి షాలిని కొండెపూడి ర‌చ‌యిత‌గా పనిచేయడం విశేషం. ఇందులో అభినమ్‌ గోమటం ఓ చిన్న దొంగగా కనిపించాడు. మ్యాగీ ప్యాకెట్‌ సహా ఎవ‌రూ ఊహించ‌ని చిన్న చిన్న వ‌స్తువుల‌ను కూడా దొంగ‌త‌నం చేస్తుంటాడు. మరి అలాంటి దొంగ జీవితంలోకి హీరోయిన్‌ షాలిని కొండెపూడి ఎలా వచ్చింది? ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే మై డియర్‌ దొంగ మూవీ చూడాల్సిందేనంటున్నారు మేకర్స్‌. తాజాగా రిలీజైన పోస్ట‌ర్ చూస్తుంటే ఈ సినిమాలో మంచి ఫన్‌ ఉందని, ప్రేక్షకులకు రోల‌ర్ కోస్ట‌ర్ ఎక్స్‌పీరియెన్స్‌ను అందిస్తుందంటోంది చిత్రబృందం. ‘టక్క‌రి దొంగ విన్నారు. జేబు దొంగ విన్నారు. కానీ మై డియ‌ర్ దొంగ ఎవ‌రో తెలియాలంటే త్వ‌ర‌లో ఆహా ఓటీటీలో చూడాల్సిందే’ అంటూ రిలీజ్‌ చేసిన ఈ పోస్టర్‌ అందరినీ ఆకట్టుకుంటోంది.ఈ పోస్ట‌ర్‌లో డోర్ చాటుకూ దాక్కొని అభిన‌వ్ గోమ‌ఠం క‌నిపిస్తున్నాడు. శాలిని దేనినో చూసి షాక్ అవుతోన్న‌ట్లుగా పోస్ట‌ర్‌లో క‌నిపిస్తోంది.

ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న మై డియర్‌ దొంగ త్వరలోనే స్ట్రీమింగ్ కానుంది. ఈ జ‌న‌వ‌రి నెలాఖ‌రునే డిజిటల్‌ స్ట్రీమింగ్‌కు రానుందని తెలుస్తోంది. త్వ‌ర‌లోనే రిలీజ్ డేట్‌ను ఆహా అఫీషియ‌ల్‌గా అనౌన్స్ చేయనున్నట్లు తెలుస్తోంది. మై డియ‌ర్ దొంగ మూవీకి స‌ర్వ‌జ్ఞ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు.  ఈ సినిమాను మ‌హేశ్వ‌ర్ రెడ్డి నిర్మించాడు. అజయ్ అరసాడ సంగీతం అందించారు.

ఇవి కూడా చదవండి

త్వరలోనే ఆహాలో స్ట్రీమింగ్..

అభినవ్ గోమటం హీరోగా…

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.