సక్సెస్, ఫెయిల్యూర్స్‌తో సంబంధం లేకుండా వరసగా సినిమాలు చేస్తున్నాడు ఆది సాయికుమార్. ఏడాదిలో సుమారు నాలుగైదు సినిమాలతో ప్రేక్షకులను పలకరిస్తున్నాడీ యంగ్ హీరో. గతేడాది ఏకంగా ఐదు సినిమాలు చేసిన ఆది సాయికుమార్ ఈ ఏడాది సీఎస్‌ఐ సనాతన్ మూవీతో మన ముందుకు వచ్చాడు. ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా మార్చి 10న విడుదలైంది. థియేటర్లలో ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆది సాయి కుమార్ యాక్షన్ సీక్వెన్స్‌కు తోడు, ఆసక్తికరమైన కథా కథనాలు ప్రేక్షకులను మెప్పించాయి. థియేటర్లలో ఓ మోస్తరు హిట్‌గా నిలిచిన సీఎస్‌ఐ సనాతన్ సినిమా ఓటీటీలో రిలీజైంది. అది కూడా రెండు డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్‌లో. మంగళవారం అర్ధరాత్రి నుంచి అమెజాన్ ప్రైమ్, ఆహా ఓటీటీ యాప్‌లో ఆది సాయికుమార్ స్ట్రీమింగ్ అవుతోంది. ఆది సాయికుమార్ గత సినిమాలు థియేటర్లలో పెద్దగా ఆడకపోయినా ఓటీటీల్లో మాత్రం సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ఇప్పుడీ జాబితాలో సీఎస్‌ఐ సనాతన్ కూడా చేరింది. ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ కావడంతో ఓటీటీ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటోంది.
సీఎస్‌ఐ సనాతన్ ఆది సాయికుమార్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా నటించి మెప్పించారు. అతని సరసన మిషా నారంగ్ కథానాయికగా నటించింది. నందిని రాయ్, అలీ రెజా, ఖయ్యుం, రవి ప్రకాష్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. చాగంటి ప్రొడక్షన్స్ పతాకంపై అజయ్ శ్రీనివాస్ నిర్మించిన ఈ చిత్రానికి శివశంకర్ దేవ్ దర్శకత్వం వహించారు. అనీష్ సోలోమన్ సంగీతం, గంగనమోని శేఖర్ సినిమాటోగ్రఫీ అందించారు. మరి థియేటర్లలో సీఎస్‌ఐ సనాతన్‌ను మిస్ అయిన వారు ఎంచెక్కా ఇంట్లోనే చూసేయండి.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..