ఎన్టీఆర్ ఫ్యాన్స్ రచ్చ.. పోలీసులకు పవన్ హీరోయిన్ ఫిర్యాదు..!

అభిమానం అన్నాక హద్దుల్లో ఉండాలి. మితిమీరితే దాన్ని భరించడం చాలా కష్టం. ముఖ్యంగా మనకు ఒకరిపై ఎంత ఇష్టం ఉన్నా.. మరొకరిని విమర్శించే విషయంలో కాస్త ఆలోచించాలి. అయితే ఫ్యాన్స్ మాత్రం వాటిని పెద్దగా పట్టించుకోవడం లేదు. మరొకరిని విమర్శిస్తూ నటీనటుల పేర్లను చెడగొడుతున్నారు. రోజురోజుకు సోషల్ మీడియా వాడకం పెరుగుతున్న నేపథ్యంలో నటీనటులకు కూడా లేనిపోని తలనొప్పిని తీసుకొస్తున్నారు. ఇలా తాజాగా ఫ్యాన్స్ చేసిన రచ్చతో స్టార్ నటుడు ఎన్టీఆర్ వివాదంలో చిక్కుకున్నారు. తనపై ఎన్టీఆర్ […]

ఎన్టీఆర్ ఫ్యాన్స్ రచ్చ.. పోలీసులకు పవన్ హీరోయిన్ ఫిర్యాదు..!

అభిమానం అన్నాక హద్దుల్లో ఉండాలి. మితిమీరితే దాన్ని భరించడం చాలా కష్టం. ముఖ్యంగా మనకు ఒకరిపై ఎంత ఇష్టం ఉన్నా.. మరొకరిని విమర్శించే విషయంలో కాస్త ఆలోచించాలి. అయితే ఫ్యాన్స్ మాత్రం వాటిని పెద్దగా పట్టించుకోవడం లేదు. మరొకరిని విమర్శిస్తూ నటీనటుల పేర్లను చెడగొడుతున్నారు. రోజురోజుకు సోషల్ మీడియా వాడకం పెరుగుతున్న నేపథ్యంలో నటీనటులకు కూడా లేనిపోని తలనొప్పిని తీసుకొస్తున్నారు. ఇలా తాజాగా ఫ్యాన్స్ చేసిన రచ్చతో స్టార్ నటుడు ఎన్టీఆర్ వివాదంలో చిక్కుకున్నారు. తనపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసభ్యంగా కామెంట్లు చేశారని ట్విట్టర్ వేదికగా పవన్ హీరోయిన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు దీనిపై చర్యలు తీసుకోవాలంటూ హైదరాబాద్ పోలీసులకు ఆమె ట్యాగ్ చేశారు.

వివరాల్లోకి వెళ్తే.. వాన, బంగారం, మరో వంటి చిత్రాల్లో నటించిన బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా కజిన్ మీరా చోప్రా ఇటీవల ట్విట్టర్‌లో అభిమానులతో చాటింగ్ చేశారు. ఈ సందర్భంగా వారు అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానం ఇచ్చారు. ఈ క్రమంలో తెలుగులో మీకు ఇష్టమైన నటుడు ఎవరంటూ ఫ్యాన్స్ అడగ్గా.. దానికి ఆమె మహేష్ బాబు పేరును చెప్పారు. అయితే దీనిపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ రెచ్చిపోయారు. మీరాను, ఆమె కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ అసభ్యకర కామెంట్లు పెట్టారు. వాటిని స్క్రీన్ షాట్ తీసిన మీరా చోప్రా, ఎన్టీఆర్‌ని ట్యాగ్ చేస్తూ ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు.

”మీ కంటే మహేష్ బాబును ఎక్కువ ఇష్టపడుతున్నందుకు నాకు మీ అభిమానులు అసభ్యకరమైన మెసేజ్‌లు పెడుతున్నారు. నా తల్లిదండ్రులను కూడా లాగుతున్నారు. ఇలాంటి ఫ్యాన్స్ ఫాలోయింగ్‌తో మీరు విజయం సాధించినట్లు ఫీల్ అవుతున్నారా. నా ట్వీట్‌ని మీరు వదిలేయరని భావిస్తున్నా” అని ఎన్టీఆర్‌ని ట్యాగ్ చేస్తూ మీరా ట్వీట్ చేశారు. ఇక ఈ ట్వీట్‌లు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ హైదరాబాద్ సిటీ పోలీసులు, సైబర్ క్రైమ్ పోలీసులకు, ట్విట్టర్ సంస్థకు మీరా ట్యాగ్ చేశారు. ఈ సందర్భంగా కొన్ని స్క్రీన్ షాట్లను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేశారు.

Read This Story Also: బన్నీకి విలన్‌గా రోజా.. ఫిక్స్‌ అయిన రేర్‌ కాంబో..!