బన్నీకి విలన్‌గా రోజా.. ఫిక్స్‌ అయిన రేర్‌ కాంబో..!

ప్రస్తుతం అల్లు అర్జున్, సుకుమార్ దర్శకత్వంలో పుష్పలో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ లారీ డ్రైవర్‌గా కనిపించబోతున్నారు.

  • Tv9 Telugu
  • Publish Date - 9:03 pm, Tue, 2 June 20
బన్నీకి విలన్‌గా రోజా.. ఫిక్స్‌ అయిన రేర్‌ కాంబో..!

ప్రస్తుతం అల్లు అర్జున్, సుకుమార్ దర్శకత్వంలో పుష్పలో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ లారీ డ్రైవర్‌గా కనిపించబోతున్నారు. ఆయన జోడీగా రష్మిక మందన్న కనిపించబోతుంది. తెలంగాణ ప్రభుత్వం నుంచి సినిమా షూటింగ్‌లకు అనుమతి లభించడంతో.. త్వరలోనే ఈ మూవీని సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నారు సుకుమార్. కాగా ఇందులో విలన్ పాత్రకు గానూ విజయ్‌ సేతుపతి, బాబీ, సునీల్ శెట్టి ఇలా పలువురి పేర్లు వినిపించాయి. ఇక ఆ పాత్రను పక్కన పెడితే ఈ మూవీలో లేడీ విలన్‌ కారెక్టర్ కూడా ఉందట.

ఆ పాత్రకు గానూ సుకుమార్ నటి, వైసీపీ ఎమ్మెల్యే రోజాను సెలక్ట్ చేసినట్లు ఫిలింనగర్ వర్గాల్లో టాక్‌ నడుస్తోంది. దీనికి సంబంధించి రోజాను సంప్రదించడం, పాత్ర నచ్చి ఇందులో నటించేందుకు ఆమె ఒప్పుకోవడం జరిగిపోయాయని తెలుస్తోంది. అయితే రాజకీయాల్లోకి వెళ్లిన తరువాత రోజా ఎక్కువగా బుల్లితెరకే పరిమితం అయ్యారు. ఆ మధ్యన బోయపాటి, బాలయ్య సినిమాలో రోజా నటించబోతున్నట్లు వార్తలు వచ్చినా.. దర్శకుడు వాటిని ఖండించారు. అది పక్కనపెడితే ఇప్పుడు బన్నీ సినిమాకు రోజా నిజంగానే ఓకే చెప్పి ఉంటే టాలీవుడ్‌లో రేర్ కాంబో ఫిక్స్‌ అయినట్లే. అంతేకాదు రోజా విలనిజం ఈ సినిమాకు మరో ఆకర్షణగా మారుతుందనడంలో ఎలాంటి సందేహం ఉండదు.  ఇక మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాక్‌స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.  ఐదు భాషల్లో రాబోతున్న ఈ చిత్రంపై అటు అభిమానులతో పాటు ఇటు సాధారణ ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి. అన్నీ కుదిరితే వచ్చే ఏడాది వేసవిలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Read This Story Also: జూన్ 8 నుంచి ఏపీలో హోటళ్లకు అనుమతి: మంత్రి