Nithiin: నితిన్ నెక్స్ట్ సినిమా డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ తో అంటున్నారే.. హీరోయిన్ గా ఆ బ్యూటీ…

| Edited By: Shaik Madar Saheb

Apr 19, 2021 | 8:33 AM

యంగ్ హీరో నితిన్ 2021లో ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఈ ఏడాది ప్రారంభంలో చెక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

Nithiin: నితిన్ నెక్స్ట్ సినిమా డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ తో అంటున్నారే.. హీరోయిన్ గా ఆ బ్యూటీ...
Nithiin
Follow us on

Nithiin :

యంగ్ హీరో నితిన్ 2021లో ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఈ ఏడాది ప్రారంభంలో చెక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది. ఆ తర్వాత ఇటీవల రంగ్ దే సినిమా రిలీజ్ చేసాడు నితిన్. ఈ సినిమా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు బాలీవుడ్ రీమేక్ మ్యాస్ట్రో సినిమాను పట్టాలెక్కించాడు. అయితే నితిన్ టాలీవుడ్ డైనమిక్ డైరెక్టర్ పూరీజగనాథ్ తో సినిమా చేస్తున్నాడని టాక్ నడుస్తుంది. గతంలో నితిన్ హీరోగా పూరి డైరెక్షన్ లో ‘హార్ట్ ఎటాక్’ సినిమా చేశాడు. కానీ ఆ సినిమా అంతగా ఆడలేదు. ఇప్పుడు పూరి తో మారోసారి సినిమా చేస్తున్నాడు.

అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా అందాల భామ కృతిశెట్టి హీరోయిన్ గా ఎంపిక అయ్యిందని తెలుస్తుంది. ప్రస్తుతం నాని .. సుధీర్ బాబు .. రామ్ సరసన కృతి శెట్టి నటిస్తోంది. మరోసారి వైష్ణవ్ తేజ్ జోడీగా కనిపించనుందనే టాక్ కూడా బలంగానే వినిపిస్తోంది. రామ్ హీరోగా ‘ఇస్మార్ట్ శంకర్’తో సంచలన విజయాన్ని అందుకున్న ఆయన ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా ‘లైగర్’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో కథానాయికగా తెలుగు తెరకి అనన్య పాండే పరిచయం కానుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Telangana Devudu Movie: ‘తెలంగాణ దేవుడు’ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ లైవ్..

Ishq Movie Pre Release Event: ‘ఇష్క్’ నాట్ ఏ లవ్ స్టోరీ అంటూ వస్తున్నా తేజ సజ్జ.. ప్రీరిలీజ్ ఈవెంట్ లైవ్…