హిట్‌ ఇచ్చాడు.. కాస్ట్‌లీ గిఫ్ట్‌ పట్టాడు

తమకు హిట్‌ ఇచ్చిన దర్శకులకు హీరోలు గిఫ్ట్‌లు ఇవ్వడం కొత్తేం కాదు. గతంలో చిరంజీవి, సూర్య, విజయ్‌ ఇలా పలువురు హిట్‌ ఇచ్చిన

  • Tv9 Telugu
  • Publish Date - 10:54 am, Wed, 9 September 20
హిట్‌ ఇచ్చాడు.. కాస్ట్‌లీ గిఫ్ట్‌ పట్టాడు

Nithiin Gift to Venky: తమకు హిట్‌ ఇచ్చిన దర్శకులకు హీరోలు గిఫ్ట్‌లు ఇవ్వడం కొత్తేం కాదు. గతంలో చిరంజీవి, సూర్య, విజయ్‌ ఇలా పలువురు హిట్‌ ఇచ్చిన దర్శకులకు కానుకలను ఇచ్చారు. తాజాగా ఆ లిస్ట్‌లో హీరో నితిన్ చేరారు. తనకు గుర్తుండిపోయే విజయాన్ని ఇచ్చిన వెంకీ కుడుములకు కాస్ట్‌లీ గిఫ్ట్‌ని ఇచ్చారు. ఓ రేంజ్ రోవర్ కారుని వెంకీకి ఇచ్చారు నితిన్‌. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసిన వెంకీ.. ”మంచి వ్యక్తికి, మంచి సినిమాను విజయంగా ఇస్తే మంచే జరుగుతుంది. నా బర్త్‌డేకి మంచి గిఫ్ట్‌ని ఇచ్చినందుకు థ్యాంక్స్‌.లవ్‌ యు” అని కామెంట్ పెట్టారు. అయితే దర్శకుడు వెంకీకి ఇది మొదట గిఫ్ట్‌ కాదు. ఛలోతో వెంకీ దర్శకుడిగా మారగా.. ఆ మూవీ హిట్ అయినందుకు నాగశౌర్య ఓ కారును గిఫ్ట్‌గా ఇచ్చిన విషయం తెలిసిందే.

ఇదిలా ఉంటే వరుసగా రెండు విజయాలను ఖాతాలో వేసుకున్న వెంకీకి ఇప్పుడు బంపరాఫర్ వచ్చినట్లు ఫిలింనగర్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్‌ తదుపరి సినిమాను తెరకెక్కించే అవకాశం వెంకీ సొంతం చేసుకున్నారని, దీనికి సంబంధించి అధికారిక ప్రకటన త్వరలోనే రానుందని తెలుస్తోంది.

కాగా ఈ ఏడాది ఫిబ్రవరిలో వచ్చిన భీష్మ మంచి విజయాన్ని సాధించింది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో నితిన్ సరసన రష్మిక నటించింది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన ఈ మూవీకి మహతి సాగర్ సంగీతం అందించారు. కలెక్షన్ల పరంగానూ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది భీష్మ. ఇక ఈ సినిమాను హిందీలో రీమేక్ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

Read More:

సీతానగరం శిరోముండనం కేసు: ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

అమరావతిని విస్మరించలేదు.. రాజధానిపై జగన్ స్పష్టత