అమరావతిని విస్మరించలేదు.. రాజధానిపై జగన్ స్పష్టత

రాష్ట్ర రాజధానిపై తన అభిప్రాయాన్ని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి స్పష్టంగా తెలిపారు. ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో

అమరావతిని విస్మరించలేదు.. రాజధానిపై జగన్ స్పష్టత
Follow us

| Edited By:

Updated on: Sep 09, 2020 | 9:03 AM

YS Jagan on AP Capital: రాష్ట్ర రాజధానిపై తన అభిప్రాయాన్ని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి స్పష్టంగా తెలిపారు. ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు విషయాలపై స్పందించారు. తాను అమరావతిని విస్మరించలేదని.. అక్కడ శాసన రాజధాని కొనసాగుతుందని జగన్ స్పష్టం చేశారు. అభివృద్ధి వికేంద్రీకరణకు రాష్ట్ర ప్రజల మద్దతు ఉందన్న నమ్మకం తమకు ఉందని,  కేవలం 29 గ్రామాలు, 10వేల మంది రైతులు పలు కారణాల వలన వ్యతిరేకిస్తున్నారని జగన్ అన్నారు. లక్ష కోట్ల ఖర్చు బెట్టి మహా నగరాన్ని నిర్మించడం సాధ్యం కాదని,  దానివలన అదనపు ఆదాయం పక్కన పెడితే, మౌలిక సదుపాయాల కోసం చేసిన అప్పులు కూడా తీర్చలేమని సీఎం స్పష్టం చేశారు. దీనికి పలు ఉదాహరణలు కూడా గుర్తుచేశారు. అమెరికా వంటి అగ్రరాజ్య ఆర్థిక వ్యవస్థలో మహా నగరాల పాత్ర ఎక్కడ ఉందని..? ఆయన ప్రశ్నించారు. ప్రపంచంలోని ఫార్చూన్ ఫైనాన్స్ కంపెనీలలో 23 కంపెనీలు కేవలం 4లక్షల జనాభా ఉన్న ప్రాంతంలోనే ఉన్నాయని తెలిపారు.

గతంలో విశాఖపట్నం రాజధాని కాదని, చిన్నపట్నంలా ఉన్న సమయంలోనే దశాబ్దాల క్రితం స్టీల్ ప్లాంట్‌తో పాటు పలు పరిశ్రమలు వచ్చాయని జగన్ గుర్తుచేశారు. ఇప్పుడు విశాఖపట్నం మహా నగరంగా అభివృద్ధి చెందుతుందని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. అభివృద్ధి చెందిన 10 దేశాలలో మహా నగరాలు కనిపించవని తెలిపారు. కోవిడ్ అనుభవంతో నగరాలు ఇబ్బందులు పడుతున్నాయని అన్నారు. అభివృద్ధి అంటే నగరాలు మాత్రమే కాదని.. తలసరి ఆదాయం, హ్యాపీనెస్ట్ ఇండెక్స్ వంటి అనేక అంశాలు ఉంటాయని జగన్ వివరించారు. పెట్టుబడులు అన్ని ఒక ప్రాంతంలో పెట్టడం కంటే పలు ప్రాంతాలను అనుసంధానం చేయడం వలన అభివృద్ధి మరింత అవుతుందని పేర్కొన్నారు. నగరాల ద్వారా ఆదాయాలు పెరుగుతాయనుకోవడం తప్పుడు ఆలోచన అని జగన్ స్పష్టం చేశారు. ఒకటి, రెండు మినహాయిస్తే ప్రపంచంలో ఎక్కడా కూడా గ్రీన్ ఫీల్డ్ క్యాపిటల్ సిటీలు సఫలం కాలేదని సీఎం అన్నారు.

చెన్నై, హైదరాబాద్ ద్వారా రాష్ట్రం ఇప్పటికే నష్ట పోయిందని చరిత్ర చెప్తుందని.. గత అనుభవాలు దృష్టిలో పెట్టుకోనైనా ఒక ప్రాంతానికి అభివృద్ధిని కేంద్రీకృతం చేయడం మంచిది కాదని తెలిపారు. శివరామ కృష్ణన్ కమిటీ చెప్పిన విధంగానే మూడు ప్రాంతాల అభివృద్ధికి శ్రీకారం చుట్టామని జగన్ వివరించారు. 1990లో హైదరాబాద్ జరిగిన ఇన్‌సైడ్‌ ట్రేడింగ్ తరహాలో అమరావతిలో చెయ్యాలని చూశారని అన్నారు. సచివాలయం, హైకోర్టు, అసెంబ్లీ వల్ల అభివృద్ధి జరగదు అని భావిస్తే వాటి కోసం ఎందుకు పట్టుబడుతున్నారని జగన్ ప్రశ్నించారు. గత ప్రభుత్వ లెక్కల ప్రకారం అమరావతి నిర్మాణం కోసం లక్ష కోట్లు ఖర్చు అవుతుందని.. ఆ ప్రదేశం భారీ నిర్మాణాలకు అనువైన ప్రాంతం కాదని సీఎం అన్నారు. 33వేల ఎకరాలు రైతుల నుండి తీసుకోవడం కంటే మరో ప్రాంతంలో 500ఎకరాల్లో రాజధాని నిర్మాణం చేపట్టి ఉండొచ్చని జగన్ అన్నారు. రాజధానికి 500ఎకరాలు సరిపోతుందని శివరామ కృష్ణ కమిటీ నివేదిక చెప్తుంటే.. చంద్రబాబుకు 33వేల ఎకరాలు ఎందుకని జగన్ ప్రశ్నించారు. విశాఖపట్నం, అనంతపురం, కర్నూలు, తిరుపతి సహా రాష్ట్రంలో మరికొన్ని నగరాలు అభివృద్ధి కేంద్రాలుగా మారతాయని జగన్ స్పష్టం చేశారు.

Read More:

కరోనా అప్‌డేట్స్‌: తెలంగాణలో 2,479 కొత్త కేసులు.. 10 మరణాలు

రథం ఘటన: అంతర్వేది ఈవో సస్పెండ్‌

బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో