రథం ఘటన: అంతర్వేది ఈవో సస్పెండ్‌

తూర్పుగోదావరి జిల్లాలో ప్రసిద్ధ అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలోని 60ఏళ్ల నాటి రథం దగ్ధంపై వివాదం కొనసాగుతోంది.

రథం ఘటన: అంతర్వేది ఈవో సస్పెండ్‌
Follow us

| Edited By:

Updated on: Sep 09, 2020 | 8:00 AM

Antarvedi chariot fire: తూర్పుగోదావరి జిల్లాలో ప్రసిద్ధ అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలోని 60ఏళ్ల నాటి రథం దగ్ధంపై వివాదం కొనసాగుతోంది. ఉద్దేశపూర్వకంగానే ఎవరో ఈ పని చేశారని హిందుత్వ సంఘాలు ఆరోపిస్తున్నాయి. విపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు కురిపిస్తున్నాయి. అటు ప్రభుత్వం కూడా ఈ ఘటనను సీరియస్‌గా తీసుకుంది. ఈ క్రమంలో ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసింది. కాగా ఈ ఘటన నేపథ్యంలో అంతర్వేది ఈవో చక్రధరరావును సస్పెండ్ చేస్తూ ఏపీ దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

సీసీ కెమెరాల నిర్వహణలో వైఫల్యం చెందినందుకు, రథం ఘటన విషయంలో అలసత్వం వహించినందుకు విధుల నుంచి తొలగిస్తున్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇదిలా ఉంటేఅమలాపురం వెంకటేశ్వర స్వామి ఆలయానికి, తుని తలుపులమ్మ ఆలయాలకు ఈవోలుగా మరో ఇద్దరికి అదనపు బాధ్యతలు ఇస్తూ దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

Read More:

నేటి నుంచి తెలంగాణలో ఎంసెట్ పరీక్షలు.. పూర్తి వివరాలివే

Breaking: ‘మౌనరాగం’ సీరియల్‌‌ నటి శ్రావణి ఆత్మహత్య