AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పీసీ శ్రీరామ్‌ వ్యాఖ్యలపై కంగనా స్పందన.. ‘ఆల్‌ ది బెస్ట్’ అంటూ ట్వీట్‌

కంగనా రనౌత్‌ ఉందని ఓ మూవీ నుంచి తప్పుకున్నట్లు లెజండరీ దర్శకుడు పీసీ శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే

పీసీ శ్రీరామ్‌ వ్యాఖ్యలపై కంగనా స్పందన.. 'ఆల్‌ ది బెస్ట్' అంటూ ట్వీట్‌
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Sep 09, 2020 | 11:44 AM

Share

Kangana Ranaut News: కంగనా రనౌత్‌ ఉందని ఓ మూవీ నుంచి తప్పుకున్నట్లు లెజండరీ దర్శకుడు పీసీ శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు ట్వీట్ చేసిన ఆయన.. ”కంగనా రనౌత్‌ ప్రధాన పాత్రలో ఉందని ఒక సినిమాను వదులుకున్నా. ఎందుకో ఆ ప్రాజెక్ట్ చేయడం కోసం నా మనసు ఒప్పుకోలేదు. అదే విషయాన్ని మేకర్లకు చెప్పా. వారు అర్థం చేసుకున్నారు. ఒక్కోసారి మన మనసు చెప్పిందే కరెక్ట్ అనిపిస్తుంటుంది. ఆ టీమ్‌కి ఆల్ ది బెస్ట్” అని కామెంట్ పెట్టారు. ఇక దీనిపై నెటిజన్లు మిశ్రమంగా స్పందించారు. కాగా ఈ ట్వీట్‌పై కంగనా స్పందించారు.

”మీరో లెజండ్‌, మీతో పనిచేసే అవకాశాన్ని మిస్ చేసుకున్నా. ఇది నిజంగా నాకు పెద్ద నష్టంలాంటిది‌. నా గురించి ఏ విషయంలో మీరు ఇబ్బంది పడ్డారో నాకు తెలీదు. కానీ మీరు మంచి నిర్ణయం తీసుకున్నారని సంతోషిస్తున్నా. మీకు ఆల్‌ ది బెస్ట్”‌ అని కామెంట్ పెట్టారు. కాగా ప్రస్తుతం సుశాంత్ మృతి తరువాత కంగనా బాలీవుడ్‌పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేస్తూ హాట్‌ టాపిక్‌గా మారారు. అలాగే మహారాష్ట్ర ప్రభుత్వం, కంగనా మధ్య ఇప్పుడు చిన్నపాటి యుద్ధం నడుస్తున్న విషయం తెలిసిందే.

Read More:

ప్రయోగాలకు సిద్ధమవుతోన్న ‘ఇస్రో’.. డిసెంబర్‌లోపు ‘పీఎస్‌ఎల్‌వీ సీ49’

హిట్‌ ఇచ్చాడు.. కాస్ట్‌లీ గిఫ్ట్‌ పట్టాడు

Follow Us