Shyam Singha Roy: నేచురల్ స్టార్ నాని (Nani), నేచురల్ బ్యూటీ సాయిపల్లవి (Sai Pallavi) జంటగా నటించిన చిత్రం శ్యామ్ సింగరాయ్. టాలీవుడ్ బేబమ్మ కృతి శెట్టి మరో హీరోయిన్‌గా నటించింది. పునర్జన్మల నేపథ్యంలో రాహుల్ సాంకృత్యాన్ ఈ ప్రేమకథా చిత్రాన్ని తెరకెక్కించారు. గతేడాది డిసెంబర్ 26న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మంచి టాక్ సొంతం చేసుకుంది. ముఖ్యంగా నాని, సాయిపల్లవిల నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. దీంతో బాక్సాఫీస్ వద్ద భారీగానే కలెక్షన్లు రాబట్టింది ఈ చిత్రం. ఆతర్వాత కొన్ని రోజులకు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్రీమింగై సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇప్పుడు ఈ మూవీ బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఉగాది పండగను పురస్కరించుకుని ఆదివారం ( ఏప్రిల్ 3న) సాయంత్రం 6 గంటలకు జెమినీ టీవీలో శ్యామ్ సింగరాయ్ ప్రసారం కానుంది. సో.. థియేటర్, ఓటీటీలో నాని సినిమా చూడని వారు బుల్లితెరపై ఈ సినిమాను ఎంజాయ్ చేయవచ్చు.
కాగా దేవదాసి దురాచారానికి ప్రేమ కథను జోడించి రాహుల్ సాంకృత్యాన్ శ్యామ్ సింగరాయ్‌ను అద్భుతంగా తెరకెక్కించాడు. శ్యామ్ సింగరాయ్, వాసుగా రెండు పాత్రల్లో నాని అదరగొట్టేశాడు. ఇక రోసీ పాత్రలో సాయిపల్లవి అభినయం గురించి ఎంత చెప్పినా తక్కువే. కృతిశెట్టి, మడోనా సెబాస్టియన్‌ల నటన కూడా ఆకట్టుకుంది. వీరితో పాటు రాహుల్ రవీంద్రన్, మురళి శర్మ, అభినవ్ గోమఠం, శుభలేఖ సుధాకర్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై వెంకట్‌బోయినపల్లి ఈ సినిమాను నిర్మించగా, మిక్కీ.జే. మేయర్ స్వరాలు సమకూర్చారు.
Celebrate Ugadi with Shyam Singha Roy on Gemini TV
@ April 3rd,6 PM.
Shyam Singha Roy | April 3 | 6 PM#UgadiWithShyamSinghaRoy #GeminiTV #Nani #SaiPallavi #KrithiShetty pic.twitter.com/vJ3S2sChhj— Gemini TV (@GeminiTV) March 22, 2022
Cricket Photos: ఇమ్రాన్ ఖాన్ రికార్డుని బద్దలు కొట్టిన బాబర్ ఆజం..
Amzath Basha Shaik: పేరుకేమో ఉప ముఖ్యమంత్రి.. రిబ్బన్ కట్టింగుల్లో తప్ప.. ఎక్కడా కనిపించరు..!