‘వి’ ఎఫెక్ట్‌.. ‘టక్‌ జగదీష్‌’లో మార్పులు..!

వరుస హిట్లతో ఒకప్పుడు టాలీవుడ్‌ హిట్ మెషీన్‌గా పేరొందిన నాచురల్ స్టార్ నాని ఈ మధ్య మళ్లీ కాస్త ఢీలా పడ్డారు. జెర్సీ తరువాత

  • Tv9 Telugu
  • Publish Date - 4:03 pm, Tue, 15 September 20
'వి' ఎఫెక్ట్‌.. 'టక్‌ జగదీష్‌'లో మార్పులు..!

Nani Tuck Jagadish: వరుస హిట్లతో ఒకప్పుడు టాలీవుడ్‌ హిట్ మెషీన్‌గా పేరొందిన నాచురల్ స్టార్ నాని ఈ మధ్య మళ్లీ కాస్త ఢీలా పడ్డారు. జెర్సీ తరువాత నాని నటించిన గ్యాంగ్ లీడర్‌ యావరేజ్‌గా నిలవగా.. ఈ నెలలో ఓటీటీలో విడుదలైన ‘వి’ ఎవ్వరినీ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అంతేకాదు ఇందులో నాని విలనిజంకు కూడా పెద్దగా మార్కులు పడలేదు. ఇంకా చెప్పాలంటే నాని ల్యాండ్‌మార్క్‌ చిత్రం (25వ మూవీ) అతడికి భారీ నిరాశను మిగిల్చింది. ఇదిలా ఉంటే ‘వి’ ఎఫెక్ట్‌తో నాని మళ్లీ ఆచితూచి అడుగులు వేస్తున్నారట.

ఈ క్రమంలో తన తదుపరి చిత్రం టక్ జగదీష్‌లో ఆయన పలు మార్పులు సూచించినట్లు తెలుస్తోంది. ఎక్కువ ఎమోషనల్‌గా ఉన్న సన్నివేశాలను కత్తిరించాలని దర్శకుడికి చెప్పినట్లు సమాచారం. దీంతో దర్శకుడు ప్రస్తుతం ఆ పనిలో పడ్డట్లు టాక్. కాగా ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తుండగా.. ఐశ్వర్య రాజేష్‌, రీతూ వర్మ హీరోయిన్లుగా నటిస్తున్నారు. షైన్ క్రియేషన్స్ నిర్మిస్తోన్న ఈ మూవీకి థమన్ సంగీతం అందిస్తున్నారు.

Read More:

ఎన్టీఆర్ ‘వయసునామి’కి జపాన్ జంట డ్యాన్స్‌.. చూస్తే వావ్‌ అనాల్సిందే

స్కూళ్లకు సంబంధించి జగన్ సర్కార్ మరో కీలక నిర్ణయం