Breaking News
  • అసెంబ్లీ.. సీఎం కేసీఆర్: కేంద్ర విద్యుత్ చట్టం చాలా ప్ర‌మాద‌క‌రం, ఈ బిల్లును పార్ల‌మెంట్‌లో పూర్తి స్థాయిలో వ్య‌తిరేకిస్తున్నామ‌ని శాస‌న‌స‌భ వేదికగా చెప్తున్నాం. దేశంలో 70 వేల టీఎంసీల నీరు ఉంది. కానీ చెన్నైలో తాగునీటికి అనేక స‌మ‌స్య‌లు ఉన్నాయి. దేశంలో 75 శాతం మంది మంచినీటి కోసం అల్లాడుతున్నారు. ప్ర‌జ‌ల ప్రాథ‌మిక అవ‌స‌రాలు తీర్చాల‌నే దృక్ప‌థం బీజేపీ, కాంగ్రెస్ పార్టీల‌కు లేకుండా పోయింది. దేశంలో 40 కోట్ల ఎక‌రాల భూమి సాగులో ఉంది. పుష్క‌లంగా స‌రిపోయే నీరు ఉన్నా.. సాగుకు ఇవ్వ‌లేదు. దేశంలో స్థాపిత విద్యుత్ శ‌క్తి 4 ల‌క్ష‌ల మెగావాట్ల పైనే ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కు 2 ల‌క్ష‌ల 16 వేల మెగావాట్లు మాత్ర‌మే దేశంలో వాడారు. దేశ ప్ర‌గ‌తి కోసం మిగులు విద్యుత్‌ను వినియోగంలోకి తేవాల‌నే ఆలోచ‌న లేదు. కేంద్ర విద్యుత్ చ‌ట్టాన్నీ పార్ల‌మెంట్‌లో వ్య‌తిరేకిస్తాము. విద్యుత్ రంగంలో రాష్‌ర్టాల హ‌క్క‌లు హ‌రించారు .. కేంద్రం ప్ర‌వేశ‌పెట్టిన చ‌ట్టం చాలా ప్ర‌మాద‌క‌రంగా ఉంది.
  • తిరుమల: టీవీ9తో శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకుడి వేణుగోపాల దీక్షితులు. తిరుమల శ్రీవారి ఆలయ చరిత్రలో బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా నిర్వహించడం ఇదే తొలిసారి. ప్రస్తుత సంక్షోభ పరిస్థితిలో శ్రీవారి బ్రహ్మోత్సవాలను ఆపకుండా నిర్వహించేందుకు ఆలయంలో ఏకాంతంగా నిర్వహించాలని నిర్ణయించాం. రథోత్సవ స్థానంలో సర్వభూపాల వాహనాన్ని నిర్వహించడానికి ఆగమశాస్త్రం ప్రకారం ఎటువంటి అభ్యంతరంలేదు. సర్వభూపాల వాహనం స్వామివారి రథాన్ని పోలి ఉండటంతో రథోత్సవస్థానంలో నిర్వహించాలని నిర్ణయించాం. బ్రహ్మోత్సవసేవల్లో ఎక్కువమంది అర్చకులు, ఆలయ సిబ్బంది పాల్గొనే ఆవశ్యకత ఉండటంతో ఆలయంలోని కళ్యాణోత్సవ మండపంలో వాహనసేవలు నిర్వహించాలని నిర్ణయించాం. మాడవీధుల్లో నిర్వహించే దివ్య ప్రబంధం, మంగళవాయిద్యాలు, వేద పారాయణాన్ని ఆలయంలోనే ఏకాతంగా నిర్వహిస్తాం. ఉదయం 9 నుండి 10 గంటల వరకు, సాయంత్రం 7 నుండి 8 గంటల వరకు వాహనసేవలు నిర్వహిస్తాం. ఉత్సవమూర్తి అలంకరణ, వైదిక కార్యక్రమాలను యథావిధిగా నిర్వహిస్తాం. గరుడవాహనంరోజు సీఎం జగన్ స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. చక్రస్నానాన్ని పుష్కరిణీలో చేసే పరిస్థితి లేకపోవడంతో ఆలయంలోనే గంగాళంలో చక్రస్నానాన్ని నిర్వహిస్తాం. టీవీ9తో శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకుడు వేణుగోపాల దీక్షితులు.
  • కృష్ణవరం టోల్‌గేట్ వద్ద లారీ బీభత్సం . తూర్పుగోదావరి జిల్లా : కిర్లంపూడి మండలం కృష్ణవరం టోల్‌గేట్ వద్ద లారీ బీభత్సం సృష్టించింది. కామారెడ్డి నుంచి నిజామాబాద్ వైపు వేగంగా వస్తున్న లారీ ఒక్కసారిగా బ్రేకులు ఫెయిల్ కావడంతో మూడు కార్లను ఢీకొట్టి, టోల్ గేట్ డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి, గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించారు.
  • అమరావతి: మాజీ అడ్వకేట్‌ జనరల్‌ దమ్మాలపాటి శ్రీనివాస్‌పై ఏసీబీ కేసు నమోదు. రాజధాని భూముల ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌లో భాగస్వామి అయ్యారన్న ఏసీబీ. భూముల కొనుగోళ్లలో ఏజీగా అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు అబియోగం. పదవిని అడ్డుపెట్టుకుని బంధువులతో 2014లో భూమి కొనుగోలు చేయించిన శ్రీనివాస్. 2015, 2016లో ఆ భూములు కొన్నట్లు ఏసీబీ అభియోగాలు. తన పేరిట, భార్య పేరిట దమ్మాలపాటి శ్రీనివాస్ భూముల కొనుగోళ్లు. ఇప్పటికే తనపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు కోరుతూ హైకోర్టులో పిటిషన్‌.
  • ఎయిర్‌క్రాఫ్ట్ (సవరణ) బిల్లుపై మాట్లాడిన బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు. ప్రధాని మోదీ నేతృత్వంలో దేశంలో విమానయాన రంగం శరవేగంగా వృద్ధి చెందింది. గత ఆరేళ్ల కాలంలో ఈ రంగం 118% శాతం పురోగతిని సాధించింది. యూపీఏ-2 హయాంలో 54% శాతం మాత్రమే పురోగతి ఉంది. దేశీయ విమానయాన రంగంలో భారత్ ప్రపంచంలోనే 3వ స్థానంలో ఉంది. అంతర్జాతీయ విమానయానంలో 4-5 స్థానాల్లో ఉంది. శరవేగంగా విమానయానం పెరుగుతున్న దేశాల్లో భారత్ మొదటిస్థానంలో ఉంది.
  • జయబచ్చన్ వ్యాఖ్యలపై స్పందించిన బీజేపీ ఎంపీ (నటుడు) రవికిషన్. నా వ్యాఖ్యలను జయాబచ్చన్ సమర్థిస్తారని అనుకున్నాను. పరిశ్రమలో అందరూ డ్రగ్స్ ఉపయోగించడం లేదు. కానీ డ్రగ్స్ వినియోగించేవారు బాలీవుడ్ సినీ పరిశ్రమను అంతం చేయాలన్న ప్రణాళికతో ఉన్నారు. నేను, జయాబచ్చన్ పరిశ్రమలోకి వచ్చినప్పుడు పరిస్థితులు ఇలా ఉండేవి కావు. ఇప్పుడు పరిశ్రమను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. రవి కిషన్, బీజేపీ ఎంపీ (రేసుగుర్రం ఫేమ్ మద్దాలి శివారెడ్డి).

స్కూళ్లకు సంబంధించి జగన్ సర్కార్ మరో కీలక నిర్ణయం

స్కూళ్లకు సంబంధించి జగన్ సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాదికి 45వేల ప్రభుత్వ స్కూళ్లను డిజిటలైజ్ చేయాలని
, స్కూళ్లకు సంబంధించి జగన్ సర్కార్ మరో కీలక నిర్ణయం

AP Government Schools: స్కూళ్లకు సంబంధించి జగన్ సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాదికి 45వేల ప్రభుత్వ స్కూళ్లను డిజిటలైజ్ చేయాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆలోచిస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ స్కూళ్లలో పలు సంస్కరణల కోసం సీఎం అధికారులకు డెడ్‌లైన్ విధించారని, అందుకోసం అధికారులు రాత్రింబవళ్లు కష్టపడుతున్నారని ఆదిమూలపు సురేష్‌ చెప్పారు. డిజిటలైజేషన్‌లో ప్రైవేట్ స్కూళ్లతో ప్రభుత్వ పాఠశాలలు పోటీ పడబోతున్నాయని మంత్రి తెలిపారు.

మొదటి దశలో భాగంగా 10వేల స్టార్ట్‌ టీవీలను స్కూళ్లలో అమర్చనున్నట్లు ఆయన వివరించారు. ఇందుకోసం రూ.45 నుంచి రూ.50కోట్లు ఖర్చు చేయబోతున్నట్లు మంత్రి వెల్లడించారు. కాగా ఇటీవల క్యాంపు ఆఫీసులో రివ్యూ మీటింగ్‌లో మాట్లాడిన జగన్‌.. డిజిటల్‌ విద్యను ప్రోత్సహించేలా ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని సదుపాయాలను కల్పించాలని, ప్రభుత్వ పాఠశాలల వైపు పిల్లలు, తల్లిదండ్రులు చూసేలా మార్పులు చేయాలని అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే.

Read More:

ఇలా జరగడం శ్రీవారి ఆలయ చరిత్రలో తొలిసారి: ప్రధానార్చకులు

నెల రోజుల పోరాటం.. కరోనాతో కన్నుమూసిన ఎయిమ్స్ మాజీ విద్యార్థి

Related Tags