Taraka Ratna Health: అత్యంత విషమంగా తారకరత్న ఆరోగ్యం.. మరికాసేపట్లో హెల్త్‌ బులెటిన్‌ విడుదల..

తీవ్రమైన గుండెపోటుతో ఆస్పత్రిపాలైన నందమూరి తారకరత్న ఆరోగ్య అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించినట్లుగా సమాచారం అందుతోంది.

Taraka Ratna Health: అత్యంత విషమంగా తారకరత్న ఆరోగ్యం.. మరికాసేపట్లో హెల్త్‌ బులెటిన్‌ విడుదల..
Nandamuri Taraka Ratna

Updated on: Feb 18, 2023 | 3:28 PM

తీవ్రమైన గుండెపోటుతో ఆస్పత్రిపాలైన నందమూరి తారకరత్న ఆరోగ్య అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించినట్లుగా సమాచారం అందుతోంది. ఇంతకాలం ఆయన కొలుకుంటున్నారని భావించినా.. ఇప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారినట్లు తెలుస్తోంది. గత 23 రోజులుగా బెంగళూరులోని నారాయణ హృదయాలయలో చికిత్స పొందుతున్న తారకరత్నకు విదేశీ వైద్యులతో సైతం చికిత్స అందితస్తున్నారు. మధ్యలో కాస్త కోలుకున్నట్లు కనిపించినా.. మళ్లీ అదే పరిస్థితి నెలకొన్నట్లు పేర్కొంటున్నారు. ఈ క్రమంలో మరికాసేపట్లో సాయంత్రం 4.30 గంటలకు తారకరత్న ఆరోగ్యానికి సంబంధించిన హెల్త్ బులెటిన్ విడుదల చేయనున్నట్లు వైద్యులు ప్రకటించారు. తారకరత్న ఆరోగ్యంపై కీలక ప్రకటన చేయనున్న నేపథ్యంలో బాలకృష్ణ, తారకరత్న కుటుంబ సభ్యులు బెంగళూరు చేరుకున్నారు.

కాగా, టీడీపీ యువ సారధి నారా లోకేష్ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్ర ప్రారంభం రోజున జనవరి 27న నందమూరి వారసుడు, సినీ నటుడు తారకరత్న కూడా పాల్గొన్నారు. పాదయాత్రలో భాగంగా లోకేష్ తో కలిసి నడుస్తుండగా.. తీవ్రమైన గుండెపోటు రావడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. వెంటనే ఆయనను కుప్పంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం అక్కడి నుంచి బెంగళూరులోని నారాయణ హృదాయలకు తరలించారు మెరుగైన వైద్యం అందిస్తున్నారు. విదేశాల నుంచి కూడా వైద్యలును రప్పించి చికిత్స అందించారు. కానీ, ఆయన ఆరోగ్యంలో ఎలాంటి మెరుగుదల కనిపించలేదు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం..