ప్రారంభమైన నాగశౌర్య-అనీష్ కృష్ణ మూవీ

అలా ఎలా, లవర్‌ ఫేమ్‌ అనీష్‌ కృష్ణతో యువ హీరో నాగశౌర్య ఇటీవల ఓ మూవీని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మూవీ పూజా కార్యక్రమం ఇవాళ హైదరాబాద్‌లో జరిగింది

ప్రారంభమైన నాగశౌర్య-అనీష్ కృష్ణ మూవీ

Edited By:

Updated on: Oct 28, 2020 | 2:45 PM

Naga Shaurya next movie: అలా ఎలా, లవర్‌ ఫేమ్‌ అనీష్‌ కృష్ణతో యువ హీరో నాగశౌర్య ఇటీవల ఓ మూవీని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మూవీ పూజా కార్యక్రమం ఇవాళ హైదరాబాద్‌లో జరిగింది. ఇందులో దర్శకులు కొరటాల శివ, అనిల్ రావిపూడి, హీరో నారా రోహిత్‌, నిర్మాత నాగవంశీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొరటాల శివ క్లాప్ కొట్టగా, అనిల్ రావిపూడి గౌరవ దర్శకత్వం వహించారు. నారా రోహిత్‌ కెమెరా స్విచ్చాన్ చేశారు.(జీవితం ప్రమాదంలో ఉంది, కాపాడండి: సీఎంకు ప్రముఖ దర్శకుడి అభ్యర్థన)

ఇక రొమాంటిక్ కామెడీ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ మూవీని ఐరా క్రియేషన్స్‌పై ఉసా ముల్పూరి నిర్మిస్తున్నారు. మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు. డిసెంబర్‌లో ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లనుండగా.. వచ్చే ఏడాది విడుదల కానుంది.( KBC 12: 40వేల ప్రశ్నకు అన్ని లైఫ్‌ లైన్లు వాడేశాడు.. ఇంతకు క్వశ్చన్ ఏంటంటే)