AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టాలీవుడ్‌లో మురగదాస్‌కు మూడో ఛాన్స్.. ఓకే చెప్పిన స్టార్ హీరో..?

కోలీవుడ్ టాప్ డైరక్టర్‌ లిస్ట్‌లో మురగదాస్ కచ్చితంగా మొదటి వరుసలో ఉంటారు. సామాజిక సమస్యలనే తన కథలుగా ఎంచుకునే ఈ దర్శకుడు కమర్షియల్‌గానూ మంచి మార్కెట్‌ను సాధించుకున్నాడు. ప్రస్తుతం ఈ దర్శకుడు సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో దర్బార్ చిత్రాన్ని తెరకెక్కించిన.. ఈ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. తెలుగు, తమిళ భాషల్లో దర్బార్ జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే మురగదాస్ తీసిన చాలా సినిమాలు తెలుగులో కూడా విడుదలై మంచి విజయాన్ని సాధించాయి. అయితే […]

టాలీవుడ్‌లో మురగదాస్‌కు మూడో ఛాన్స్.. ఓకే చెప్పిన స్టార్ హీరో..?
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jan 02, 2020 | 9:32 PM

Share

కోలీవుడ్ టాప్ డైరక్టర్‌ లిస్ట్‌లో మురగదాస్ కచ్చితంగా మొదటి వరుసలో ఉంటారు. సామాజిక సమస్యలనే తన కథలుగా ఎంచుకునే ఈ దర్శకుడు కమర్షియల్‌గానూ మంచి మార్కెట్‌ను సాధించుకున్నాడు. ప్రస్తుతం ఈ దర్శకుడు సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో దర్బార్ చిత్రాన్ని తెరకెక్కించిన.. ఈ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. తెలుగు, తమిళ భాషల్లో దర్బార్ జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే మురగదాస్ తీసిన చాలా సినిమాలు తెలుగులో కూడా విడుదలై మంచి విజయాన్ని సాధించాయి. అయితే తెలుగు హీరోలతో ఆయన తీసిన సినిమాలు మాత్రం పరాజయం అయ్యాయి. దీంతో ఈసారి ఎలాగైనా టాలీవుడ్‌లో పెద్ద హిట్ కొట్టాలని భావిస్తున్నాడు ఈ దర్శకుడు.

కాగా తెలుగులో మొదటగా మెగాస్టార్ చిరంజీవితో స్టాలిన్ మూవీని తెరకెక్కించాడు మురగదాస్. కథ బావున్నా ఈ చిత్రం కమర్షియల్‌గా అంత పెద్ద విజయాన్ని సాధించలేకపోయింది. ఇక ఆ తరువాత మహేష్ బాబుతో స్పైడర్‌ను తీశాడు ఈ డైరక్టర్. ఈ మూవీ కూడా బాక్సాఫీస్ వద్ద పరాజయమైంది. అయితే ఈసారి మాత్రం ఎలాగైనా తెలుగులో పెద్ద హిట్ కొట్టాలని ఈ దర్శకుడు భావిస్తున్నాడట. ఈ క్రమంలో బన్నీకి కథ చెప్పి ఒప్పించుకున్నాడట మురగదాస్. కథను విన్న బన్నీ.. ఫైనల్ స్క్రిప్ట్‌ను తీసుకురమ్మని చెప్పారట. దీంతో మురగదాస్ ఆ పనిలో పడ్డట్లు తెలుస్తోంది. అయితే ఇందులో నిజమెంత..? బన్నీ, మురగదాస్‌ కాంబినేషన్లో సినిమా ఎప్పుడు రానుంది..? ఈసారైనా మురగదాస్ తెలుగులో మొదటి హిట్ కొడతాడా..? లాంటి ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

Follow Us
నాగరికంలో నరరూప రాక్షసులు.. వంశోద్ధారకుడి పిచ్చితో..
నాగరికంలో నరరూప రాక్షసులు.. వంశోద్ధారకుడి పిచ్చితో..
ఇక ఏపీ రాజధానిగా అమరావతి.. గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల
ఇక ఏపీ రాజధానిగా అమరావతి.. గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల
పీరియడ్స్‌తో షూటింగుల్లో ఇబ్బంది పడ్డారా? శ్రీలీల ఆన్సర్ వైరల్
పీరియడ్స్‌తో షూటింగుల్లో ఇబ్బంది పడ్డారా? శ్రీలీల ఆన్సర్ వైరల్
గంటకు 154.7 కిమీల వేగంతో బౌలింగ్.. అసలు సీక్రెట్ ఇదే..!
గంటకు 154.7 కిమీల వేగంతో బౌలింగ్.. అసలు సీక్రెట్ ఇదే..!
రూ. 339 కే నెలంతా అపరిమిత సేవలు.. రూ.35,000 విలువైన జెమిని ప్రో
రూ. 339 కే నెలంతా అపరిమిత సేవలు.. రూ.35,000 విలువైన జెమిని ప్రో
శాంసన్, గైక్వాడ్ కాదు.. CSK పాలిట విలన్ ఇతనే..!
శాంసన్, గైక్వాడ్ కాదు.. CSK పాలిట విలన్ ఇతనే..!
గ్యాస్ స్టవ్‌లో చిన్న మంట వస్తోందా.? చిటికెలో ఇలా సులభంగా..
గ్యాస్ స్టవ్‌లో చిన్న మంట వస్తోందా.? చిటికెలో ఇలా సులభంగా..
ఎంత ఉతికినా కిచెన్ టవల్స్‌ జిడ్డు వదలట్లేదా.. ఇలా ట్రై చేయండి
ఎంత ఉతికినా కిచెన్ టవల్స్‌ జిడ్డు వదలట్లేదా.. ఇలా ట్రై చేయండి
సినిమాల్లోకి దేవయాని కూతురు.. 'కోర్ట్' రీమేక్‌తో ఎంట్రీ.. వీడియో
సినిమాల్లోకి దేవయాని కూతురు.. 'కోర్ట్' రీమేక్‌తో ఎంట్రీ.. వీడియో
14 మ్యాచ్‌లలో 6సార్లు జీరోకే.. తలనొప్పిలా మారిన కాటేరమ్మకొడుకు
14 మ్యాచ్‌లలో 6సార్లు జీరోకే.. తలనొప్పిలా మారిన కాటేరమ్మకొడుకు