Pawan Kalyan: నిరాశలో ఉన్న పవన్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌.. హరి హర వీరమల్లు నుంచి ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌..

|

Nov 24, 2022 | 9:03 PM

వకీల్‌ సాబ్‌తో రీఎంట్రీ ఇచ్చిన పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్ వరుస సినిమాలకు గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత భీమ్లా నాయక్‌తో వచ్చి భారీ విజయాన్ని అందుకున్న పవర్‌ స్టార్‌ తర్వాత మూడు సినిమాలకు ఓకే చెప్పి ఫ్యాన్స్‌ను ఖుషీ చేశారు. పవన్‌ నటిస్తోన్న చిత్రాల్లో...

Pawan Kalyan: నిరాశలో ఉన్న పవన్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌.. హరి హర వీరమల్లు నుంచి ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌..
Pawan Kalyan Hari Hara Movie
Follow us on

వకీల్‌ సాబ్‌తో రీఎంట్రీ ఇచ్చిన పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్ వరుస సినిమాలకు గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత భీమ్లా నాయక్‌తో వచ్చి భారీ విజయాన్ని అందుకున్న పవర్‌ స్టార్‌ తర్వాత మూడు సినిమాలకు ఓకే చెప్పి ఫ్యాన్స్‌ను ఖుషీ చేశారు. పవన్‌ నటిస్తోన్న చిత్రాల్లో ‘హరి హర వీరమల్లు’ చిత్రం ఒకటి. క్రిష్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి. చారిత్మక నేపథ్యంలో ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ ప్రారంభమైన ఈ సినిమా తర్వాత పవన్‌ రాజకీయాల్లో బిజీ అవ్వడంతో ఆగిపోయింది. దీనికి తోడు కరోనా కూడా రావడంతో ఈ సినిమా షూటింగ్ కొన్ని రోజులపాటు నిలిచిపోయింది.

హరి హర నుంచి ఎలాంటి అప్‌డేట్ రాకపోవడంతో పవన్‌ ఫ్యాన్స్‌ నిరాశకు గురయ్యారు. సినిమాకు సంబంధించి అప్‌డేట్ ఎప్పుడు వస్తుందా.? అని వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. దీనికి తోడు సినిమా షూటింగ్ ఆగిపోవడంతో ఒకింత ఆందోళనకు కూడా గురయ్యారు. అయితే అభిమానుల ఎదురుచూపులకు ఫుల్‌స్టాప్‌ పెడుతూ నిర్మాత ఎట్టకేలకు ఓ ప్రకటనను విడుదల చేశారు. సినిమా షూటింగ్ స్పాట్‌కు సంబంధించిన ఫొటోను అభిమానులతో పంచుకుంటూ ఓ మెసేజ్‌ను ఇచ్చారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌ మాట్లాడుతూ.. ‘చారిత్రాత్మక ప్రాముఖ్యత కలిగిన నాణ్యమైన చిత్రాన్ని రూపొందించడం కాలానికి పరీక్షగా నిలుస్తుంది. సూక్ష్మమైన వివరాలు, పరిశోధన, వందలాది తారాగణం మరియు సిబ్బంది యొక్క అపారమైన కృషి అవసరమవుతుంది. అక్టోబర్ చివరి వారం నుండి షెడ్యూల్ ప్రకారం రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన భారీ సెట్‌లో ‘హరి హర వీరమల్లు’ చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది’ అని తెలిపింది.

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం ఈ సెట్‌లో జరుగుతోన్న చిత్రీకరణలో పవన్‌తో పాటు 900 మంది నటీనటులు పాల్గొంటున్నట్లు చెప్పుకొచ్చారు. ‘హరి హర వీరమల్లు’ ఒక మైలురాయి చిత్రం అవుతుందని, ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులంతా సంబరాలు జరుపుకుంటారని మేము చాలా నమ్మకంగా ఉన్నాము. వెండితెరపై అద్భుతాన్ని సృష్టించడానికి మేము చేస్తున్న ఈ గొప్ప ప్రయత్నంలో ముందుకు సాగడానికి మీ అందరి ప్రేమ, మద్దతు మాకు ఇలాగే నిరంతరం అందిస్తారని కోరుకుంటున్నామని చిత్ర యూనిట్ తెలిపింది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..