వి, టక్ జగదీష్ తర్వాత థియేటర్లలోకి వచ్చిన నాని సినిమా శ్యామ్ సింగరాయ్. బెంగాల్ బ్యాక్‌డ్రాప్, నాని గెటప్స్, సాయిపల్లవి లుక్స్, డ్యాన్సులు, పాటలు… అన్నిటికి మించి రీసెంట్‌గా థియేటర్లలో టిక్కెట్ల గురించి నాని చేసిన కామెంట్స్… అన్నీ కలిపి శ్యామ్ సింగరాయ్ మీద అటెన్షన్ పెంచేశాయి. ఈ సినిమా ఎలా ఉంది? చూసేద్దాం
సినిమా: శ్యామ్ సింగరాయ్
నిర్మాణ సంస్థ: నీహారిక ఎంటర్‌టైన్‌మెంట్
నటీనటులు: నాని, సాయిపల్లవి, కృతి శెట్టి, మడోన్న సెబాస్టియన్, రాహుల్ రవీంద్రన్, జిషుసేన్ గుప్తా, లీలా శామ్‌సన్, మనీష్ వద్వా తదితరులు
దర్శకత్వం: రాహుల్ సంకృత్యాన్
రచన: జంగా సత్యదేవ్
నిర్మాత: వెంకట్ బోయనపల్లి
కెమెరా: సాను జాన్ వర్గీస్
ఎడిటింగ్: నవీన్ నూలి
సంగీతం: మిక్కీ జె మేయర్
రిలీజ్ డేట్: డిసెంబర్ 24, 2021
వాసు(నాని) డైరక్టర్ కావాలనుకుంటాడు. అందులో భాగంగా ఓ షార్ట్ ఫిల్మ్ తీస్తాడు. అందులో కీర్తీ (కృతి శెట్టి) నటిస్తుంది. ఆమెతో ప్రేమలో పడతాడు. సడన్‌గా ఓ కేసులో ఇరుక్కుంటాడు వాసు. అతన్ని కాపాడుకోవడానికి కజిన్ (మడోన్న సెబాస్టియన్) సాయం కోరుతుంది కీర్తీ. ఈ క్రమంలో వాళ్లకి రోసీ గురించి తెలుస్తుంది. రోసీ సింగరాయ్ ఎవరు? ఆమెకు, వాసుకు సంబంధం ఏంటి? మధ్యలో వాసు ఇరుక్కున్న కేసు సంగతి ఏమైంది? వాసుని మనోజ్ కేసు నుంచి ఎలా బయటపడేశాడు? అనేది ఆసక్తికరమైన అంశం.
ఆల్రెడీ డైరక్షన్ డిపార్ట్ మెంట్‌లో చేసిన వ్యక్తి,… డైరక్టర్ కావాలని కలలు కన్న వ్యక్తి…. కావడంతో నానికి వాసు కేరక్టర్‌లో నటించడం పెద్ద పనేం కాదు. తనకున్న ట్యాగ్‌లైన్‌కి తగ్గట్టే నేచురల్‌గా పెర్ఫార్మ్ చేశారు. శ్యామ్‌సింగరాయ్ కేరక్టర్‌లోనూ మేనరిజమ్స్ బాగా పండించారు. ఒక చేతిలో హీరో పెన్ను, ఇంకో చేతిలో సిగరెట్, ప్రింటింగ్ ప్రెస్‌లో పనిచేసేటప్పుడు, టైప్ రైటర్ మీద టైప్ చేసేటప్పుడు, అన్ని సందర్భాల్లోనూ చాలా బాగా కనిపించారు నాని. ఉప్పెనలో లంగా ఓణీలతో, చుడిదార్లతో ఆకట్టుకున్న కృతి శెట్టి ఇందులో మోడ్రన్ గర్ల్ గా, సైకాలజీ స్టూడెంట్‌గా మెప్పించారు. ఉప్పెనతో పోలిస్తే ఇందులో కృతికి పెర్ఫార్మెన్స్ కి కూడా స్కోప్ ఉంది. చాలా ట్రెండీగా కనిపించింది అమ్మాయి. సాయిపల్లవి దేవదాసి మైత్రేయిగా మెప్పించారు. ఆమె కాస్ట్యూమ్స్, లుక్, పెర్ఫార్మెన్స్, ఆలోచనల తీరు, ఆమె లోకాన్ని చూసే విధానం ప్రతిదీ ఆకట్టుకుంది. మనీష్ వద్వా చూడగానే క్రూయల్‌గా కనిపించారు. లీలా శామ్‌సన్ తనకు తగ్గట్టు హుందాగా కనిపించారు. రాహుల్ రవీంద్రన్ చాన్నాళ్ల తర్వాత ఇంపార్టెన్స్ ఉన్న కేరక్టర్ చేశారు. సినిమా ఆద్యంతం రీరికార్డింగ్, కొన్ని ట్యూన్లు ప్లెజెంట్‌గా అనిపించాయి.
రైటర్‌కి పేరు రావడం, అతనికి హోదా రావడం, దేవదాసీ వ్యవస్థను కమర్షియల్ ఫార్మాట్‌లో ఇంక్లూడ్ చేయడం బావుంది.
ఆర్ట్ డిపార్ట్ మెంట్ కృషిని మెచ్చుకోవాలి. లొకేషన్లు కూడా కొత్తగా అనిపించాయి. నవరాత్రుల సందర్భంగా దేవదాసీలు ఆలయ ప్రాంగణంలో చేసే నృత్యం, ఒక్కో రోజు వాళ్ల అలంకరణ, కాస్ట్యూమ్ స్పెషల్‌గా అనిపిస్తాయి. సాయిపల్లవితో పాటు డ్యాన్సర్లు కూడా చక్కగా నృత్యం చేశారు. ఇలాంటి కొన్ని సన్నివేశాల్లో నిర్మాతలు పెట్టిన ఖర్చు తెరమీద కనిపించింది. ఎం.ఎస్.సుబ్బులక్ష్మిని ప్రస్తావించి, స్ఫూర్తిని నింపే మాటలు చెప్పడం బావుంది. క్లైమాక్స్ కూడా ఊహాతీతం. కీలక సన్నివేశాలను ఇంకాస్త బలంగా రాసుకుని ఉంటే బావుండేది. ఒక్క అక్షరం లక్షల మెదళ్లను కదిలిస్తుందన్న శ్యామ్ సింగరాయ్ నమ్మకం, బెంగాలీలోనూ, తెలుగులోనూ ఆయన రచనలు చేయడం, వాటికి శ్రీశ్రీ అభినందన పత్రాన్ని పంపడం వంటి డీటైల్స్ కొన్ని మెప్పిస్తాయి.
– డా. చల్లా భాగ్యలక్ష్మి
Also Read: 83 Movie Review: 83 మన చరిత్ర… తరతరాలు గర్వంగా చెప్పుకునే ఘనచరిత్ర!
Radhe Shyam Trailer: ప్రాణం పోసే ప్రేమ ప్రాణం తీయగలదా.. రాధేశ్యామ్ ట్రైలర్ అదుర్స్..
Thaggedhe Le: ‘తగ్గేదే లే’ డైలాగ్ చెప్పిన క్రికెటర్ జడేజా.. పుష్ప ఫీవర్ మాములుగా లేదుగా..
Pushpa: యూట్యూబ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసిన శ్రీవల్లి సాంగ్.. 100 మిలియన్ల వ్యూస్‌ను దాటేసి..