Love Story Movie Review: ఆశలు – ఆశయాలు – అంతరాలు – ఆవేదనలు – ఆత్మీయతల అందమైన కాంబో ‘లవ్‌స్టోరీ’

కులాంతర వివాహాలు సొసైటీలో కొత్త కాదు. సిల్వర్‌ స్క్రీన్‌కీ కొత్తకాదు. అయితే ఆ కథనే కొత్తగా చెప్పారు శేఖర్‌ కమ్ముల. ఈ కథను రాసుకున్న తీరే బావుంది.

Love Story Movie Review: ఆశలు - ఆశయాలు - అంతరాలు - ఆవేదనలు - ఆత్మీయతల అందమైన కాంబో 'లవ్‌స్టోరీ'
Love Story Movie Review
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Sep 25, 2021 | 7:30 AM

కథ రాసుకున్నప్పుడు ఓ పర్పస్‌ ఉంటుంది. దాని ఎగ్జిక్యూషన్‌లోనూ ఆ పర్పస్‌ సర్వైవ్‌ అవుతుంది. అలాంటిది ఎండ్‌ రిజల్ట్ లోనూ అది కనిపించాలంటే సర్దుకుపోకూడదు. సరైన సమయం కూడా వెయిట్‌ చేయాలి. శేఖర్‌ కమ్ముల చేసింది అదే. ఆయన లవ్‌స్టోరీ మొదలుపెట్టిన తర్వాత చాలా ఒడుదొడుకులు వచ్చాయి. కోవిడ్‌ వచ్చింది. థియేటర్లు బంద్‌ అయ్యాయి… ఓటీటీల హవా పెరిగింది. అయినా శేఖర్‌ దేనికీ తలొంచలేదు. తన లక్ష్యం గురి తప్పకూడదని అనుకున్నారు. లవ్‌స్టోరీని థియేటర్లలోనే రిలీజ్‌ చేశారు. బిగ్‌ స్క్రీన్‌ మీద లవ్‌స్టోరీని చూసినప్పుడు ఆయన నిర్ణయం సరైనదే అనిపిస్తుంది. ఇంతకీ ఎన్నాళ్లుగానో ఊరించిన లవ్‌స్టోరీ ఎలా ఉంది?

నిర్మాణ సంస్థలు: అమిగోస్‌ క్రియేషన్స్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌ నటీనటులు: నాగచైతన్య, సాయిపల్లవి, ఈశ్వరీరావు, దేవయాని, రాజీవ్‌ కనకాల, ఉత్తేజ్‌, గంగవ్వ తదితరులు దర్శకత్వం: శేఖర్‌ కమ్ముల నిర్మాతలు: నారాయణదాస్‌ నారంగ్‌, పుస్కూర్‌ రామ్మోహన్‌రావు కెమెరా: విజయ్‌.సి.కుమార్‌ ఎడిటింగ్‌: మార్తాండ్‌.కె.వెంకటేష్‌ సంగీతం: పవన్‌ సీహెచ్‌ విడుదల: 24.09.2021

రేవంత్‌ (నాగచైతన్య) సిటీలో జుంబా సెంటర్‌ నడుపుతుంటాడు. పెద్ద జుంబా సెంటర్‌ పెట్టి ఫేమస్‌ కావాలన్నది అతని కల. చిన్నప్పుడే తండ్రిని పోగొట్టుకుంటాడు. తల్లి రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడి అర్ధెకరం పొలం కొని అతన్ని పెంచి పెద్ద చేస్తుంది. సిటీలో అతని పక్కింట్లోకి వస్తుంది మౌనిక (సాయిపల్లవి). ఐదు రూపాయల కోసం ఆటోవాలాతో గొడవ పడే టైప్‌. అంటే కంజూస్‌ అని కాదు, డబ్బుల కష్టం తెలిసిన పిల్ల. బీటెక్‌ చదువుకుని ఎలాగైనా ఉద్యోగంలో సెటిల్‌ అవ్వాలనుకుంటుంది. ఊళ్లో పేరున్న పటేల్‌ కుటుంబం. 20 ఎకరాల ఆస్తిమంతురాలు. అయితే తండ్రి తాగుబోతు కావడంతో, చిన్నాన్నమీద ఆధారపడాల్సి వస్తుంది. అది నచ్చక ఆమె ఎలాగైనా ఉద్యోగం సాధించాలనుకుంటుంది. ఆ క్రమంలో ఆమెకు రేవంత్‌ సాయపడతాడు. అతనితో కలిసి ఆమె చేసిన సాహసం ఏంటి? వాళ్లిద్దరికీ అంతకు ముందే పరిచయం ఉంటుందా? వాళ్ల పరిచయం ప్రేమకు ఎలా దారితీసింది? ఇంట్లో పెద్దలు ఒప్పుకున్నారా? సొసైటీలో ఉన్న కులాల అంతరాలు వాళ్లనెలా ఎఫెక్ట్ చేశాయి? వంటివి ఆసక్తికరం.

రేవంత్‌ కేరక్టర్‌లో చాలా బాగా సెట్‌ అయ్యారు నాగచైతన్య. తెలంగాణ మాండలికం మాట్లాడటం అతనికి కొత్త. డ్యాన్సులు అతనికి కొత్త. ఓ వైపు సరదాగా ఉంటూనే, ఇంకోవైపు బాధ్యతగా మసలుకునే కేరక్టర్‌ కొత్త. అన్నిటినీ చాలా ఈజ్‌తో చేశాడు నాగచైతన్య. చైతన్య కెరీర్‌లో ‘మజిలీ’ సినిమాకి మంచి మార్కులు పడ్డాయి. అయితే దాన్ని మించిన పెర్ఫార్మెన్స్ ఈ సినిమాలో చూడొచ్చు. మౌనికగా సాయిపల్లవి బాగా యాక్ట్ చేసింది. పల్లవికి యాక్టింగ్‌ కొత్తకాదు. అయితే ఈ తరహా కేరక్టర్‌ చేయడం కొత్త. ఫిదాలో సరదాగా కనిపించిన అమ్మాయి ఈ సినిమాలో ఇంట్రావర్ట్ గా కనిపించింది. అయితే సొసైటీని అర్థం చేసుకున్న మెచ్యూర్డ్ పెర్పార్మెన్స్, డౌన్‌ టు ఎర్త్ మాటలు, ఫ్యామిలీ సిట్చువేషన్‌ని అడుగడుగునా గుర్తుచేసుకునే అమ్మాయిగా మరోసారి శేఖర్‌ కమ్ముల హీరోయిన్‌గా ఫిదా చేసింది. కేజీఎఫ్‌ సినిమాలో తల్లి మాటలు హీరో జీవితాన్ని డ్రైవ్‌ చేస్తుంటాయి. ఈ సినిమాలో కూడా అంతే. ఈశ్వరీరావు కేరక్టర్‌ సినిమాకు చాలా ఇంపార్టెంట్‌. పైసలు కావాలంటే పని చేయాలి. పనిచేసినప్పుడు పైసలు అడిగి తీసుకోవాలి. అంతే గానీ, మాకు లేదనో, మా దగ్గర లేదనో కూర్చుంటే ఎలా? కష్టేఫలి అనే మాటను ఈశ్వరీరావు కేరక్టర్‌లో చూపిస్తాడు డైరక్టర్‌ శేఖర్‌ కమ్ముల.

కులాంతర వివాహాలు సొసైటీలో కొత్త కాదు. సిల్వర్‌ స్క్రీన్‌కీ కొత్తకాదు. అయితే ఆ కథనే కొత్తగా చెప్పారు శేఖర్‌ కమ్ముల. ఈ కథను రాసుకున్న తీరే బావుంది. పైకి అందమైన లవ్‌స్టోరీగానే చూపించినా, కథను నడుపుతున్న తీరులో ఆయన టచ్‌ చేసిన పాయింట్లన్నీ ఆలోచింపజేసేవే. ఆఖరికి జుంబై సెంటర్‌కి వచ్చే ప్రేమ జంటతో సహా. ఫ్రెండ్‌షిప్‌లోనూ, ఉద్యోగాలు చేసే చోట, కలిసి మెలుగుతున్న సమాజంలో పైపైకి అంతా బాగానే ఉన్నా, ఆవేశాలు వచ్చినప్పుడు, మనిషిని మించిన కోపం వచ్చినప్పుడు సడన్‌గా గుర్తుకొచ్చే కుల ప్రస్తావనని కూడా చాలా నేచురల్‌గా పోట్రేట్‌ చేశారు శేఖర్‌. ‘మీరంతా ఇంతే’నని అప్పుడే బల్లిగాడు చెప్పాడు అని హీరోయిన్‌ అన్న మాటలు అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్‌.

‘చదువుకున్నంత మాత్రాన, మంచిగ సంపాదించినంత మాత్రాన పిల్లనిస్తారనుకున్నావా? వాళ్లు వేరు మనం వేరు. కిరాయికి ఇల్లు ఇవ్వడానికి కూడా ఆలోచిస్తుంటే’… సిటీల్లో సైతం అక్కడక్కడా కనిపించే పెక్యులియర్‌ ప్రాబ్లమ్‌ని ఈ సీన్‌లో అడ్రస్ చేశారు కెప్టెన్ . ఇదొక్కటే కాదు, ఇవాళ్రేపు ప్రతిచోటా ఆడపిల్లల మీద అత్యాచారాలు జరుగుతున్నాయనే మాట రొటీన్‌గా వింటున్నాం. దీనికి ప్రధాన కారణం ఏంటి? అమ్మాయిల మీద ఉన్న నిఘా, కాపలా.. ఇంట్లో అబ్బాయిలకు ఉండటం లేదు. పుట్టినప్పటి నుంచి ప్రతి విషయాన్నీ, పద్ధతులను, మంచీచెడులను అమ్మాయిలకు నూరిపోస్తున్నట్టు అబ్బాయిలకు చెప్తున్న వాళ్ల సంఖ్య ఎంత? ప్రీ క్లైమాక్స్ లో పల్లవి చెప్పిన… (‘నన్ను కాసిన కాపలా ఆడిని కాసుంటే, ఆడికి మంచీచెడూ చెప్పి ఉంటే నా బతుకు ఇలా తయారయ్యేది కాదు’) డైలాగ్‌ ఆ విషయాన్నే గట్టిగా చెబుతుంది. ఇంకా చెప్పాలంటే సమాజాన్ని నిలువునా ప్రశ్నిస్తుంది.

‘పంచాయతీలో పడాలని ఎవనికుంటుంది… ప్రేమలో అలా జరిగిపోతుందంతే!’, ‘పరువు అంటే 20 ఏళ్ల అమ్మాయి ఎవరినీ ప్రేమించకపోవడం కాదు, పదేళ్ల పాప తన మనసులోని మాటలను భయం లేకుండా చెప్పడం’, ‘వాళ్లూ, మనం అనే తేడా పోవాలంటే పైచెయ్యి మనదవ్వాలి. అందుకు ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి’ అనే డైలాగ్‌, ‘ముద్దు పెడితే ఏడుస్తారా అబ్బా’ అనే డైలాగ్‌, ‘ఏందబ్బా జమానా మాటలు మాట్లాడుతున్నావ్‌’ అనే డైలాగ్‌, ‘హార్ట్ లేదబ్బా’ అని పల్లవి అమాయకంగా చెప్పే మాట… ‘ఈ ఉద్యోగం రాకుంటే బాసాన్లు తోముడేనబ్బా’, ‘అదంతే నబ్బా… ప్రాణం లాగతది’ అనే డైలాగ్‌… ఒకటా రెండా? ఆయా సిట్చువేషన్‌కి తగ్గట్టు శేఖర్‌ రాసిన ప్రతి మాటా ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుంది. సున్నితమైన ఇలాంటి విషయాలన్నీ ఒక వైపు, సరదాగా సాగే జుంబా డ్యాన్సులు, ప్రేమ, ప్రేమికుల నమ్మకాలు మరోవైపు… పర్ఫెక్ట్ గా డీల్‌ చేశారు డైరక్టర్‌.

చెబుతున్న సిట్చువేషన్‌ తప్పయినా, కన్నకూతుర్ని నమ్మే తల్లిగా దేవయాని నటన, మంచి పోస్టులో ఉన్నప్పటికీ సొసైటీని అర్థం చేసుకున్న వ్యక్తిగా ఉత్తేజ్‌, చైతన్య బామ్మగా గంగవ్వ, బాబాయ్‌ కేరక్టర్‌లో ఊరి పెద్ద మనిషిగా రాజీవ్‌ కనకాల… ఒకరేంటి ఈ సినిమాలో ప్రతి కేరక్టరూ దేనికదే స్పెషల్‌. ఎక్కడా వేస్ట్ కేరక్టర్లు కనిపించవు. పకడ్బంధీగా అల్లుకున్న కథ, కథనం సినిమా థియేటర్‌కు ప్రేక్షకులను తీసుకురావడానికి దోహదపడతాయి. శేఖర్‌ చెప్పాలనుకున్న కథను యాజ్‌ ఇట్‌ ఈజ్‌గా క్యారీ చేసిన విజయ్‌.సి.కుమార్‌ కెమెరా గురించి కూడా స్పెషల్‌గా మెన్షన్‌ చేయాలి. నైట్‌ మూడ్స్, డే లైట్స్, రెయిన్‌ డ్యాన్సు, విన్నర్‌ పాట, సారంగదరియా పాట… ప్రతిదీ స్క్రీన్‌ మీద ప్లెజంట్‌గా కలర్‌ఫుల్‌గా కనిపించింది. వీళ్లిద్దరి వర్క్ ని కాంప్లిమెంట్‌ చేసేలా ఉంది పవన్‌ మ్యూజిక్‌. కొత్త మ్యూజిక్‌ డైరక్టర్‌ ఇచ్చిన ఫస్ట్ ఆల్బమ్‌, ఫస్ట్ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌లా లేదు మ్యూజిక్‌. ఎక్స్ పీరియన్స్డ్ హ్యాండ్‌ చేసినట్టు అనిపిస్తుంది. సీన్స్ ఫ్లేవర్‌ని ఆడియన్స్ హార్ట్ కి టచ్‌ చేసేలా మ్యూజిక్‌ ఇచ్చారు పవన్‌.

సాయిపల్లవి డ్యాన్సుల గురించి స్పెషల్‌ మెన్షన్‌ అక్కర్లేకపోయినా, కచ్చితంగా మాట్లాడుకోవాల్సిందే. విన్నర్‌ సాంగ్‌ అలా మైమరిచిపోయి చూసిన ఆడియన్స్, సారంగదరియా పాటకు సీట్లలోనే స్టెప్పులేయడం గమనించవచ్చు. నాగచైతన్య వేసిన స్టెప్పులకు కూడా స్పెషల్‌ అప్లాజ్‌ వస్తోంది. సొసైటీని భయపెట్టాలని కాదు కానీ, అప్రమత్తంగా ఉండాలని చేసిన ఈ ప్రయత్నం తప్పకుండా ప్రేక్షకుల్ని కదిలిస్తుంది. థియేటర్ల వైపు అడుగులు వేసేలా చేస్తుంది.

డా. చల్లా భాగ్యలక్ష్మి, టీవీ9 తెలుగు, ఈటీ డెస్క్

గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??