Mouni Roy: ‘నాగిని’ బ్యూటీ పెళ్లి ముహూర్తం ఫిక్స్‌!.. దుబాయి వ్యాపారవేత్తతో ఏడడుగులు నడవనున్న బుల్లితెర ముద్దుగుమ్మ..

|

Jan 14, 2022 | 7:34 PM

విక్కీ కౌశల్-కత్రినా కైఫ్, రాజ్ కుమార్ రావ్-పత్రలేఖ, ఆదిత్య సీల్-అనుష్క రంజన్, అంకితా లోఖండే- విక్కీ .. ఇలా గతేడాది బాలీవుడ్‌లో ఎంతోమంది పెళ్లిపీటలెక్కారు.

Mouni Roy: నాగిని బ్యూటీ పెళ్లి ముహూర్తం ఫిక్స్‌!.. దుబాయి వ్యాపారవేత్తతో ఏడడుగులు నడవనున్న బుల్లితెర ముద్దుగుమ్మ..
Mouni Roy
Follow us on

విక్కీ కౌశల్-కత్రినా కైఫ్, రాజ్ కుమార్ రావ్-పత్రలేఖ, ఆదిత్య సీల్-అనుష్క రంజన్, అంకితా లోఖండే- విక్కీ .. ఇలా గతేడాది బాలీవుడ్‌లో ఎంతోమంది పెళ్లిపీటలెక్కారు. ఇప్పుడు వీరిని అనుసరిస్తూ మరికొంత మంది 2022లో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. ఈ క్రమంలో ‘నాగిని’ సీరియల్‌తో బోలెడంత క్రేజ్‌ తెచ్చుకున్న మౌనీ రాయ్‌ త్వరలోనే పెళ్లిపీటలెక్కనుందని తెలుస్తోంది. దుబాయ్‌కి చెందిన వ్యాపారవేత్త సూరజ్ నంబియార్‌తో జనవరి 27నఈ ముద్దుగుమ్మ ఏడడుగులు నడవనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే వీరి వివావా వేదికపై భిన్న రకాల వార్తలు వినిపిస్తున్నాయి. కొందరేమో దుబాయి అని, మరికొందరు గోవాలో వీరి పెళ్లి జరగనుందని చెబుతున్నారు. కాగా ఇటీవల తన బ్యాచిలర్ పార్టీని గోవాలనే గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేసుకుంది మౌనీరాయ్‌.

కాగాఈ పెళ్లికి సంబంధించి ఇప్పటికే కుటుంబీకులు, సన్నిహితులు, స్నేహితులందరికీ శుభలేఖలు పంపించడం మొదలుపెట్టారట. అయితే పెళ్లికి హాజరయ్యే అతిథులెవరూ ఈ విషయాన్ని బయటకు చెప్పవద్దని ఆదేశాలు కూడా జారీ చేశారట. కరోనా ఆంక్షలు, నిబంధనలకు అనుగుణంగానే వేడుకలు జరుగుతాయని, అతిథులందరూ తప్పకుండా వ్యాక్సినేష‌‌న్ సర్టిఫికెట్లను తీసుకురావాలని సూచనలు జారీ చేశాం ‘ అని మౌనీరాయ్‌ సన్నిహితుడొకరు చెప్పుకొచ్చారు. కాగా బాలీవుడ్‌ సెలబ్రిటీలు కరణ్ జోహార్, ఏక్తా కపూర్, మనీశ్ మల్హోత్రా తదితరులకు మౌనీరాయ్ వెడ్డింగ్‌ ఇన్విటేషన్లు అందాయట. కాగా తన పెళ్లి విషయంపై ఇటు మౌనీరాయ్‌ కానీ, ఆమె కుటుంబీకులెవరూ ఎలాంటి ప్రకటనలు చేయలేదు.

Also read: Covid-19: ఆ దేశంలో కరోనా సోకితే జైలే.. పాజిటివ్ అంటేనే బెంబేలెత్తుతున్న ప్రజలు..
Omicron Variant: కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ పిల్లలపై ప్రభావం ఎక్కువ: ఢిల్లీ ఎయిమ్స్‌ ప్రొఫెసర్‌..!

Afghanistan Taliban: తాలిబన్ల రాజ్యంలో ఆకలి కేకలు.. అవయవాలు అమ్ముకుంటున్న ఆఫ్గాన్లు..