సొంతింటి కల నెరవేర్చుకుంటున్న ఎమ్మెల్యే, నటుడు బాలకృష్ణ..! భూమి పూజకు ముహూర్తం ఖరారు!
హిందూపురంలో హ్యాట్రిక్ విజయంతో మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నందమూరి బాలకృష్ణ... ఇన్ని రోజులు అద్దె ఇంట్లోనే ఉంటున్నారు. ఎట్టకేలకు ఎమ్మెల్యే బాలకృష్ణ హిందూపురంలో ఓ ఇంటి వాడవుతున్నారు. అదే ఓ సొంతిల్లు కట్టుకుంటున్నారు. 2014, 2019, 2024 ఎన్నికల్లో వరుసగా గెలిచిన ఎమ్మెల్యే బాలకృష్ణ.. నియోజకవర్గ పర్యటనకు హైదరాబాద్ నుంచి వచ్చి వెళుతుంటారు.

హిందూపురంలో హ్యాట్రిక్ విజయంతో మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నందమూరి బాలకృష్ణ… ఇన్ని రోజులు అద్దె ఇంట్లోనే ఉంటున్నారు. ఎట్టకేలకు ఎమ్మెల్యే బాలకృష్ణ హిందూపురంలో ఓ ఇంటి వాడవుతున్నారు. అదే ఓ సొంతిల్లు కట్టుకుంటున్నారు. 2014, 2019, 2024 ఎన్నికల్లో వరుసగా గెలిచిన ఎమ్మెల్యే బాలకృష్ణ.. నియోజకవర్గ పర్యటనకు హైదరాబాద్ నుంచి వచ్చి వెళుతుంటారు. అయినా నియోజకవర్గ ప్రజలు కానీ, కార్యకర్తలు, అభిమానులు… ఎమ్మెల్యే బాలకృష్ణ ఎప్పుడు హిందూపురం వచ్చిన అంతే ఉత్సాహంతో ఉంటున్నారు.
ఇటీవల హిందూపురం వైసీపీ ఇంచార్జ్ దీపిక భర్త వేణు, ఎమ్మెల్యే బాలకృష్ణపై సంచలన ఆరోపణ చేశారు. హైదరాబాదులో ఉండే బాలకృష్ణ, హిందూపురంలో పరిపాలిస్తున్నారంటూ విమర్శించారు. వేణు చేసిన కామెంట్స్ హిందూపురంలో హీట్ పుట్టించాయి. ప్రత్యర్థులకు హిందూపురంలో తను స్థానికుడిని కాదు అని చేస్తున్న వ్యాఖ్యలకు.. అవకాశం ఇవ్వకూడదని ఎమ్మెల్యే బాలకృష్ణ నిర్ణయించుకున్నారు. దీంతో హిందూపురం పట్టణంలో సొంతింటి నిర్మాణానికి రెడీ అవుతున్నారు. హిందూపురం సమీపంలోని వనం కాలనీలో సర్వే నెంబర్ 445లో 81 సెంట్ల భూమిని ఎమ్మెల్యే బాలకృష్ణ కొనుగోలు చేశారు. మూడంతస్తుల భవనంతో పాటు.. స్విమ్మింగ్ పూల్, ఆహ్లాదకరమైన పార్క్ కూడా ఇంటి నిర్మాణంలో ఏర్పాటు చేసుకుంటున్నారట.
హ్యాట్రిక్ విజయంతో హిందూపురంలో దూసుకుపోతున్న ఎమ్మెల్యే బాలకృష్ణ గడిచిన 12 ఏళ్లుగా అద్దె భవనంలోనే ఉంటున్నారు. బాలకృష్ణకు హిందూపురంలో సొంత ఇల్లు కూడా లేదంటూ ప్రతిపక్ష నాయకుడు చేసే విమర్శలకు ఎమ్మెల్యే బాలకృష్ణ ఎట్టకేలకు చెక్ పెట్టేందుకే ఇంటి నిర్మాణం చేపడుతున్నారు. శుక్రవారం (ఫిబ్రవరి 20) సతీ, సమేతంగా ఎమ్మెల్యే బాలకృష్ణ, వసుంధర దేవి ఇంటి నిర్మాణానికి భూమి పూజ చేయనున్నారు. తమ అభిమానం నటుడు, హ్యాట్రిక్ విక్టరీ కొట్టిన ఎమ్మెల్యే బాలకృష్ణ కొత్త ఇల్లు ఎలా ఉంటుందో అని హిందూపురంలో ప్రతి ఒక్కరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు..!!
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
