AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kitchen Hacks: పచ్చిమిర్చి రెండ్రోజులకే పాడవుతున్నాయా?.. ఆ తప్పు అస్సలు చేయకండి!

చట్నీ అయినా, సాంబార్ అయినా పచ్చిమిర్చి లేనిదే ముద్ద దిగదు. కానీ మార్కెట్ నుండి తెచ్చిన కొద్ది రోజులకే అవి కుళ్ళిపోవడం లేదా వాడిపోవడం చూసి చాలామంది ఆందోళన చెందుతారు. కానీ సరైన మెళకువలు పాటిస్తే పచ్చిమిర్చిని 15 నుండి 20 రోజుల వరకు తాజాగా, కారంగా ఎలా నిల్వ చేయాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

Kitchen Hacks: పచ్చిమిర్చి రెండ్రోజులకే పాడవుతున్నాయా?.. ఆ తప్పు అస్సలు చేయకండి!
Store Green Chillies Fresh
Bhavani
|

Updated on: Feb 19, 2026 | 6:52 PM

Share

భారతీయ వంటకాల్లో పచ్చిమిర్చికి ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. రుచితో పాటు పోషకాలను అందించే ఈ మిర్చిని ఎక్కువ కాలం నిల్వ చేయడం ఒక సవాలుతో కూడుకున్న పని. ముఖ్యంగా తేమ, ఆక్సిజన్ ప్రభావం వల్ల ఇవి త్వరగా పాడైపోతుంటాయి. వంట నిపుణులు సూచించిన ఈ చిట్కాలను పాటిస్తే మీ పచ్చిమిర్చి ఎప్పుడూ ఫ్రెష్‌గా ఉంటుంది.

తేమకు దూరంగా.. భద్రంగా!

పచ్చిమిర్చి పాడైపోవడానికి ప్రధాన శత్రువు తేమ. అందుకే వీటిని నిల్వ చేసే ముందు కడగకూడదు. ఒకవేళ కడిగితే మాత్రం, సన్నని పొడి గుడ్డతో తడి లేకుండా తుడిచి, గాలికి పూర్తిగా ఆరబెట్టాలి. తేమ ఏమాత్రం ఉన్నా బ్యాక్టీరియా చేరి మిర్చి కుళ్ళిపోయేలా చేస్తుంది.

తొడిమలు తీస్తున్నారా?..

చాలామంది తొడిమలు తీసి నిల్వ చేస్తారు, కానీ తొడిమలతో ఉంచడం వల్ల మిర్చి గాలిలోని ఆక్సిజన్‌తో త్వరగా చర్య చెందదు. దీనివల్ల అవి వాడిపోకుండా, పక్వానికి రాకుండా ఎక్కువ రోజులు పచ్చగానే ఉంటాయి. కాబట్టి నిల్వ చేసేటప్పుడు తొడిమలను వేరు చేయకపోవడమే మంచిది.

గాలి చొరబడని డబ్బాలు – జిప్ లాక్ బ్యాగులు!

మిర్చిని నిల్వ చేయడానికి ప్లాస్టిక్ డబ్బాలు లేదా జిప్ లాక్ బ్యాగులు ఉత్తమం.

డబ్బా అడుగు భాగంలో న్యూస్ పేపర్ లేదా టిష్యూ పేపర్ పరిచి, దానిపై మిర్చి వేయాలి.

పైన మరో పేపర్ కప్పడం వల్ల ఏదైనా తేమ ఉన్నా అది పీల్చుకుంటుంది.

ఆక్సీకరణ (Oxidation) జరగకుండా గాలి చొరబడకుండా మూత గట్టిగా పెట్టాలి.

రిఫ్రిజిరేటర్ వాడకంలో జాగ్రత్తలు!

మిర్చిని నెల రోజుల వరకు తాజాగా ఉంచాలనుకునే వారు జిప్ లాక్ సంచుల్లో వేసి ఫ్రిజ్‌లోని వెజిటబుల్ ట్రేలో ఉంచవచ్చు. తరచుగా డబ్బా తెరవకుండా ఉండటం వల్ల వాటి రంగు, కారం మారకుండా ఉంటాయి.

మిర్చిని నిల్వ చేసే ముందు ఒకసారి క్షుణ్ణంగా పరిశీలించండి. ఏదైనా ఒక్క మిర్చి కుళ్ళిపోయి ఉన్నా, అది మిగతా అన్నిటికీ అంటుకుంటుంది. కాబట్టి పాడైన వాటిని వెంటనే ఏరి పారేయాలి. సరైన ఉష్ణోగ్రత, తేమ లేని వాతావరణంలో ఉంచితేనే మిర్చిలోని పోషకాలు సంరక్షించబడతాయి.

Follow Us