Pushpa: ఇప్పటి నుంచి నా అభిమాన నటుల్లో బన్నీ ఒకరు.. పుష్పరాజ్‌పై ప్రశంసలు కురిపించిన బాలీవుడ్ దిగ్గజ నటుడు..

|

Feb 13, 2022 | 4:09 PM

టాలీవుడ్‌ ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ (Allu Arjun), క్రియేటివ్‌ డైరెక్టర్ సుకుమార్‌ (Sukumar) ల హ్యాట్రిక్‌ కాంబినేషన్‌ లో తెరకెక్కిన చిత్రం 'పుష్ప: ది రైజ్‌' (Pushpa).

Pushpa: ఇప్పటి నుంచి నా అభిమాన నటుల్లో బన్నీ ఒకరు.. పుష్పరాజ్‌పై ప్రశంసలు కురిపించిన బాలీవుడ్ దిగ్గజ నటుడు..
Pushpa
Follow us on

టాలీవుడ్‌ ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ (Allu Arjun), క్రియేటివ్‌ డైరెక్టర్ సుకుమార్‌ (Sukumar) ల హ్యాట్రిక్‌ కాంబినేషన్‌ లో తెరకెక్కిన చిత్రం ‘పుష్ప: ది రైజ్‌’ (Pushpa). రష్మిక మందాన హీరోయిన్‌ గా నటించగా, సమంత స్పెషల్‌ సాంగ్‌ స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచింది. ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఈ పాన్‌ ఇండియా చిత్రం గతేడాది డిసెంబర్‌ 17న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. తెలుగుతో పాటు అన్నిచోట్లా కలెక్షన్ల వర్షం కురిపించింది. హిందీలో కూడా రూ. 100 కోట్లకు పైగా వసూళ్లను సొంతం చేసుకుంది. అక్షయ్‌కుమార్‌, కరణ్‌జోహర్‌, జాన్వీకపూర్‌ తదితర ప్రముఖులు కూడా ఈ సినిమాను వీక్షించి తమ అభిప్రాయాలను సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. బన్నీ నటన అద్భుతంగా ఉందంటూ ప్రశంసలు కురిపించారు. తాజాగా మరో బాలీవుడ్ దిగ్గజ నటుడు మిథున్‌ చక్రవర్తి పుష్పరాజ్‌ను వీక్షించారు. అల్లు అర్జున్‌ నటన అద్భుతంగా ఉందంటూ.. ఇకపై తన అభిమాన నటుల్లో బన్నీ ఒకరని చెప్పుకొచ్చారు.

నా సినిమాలు గుర్తొచ్చాయి..

‘ అల్లు అర్జున్‌ నటించిన ‘పుష్ప’ చిత్రం చూశాను. సినిమా నాకు బాగా నచ్చింది. బన్నీ చాలా అద్భుతంగా నటించాడు. ఆ సినిమాలో అతని అభినయం చూశాక తన అభిమానిగా మారిపోయాను. ఈ సినిమా చూస్తున్నంతసేపు1980, 90ల్లో నేను నటించిన చిత్రాలు గుర్తుకు వచ్చాయి. ఇక నుంచి అర్జున్‌ నా అభిమాన నటుల్లో ఒకరు. నిజం చెప్పాలంటే ‘పుష్ప’ సింగిల్‌ స్ర్కీన్‌ ఫిల్మ్‌. అయితే ప్రేక్షకులు దీనికి బాగా కనెక్ట్‌ అయ్యారు. అందుకే బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలిచింది. బన్నీ సూపర్‌ హీరోయిజం ఈ సినిమాకు బాగా హెల్ప్‌ అయింది. కాగా గత ఏడేళ్ల కాలంలో బాలీవుడ్‌లో వందకోట్లు కలెక్ట్‌ చేసిన ఐదో దక్షిణాది సినిమా పుష్ప. త్వరలోనే ‘పుష్ప..ది రూల్‌’ పేరుతో ఈ సినిమాకు సీక్వెల్‌ తెరకెక్కనుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ సారథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్‌ స్వరాలు సమకూర్చారు. అనసూయ, సునీల్, ఫాహద్‌ ఫాజిల్‌ కీలక పాత్రలు పోషించారు.

Also Read:IPL 2022 Auction Unsold Players: ఈ దిగ్గజ ఆటగాళ్లను కొనేందుకు ఏ జట్టు ఆసక్తి చూపలేదు..

IIT Kharagpur Jobs 2022: గేట్‌/నెట్‌ అర్హతతో..ఐఐటీ ఖరగ్‌పూర్‌లో ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ ఉద్యోగాలు..పూర్తి వివరాలివే!

Happy Kiss Day 2022: చుంబనాలు..వాటి అర్ధాలు తెలుసా? ఇట్టే కనిపెట్టేయొచ్చు..