Chiranjeevi: టాలీవుడ్‌లో నయా ట్రెండ్‌.. ఆ బాటలోనే నడుస్తున్న మెగాస్టార్, ప్రభాస్

Chiranjeevi and Prabhas: ఒకప్పుడు మాస్ సినిమా అంటే పంచ్ డైలాగులు, ఏరులై పారే రక్తం కనపించేది. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. మాస్ ఫార్ములాకు అర్ధం మారిపోయింది.

Chiranjeevi: టాలీవుడ్‌లో నయా ట్రెండ్‌.. ఆ బాటలోనే నడుస్తున్న మెగాస్టార్, ప్రభాస్
Megastar Chiranjeevi
Follow us
Lakshminarayana Varanasi, Editor - TV9 ET

| Edited By: Janardhan Veluru

Updated on: Jul 14, 2022 | 5:12 PM

ఒకప్పుడు మాస్ సినిమా అంటే పంచ్ డైలాగులు, ఏరులై పారే రక్తం కనపించేది. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. మాస్ ఫార్ములాకు అర్ధం మారిపోయింది. స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్లు ఇప్పుడు బాక్సాఫీస్‌ను రూల్‌ చేస్తున్నాయి. అందుకే టాప్ హీరోలంతా ఆ జానర్ మీదే సీరియస్‌గా ఫోకస్ చేస్తున్నారు. మాస్ సినిమా అన్న పదానికి కొత్త డెఫినేషన్ ఇచ్చింది బ్లాక్ బస్టర్‌ కేజీఎఫ్‌. అప్పటి వరకు ఉన్న మాస్‌ ఫార్ములాకు భిన్నంగా భారీ డైలాగ్‌లను పక్కన పెట్టి.. ఎలివేషన్‌ షాట్స్‌తో దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ హీరోయిజాన్ని సరికొత్తగా చూపించారు . భారీ యాక్షన్ సీక్వెన్స్‌లను పక్కన పెట్టి స్టైలిష్ ఫైట్స్‌తో ఆడియన్స్‌ను కట్టిపడేశారు. కేజీఎఫ్ సక్సెస్‌తో మాస్ సినిమా అంటే ఇలాగే ఉండాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారు.

ఈ ట్రెండ్‌ను విక్రమ్‌ మూవీ మరో లెవల్‌కు తీసుకెళ్లింది. కమల్‌ హాసన్ కమ్‌ బ్యాక్ సినిమాగా తెరకెక్కిన ఈ సినిమాలోనూ మాస్‌ యాక్షన్‌ను డార్క్ థీమ్‌తోనే చూపించారు. కమల్ కూడా కొత్త ట్రెండ్‌కు తగ్గట్టుగా లౌడ్ యాక్షన్‌ను పక్కన పెట్టి సెటిల్డ్ పెర్ఫామెన్స్‌తో అలరించారు. దీంతో మరిన్ని సినిమాలు ఇదే జానర్‌లో తెరకెక్కేందుకు రెడీ అవుతున్నాయి.

ఆల్రెడీ సెట్స్ మీద ఉన్న కూడా ప్రభాస్ సలార్ కూడా డార్క్ థీమ్‌ యాక్షన్ సినిమానే. కేజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ కూడా స్టైలిష్ యాక్షన్‌తో అలరించనున్నారు. బాక్సాఫీస్‌ బాహుబలికి కేజీఎఫ్ రేంజ్ ఎలివేషన్‌ తోడైతే రిజల్ట్ ఎలా ఉంటుందో సిల్వర్ స్క్రీన్‌ మీద చూస్తారు అంటూ ఆల్రెడీ వార్నింగ్ అలార్మ్ ఇచ్చేసింది యూనిట్‌.

ఇవి కూడా చదవండి

త్వరలో రిలీజ్‌కు రెడీ అవుతున్న మెగాస్టార్‌ చిరంజీవి గాడ్‌ ఫాదర్‌ కూడా ఇలాంటి డార్క్ థీమ్‌ మాస్‌ యాక్షన్ మూవీనే. ఈ సినిమాలో భారీ యాక్షన్ ఎపిసోడ్స్‌కు స్కోప్‌ లేదు. పేజీల కొద్ది పంచ్‌ డైలాగులు ఉండే ఛాన్స్‌ లేదు. కానీ మాస్ హీరోయిజానికి మాత్రం లోటు ఉండదని టీజర్‌తోనే హింట్ ఇచ్చారు మేకర్స్‌.

మరిన్ని సినిమా వార్తలు చదవండి..