Chiranjeevi: గోపీచంద్‌తో నాకున్న అనుబంధం అదే.. అందుకే ఈ ఫంక్షన్‌కు వచ్చాను.. పక్కా కమర్షియల్‌ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చిరంజీవి..

| Edited By: Ravi Kiran

Jun 27, 2022 | 6:21 AM

మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi) ముఖ్య అతిథిగా ఈ వేడుకకు హాజరై చిత్రం మంచి విజయం సాధించాలని ఆకాంక్షించారు. అదేవిధంగా గోపీచంద్ కుటుంబంతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. '

Chiranjeevi: గోపీచంద్‌తో నాకున్న అనుబంధం అదే.. అందుకే ఈ ఫంక్షన్‌కు వచ్చాను.. పక్కా కమర్షియల్‌ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చిరంజీవి..
Megastar Chiranjeevi
Follow us on

Pakka Commercial: గోపీచంద్(Gopichand), రాశీఖన్నా (Raashi Khanna) జంటగా నటించిన చిత్రం పక్కా కమర్షియల్‌ (Pakka Commercial). మారుతి (Maruthi) దర్శకత్వం వహించారు. మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అరవింద్ గారి స‌మ‌ర్పణలో జీఏ2 పిక్చర్స్‌- యూవీ క్రియేష‌న్స్ సంయుక్తంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం జులై 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈసందర్భంగా హైదరాబాద్‌లో పక్కా కమర్షియల్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ ఘనంగా జరిగింది. మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi) ముఖ్య అతిథిగా ఈ వేడుకకు హాజరై చిత్రం మంచి విజయం సాధించాలని ఆకాంక్షించారు. అదేవిధంగా గోపీచంద్ కుటుంబంతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ‘నేను ఇక్కడికి వచ్చినందుకు.. నాకూ గోపీచంద్‌కు ఉన్న అనుబంధమేమిటో చాలా మంది అనుకోవచ్చు. గోపీచంద్‌ నాన్నగారు టి. కృష్ణ బీకాం ఫైనలియర్‌ చదువుతున్న కాలేజీలోనే నేను ఇంటర్మీడియట్‌ ఫస్ట్‌ ఇయర్‌. ఆ కాలేజీలో కొత్తగా చేరిన నన్ను సీనియర్లు ఆయన దగ్గరకు తీసుకెళ్లారు. భయపడుతున్న నన్ను చూసి.. ‘స్టూడెంట్‌ ఫెడరేషన్‌కు నేను లీడర్‌గా నిలబడుతున్నాను. నీ సహకారం మాకు కావాలి’ అని కృష్ణ అడిగారు. ఆయన నాకెప్పుడూ హీరోలానే కనిపిస్తారు. ఇద్దరమూ అనుకోకుండా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాం. అయితే కలిసి సినిమా మాత్రం చేయలేకపోయాం’

గోపీచంద్‌ సినిమాల్లో అదే ఇష్టం..
‘సందేశాత్మక, విప్లవాత్మక చిత్రాలు తెరకెక్కించి ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కృష్ణగారు ఇప్పుడు మన మధ్య లేకపోవడం బాధాకరం. ఆయన పరంపరను గోపీచంద్‌ కొనసాగించడం చాలా సంతోషంగా ఉంది. గోపీచంద్‌ సినిమాల్లో నాకు సాహసం అంటే బాగా ఇష్టం. ఒక్కడున్నాడు, చాణక్య వంటి వైవిధ్యమైన కథలను ఎంచుకుని అభిమానులను అలరిస్తుంటాడు. అతను కమర్షియల్‌ హీరోగా మరిన్ని మంచి విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను. ఇక డైరెక్టర్‌ మారుతి గురించి చెప్పాలంటే.. ప్రజారాజ్యం పార్టీ జెండా డిజైన్‌ కోసం మంచి ఆర్టిస్ట్‌ను అన్వేషిస్తుంటే మారుతి పేరును ఎవరో సూచించారు. నాఆలోచనలకు తగ్గట్టుగా తను చేసిన డిజైన్‌ నాకు బాగా నచ్చింది. పార్టీ కోసం ఓ పాటనూ కూడా రూపొందించాం. దానికి విజువల్స్‌ షూట్‌ చేసుకురమ్మని నేనే కెమెరా ఇచ్చి పంపించాను. ఆ విజువల్స్‌ చూసి ఆశ్చర్యపోయా. అప్పుడే అతనిలో దర్శకుడు ఉన్నాడని చెప్పా. మారుతి చిత్రాల్లో ప్రేమకథా చిత్రమ్‌ నాకు బాగా ఇష్టం. అతనితో సినిమా చేసేందుకు నేను సిద్ధంగా ఉన్నాను’ అని చెప్పుకొచ్చారు చిరంజీవి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..