
ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం ‘సైరా నరసింహా రెడ్డి’. ఈ సినిమా చిత్రీకరణ ఇటీవలే ముగిసిన సంగతి తెలిసిందే. తన పాత్రైన ‘సైరా’కు చిరు డబ్బింగ్ చెప్పడం ఒకటే బ్యాలెన్స్. దీంతో.. మెగాస్టార్ ఇంట్లో.. డబ్బింగ్‌కు సంబంధించిన ఈక్విప్‌మెంట్ మొత్తాన్ని తెప్పించుకుని, అక్కడే స్టూడియో సెటప్ చేసి మరీ డబ్బింగ్ చెప్పేస్తున్నారట. ఆయన డబ్బింగ్ చెప్పేస్తే.. మిగతా పాత్రలకు డబ్బింగ్ ప్రారంభం అవుతుంది. వీలైనంత త్వరగా సినిమా పోస్ట్ ప్రొడక్షన్, గ్రాఫిక్స్ పనులు చేసి, సమయానికి సినిమాను రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోందట. ఈ సినిమాకి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించగా.. రామ్‌చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాను అక్టోబర్ 2న విడుదల చేస్తున్నారు.