AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లెజెండ్ అవార్డ్ అందుకున్న ‘మయూరి’.. కృత్రిమ కాలుతో నాట్యప్రదర్శనలు ఇచ్చిన సుధా చంద్రన్..

యాక్సిడెంట్‏లో కాలు పోగొట్టుకొని.. కృత్రిమ కాలు పెట్టుకొని ఎన్నో నాట్య ప్రదర్శనలు ఇచ్చింది నృత్య కళాకారిణి సుధాచంద్రన్. నాట్యంలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సుధాచంద్రన్

లెజెండ్ అవార్డ్ అందుకున్న 'మయూరి'.. కృత్రిమ కాలుతో నాట్యప్రదర్శనలు ఇచ్చిన సుధా చంద్రన్..
Rajitha Chanti
| Edited By: |

Updated on: Dec 30, 2020 | 8:35 PM

Share

యాక్సిడెంట్‏లో కాలు పోగొట్టుకొని.. కృత్రిమ కాలు పెట్టుకొని ఎన్నో నాట్య ప్రదర్శనలు ఇచ్చింది నృత్య కళాకారిణి సుధాచంద్రన్. నాట్యంలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సుధాచంద్రన్ సృష్టించుకున్నారు. ఆ తర్వాత ఆమె జీవితకథను వెండితెరపై మయూరి పేరుతో తెరకెక్కించారు డైరెక్టర్ సింగీతం శ్రీనివాస్ రావు. ఆ సినిమాలో తన పాత్రను తనే పొషించింది. ఆ తర్వాత చాలా కాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్నారు సుధా. ఇటీవల టెలివిజన్ తెరపై తన ప్రతిభను చూపిస్తున్నారు. అటు హిందీ, తెలుగులో సీరియల్లలో నటిస్తూ ప్రేక్షకుల మన్ననలను పొందుతుంది మయూరీ. తాజాగా ఆమెను లెజెంట్ అవార్డు వరించింది. వి.బి. ఎంటర్ ట్రైన్మెంట్స్ టెలివిజన్ అవార్డ్స్-2020 ఆరవ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. బొప్పన క్రిష్ణ ఆధర్వంలో డిసెంబర్ 27న హైదరాబాద్‏లోని శిల్పారామం, రాక్ హైట్స్‏లో ఈ వేడుకలు జరిగాయి. బుల్లితెర ఉత్తమ నటీనటులకు వారి ప్రతిభ ఆధారంగా ప్రముఖుల చేతుల మీదుగా ఈ అవార్డ్స్ ప్రదానోత్సవం జరిగింది. ఇందులో సుధా చంద్రన్‏ను లెజెండ్ అవార్డుతో సత్కరించారు. సీనియర్ నటి జీవితా రాజశేఖర్, బాబు మోహన్, శివాజీ రాజా, అంబికా కృష్ణలు.. ఈ అవార్డును సుధాచంద్రన్‏కు అందజేశారు. తనకు ఈ అవార్డు ప్రధానం చేసిన వారికి సుధాచంద్రన్ ధన్యవాదాలు తెలిపారు. సుధా చంద్రన్‏తోపాటు పలువురు బుల్లితెర నటీనటులకు అవార్డులతో సత్కరించారు.

Follow Us
శనివారం వెంకటేశ్వర స్వామి దీపారాధన.. ఒక్కసారి చేసేయండి, డబ్బు..
శనివారం వెంకటేశ్వర స్వామి దీపారాధన.. ఒక్కసారి చేసేయండి, డబ్బు..
ఎయిర్ ఇండియా చేసిన పనికి వెనక్కి వచ్చిన విమానం!
ఎయిర్ ఇండియా చేసిన పనికి వెనక్కి వచ్చిన విమానం!
సిలిండర్‌ 14.2 కేజీలే ఎందుకు ఉంటుంది? 15 కేజీలు ఎందుకు ఉండదు?
సిలిండర్‌ 14.2 కేజీలే ఎందుకు ఉంటుంది? 15 కేజీలు ఎందుకు ఉండదు?
భారతదేశంలో ఎప్పటికీ ఫెయిల్యూర్ కాని 5 టాప్ బిజినెస్ ఐడియాలివే!
భారతదేశంలో ఎప్పటికీ ఫెయిల్యూర్ కాని 5 టాప్ బిజినెస్ ఐడియాలివే!
గ్లోబల్ సైజుకు తీసుకెళదామనుకున్న సినమాకు గుర్తింపు లేదా?
గ్లోబల్ సైజుకు తీసుకెళదామనుకున్న సినమాకు గుర్తింపు లేదా?
బ్యాడ్ కొలెస్ట్రాల్ కు చెక్.. గుండెపోటు రాకుండా 5 సూపర్ టిప్స్
బ్యాడ్ కొలెస్ట్రాల్ కు చెక్.. గుండెపోటు రాకుండా 5 సూపర్ టిప్స్
ఉగాది రోజున ఇల్లు శుభ్రం చేస్తుండగా ఘోరం..!
ఉగాది రోజున ఇల్లు శుభ్రం చేస్తుండగా ఘోరం..!
చాణక్యుని 4 సూత్రాలతో మీ రోజును మొదలుపెడితే జీవితంలో విజయం ఖాయం
చాణక్యుని 4 సూత్రాలతో మీ రోజును మొదలుపెడితే జీవితంలో విజయం ఖాయం
మండే ఎండల్లో మిమ్మల్ని చలచల్లగా ఉంచే సూపర్ డ్రింక్స్.. తాగేద్దామా
మండే ఎండల్లో మిమ్మల్ని చలచల్లగా ఉంచే సూపర్ డ్రింక్స్.. తాగేద్దామా
వాస్తు టిప్స్: తడి బట్టలు ఇంట్లో ఆరేస్తున్నారా..అదృష్టం పోయినట్లే
వాస్తు టిప్స్: తడి బట్టలు ఇంట్లో ఆరేస్తున్నారా..అదృష్టం పోయినట్లే