Malayalam Movie: సినీ కార్మికుల కోసం చేతులు కలపనున్న ఇద్దరు స్టార్‌ హీరోలు… ఏకంగా 140 మంది ఆర్టిస్టులతో..

Mammootty, Mohanlal work Together: కరోనా కారణంగా తీవ్రంగా నష్టపోయిన రంగాల్లో సినీ పరిశ్రమ ఒకటి. థియేటర్లు మూతపడడం, సినిమా చిత్రీకరణలు ఆగిపోవడంతో ఉపాధిలేక సినీ కార్మికులు రోడ్డున పడ్డారు. అయితే ఇప్పుడిప్పుడే...

Malayalam Movie: సినీ కార్మికుల కోసం చేతులు కలపనున్న ఇద్దరు స్టార్‌ హీరోలు... ఏకంగా 140 మంది ఆర్టిస్టులతో..

Updated on: Feb 07, 2021 | 5:45 AM

Mammootty, Mohanlal work Together: కరోనా కారణంగా తీవ్రంగా నష్టపోయిన రంగాల్లో సినీ పరిశ్రమ ఒకటి. థియేటర్లు మూతపడడం, సినిమా చిత్రీకరణలు ఆగిపోవడంతో ఉపాధిలేక సినీ కార్మికులు రోడ్డున పడ్డారు.
అయితే ఇప్పుడిప్పుడే మార్పులు కనిపిస్తున్నాయి. మళ్లీ సినిమా చిత్రీకరణలు ఎప్పటిలా మొదలవుతున్నాయి. కార్మికులకు పని దొరుకుంది. ఇందులో భాగంగానే కార్మికులు తగినంత ఉపాధి, ఆదాయం లభించేందుకు గాను మలయాళ ఇండస్ట్రీకి చెందిన ఇద్దరు స్టార్‌ హీరోలు చేతులు కలిపారు. అసోసియేషన్‌ ఆఫ్‌ మలయాళం మూడీ ఆర్టిస్ట్‌ (అమ్మ) నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ విషయాన్ని ‘అమ్మ’ అధ్యక్షుడు మోహన్‌ లాల్‌ స్వయంగా ప్రకటించారు. ఇక ఈ సినిమాను ప్రియదర్శన్‌, టీకే రాజీవ్‌ కుమార్‌ దర్శకత్వం వహించనున్నారు. ఇక ఈ సినిమాలో మోహన్‌ లాల్‌, మమ్ముట్టి కలిసి నటిస్తుండడం విశేషం. వీరితో పాటు మలయాళంలో టాప్‌ స్టార్లతో పాటు.. సుమారు 140 మంది నటీనటుటు ఈ సినిమా కోసం పనిచేయనున్నారు. క్రైమ్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో తెరకెక్కించనున్న ఈ సినిమా ద్వారా సినీ కార్మికులతో పాటు నటీనటులుకు పనికల్పించడంతో పాటు.. సినిమా ద్వారా వచ్చే ఆదాయాన్ని ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతోన్న సినీ కార్మికులకు అందించనున్నారు. సినీ పరిశ్రమను కాపాడుకోవడం కోసం మలయాళీ ఇండస్ట్రీ తీసుకున్న నిర్ణయం నిజంగానే గొప్పది కదూ..!

Also Read: Mohanlal’s Drishyam 2 : ఆద్యంతం ఆసక్తికరంగా ‘దృశ్యం 2’ ట్రైలర్.. పాత మర్డర్ కేసు మరోసారి తెరపైకి…