Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mallika Sherawat: పాట కోసం నా నడుముపై చపాతీలు వేడిచేస్తానన్నాడు.. మల్లిక ఆసక్తికర వ్యాఖ్యలు..

మల్లికా శెరావత్‌.. హిందీ సినిమాలు చూసేవారితో పాటు టాలీవుడ్‌ ప్రేక్షకులకు కూడా ప్రత్యేక పరిచయం అవసరం లేని పేరు. 2003లో 'ఖ్వాహిష్' సినిమాతో కెరీర్‌ ఆరంభించిన ఈ ముద్దుగుమ్మ 'మర్డర్‌' సినిమాతో..

Mallika Sherawat: పాట కోసం నా నడుముపై చపాతీలు వేడిచేస్తానన్నాడు.. మల్లిక ఆసక్తికర వ్యాఖ్యలు..
Follow us
Basha Shek

|

Updated on: Nov 11, 2021 | 7:57 PM

మల్లికా శెరావత్‌.. హిందీ సినిమాలు చూసేవారితో పాటు టాలీవుడ్‌ ప్రేక్షకులకు కూడా ప్రత్యేక పరిచయం అవసరం లేని పేరు. 2003లో ‘ఖ్వాహిష్’ సినిమాతో కెరీర్‌ ఆరంభించిన ఈ ముద్దుగుమ్మ ‘మర్డర్‌’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆతర్వాత ‘ది మిత్‌’, ‘ప్యార్‌ కే సైడ్‌ ఎఫెక్ట్స్‌’, ‘డర్నా జరూరీ హై’, ‘గురు’, ‘వెల్‌కమ్‌’, ‘డర్టీ పాలిటిక్స్‌’ తదితర సినిమాలతో తన క్రేజ్‌ను అమాంతం పెంచుకుంది. ప్రత్యేక గీతాల్లోనూ ఆడిపాడింది. బాలీవుడ్‌లో బోల్డ్‌ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకున్న ఈ అందాల తార ప్రస్తుతం సినిమాలు చేయడం తగ్గించుకుంది. అయితే అప్పుడప్పుడు తన సోషల్‌ మీడియా ఫొటోలు, ఇంటర్వ్యూలతో వార్తల్లో నిలుస్తోంది. తాజాగా ‘ ది లవ్‌ లాఫ్‌ లైవ్‌ షో’ అనే ఓ టాక్‌షోకు హాజరైన మల్లిక తన జీవితానికి సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. ఇందులో భాగంగా ఓ పాట షూటింగ్‌లో భాగంగా తానెదుర్కొన్న ఒక చేదు అనుభవాన్ని షేర్‌ చేసుకుంది.

హాట్‌ అంటే బూతు పదం అనుకునేవారు.. ‘ఒక నిర్మాత నా దగ్గరకు వచ్చి హాట్‌సాంగ్‌లో ఉందని చెప్పారు. ఈ పాట ఎలా ఉండాలంటే సినిమా చూసే ప్రేక్షకులకు మీరెంత హాట్‌గా ఉన్నారో అర్థమవ్వాలి. ఇందుకోసం నా నడుము మీద చపాతీలు వేడి చేసే సన్నివేశం పెడతామన్నారు. ఈ మాట వినగానే నాకెలాగో అనిపించింది. వెంటనే రిజెక్ట్‌ చేశాను. అయితే నిర్మాత చెప్పినప్పుడు మాత్రం కొంచెం ఫన్నీగా అనిపించింది. అసలు ఇండియాలో హాట్‌ అనే పదానికి అర్థమేమిటో నాకు కూడా సరిగా తెలియదు. అయితే ఇక్కడి మహిళల్లో హాట్‌ అంటే అదేదో బూతు పదమన్న అభిప్రాయం ఉన్నట్లు కనిపిస్తోంది. గతంలో ఈ ధోరణి ఎక్కువగా ఉండేది కానీ ఇప్పుడు క్రమంగా ఆడవారి ఆలోచనల్లో మార్పు వస్తోంది’ అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మల్లిక.

Also Read:

TigerHills Production No1: టైగర్ హిల్స్ ప్రొడక్షన్ ‘ప్రొడక్షన్ నెంబర్ 1 ఫస్ట్ లుక్ రిలీజ్.. లైవ్ వీడియో

Pelli Sandadi: దర్శకేంద్రుడి మేకింగ్‌ స్టైల్‌కు ఈ తరం కూడా ఫిదా.. యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోన్న ఈ పాటే రుజువు..

Chiranjeevi-Ravi Teja: మళ్ళీ వెండి తెరపై క్రేజీ కాంబో.. అన్నయ్య మూవీలో కీలక పాత్రలో మాస్ మహారాజా అంటూ టాక్..