AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మల్లేశం రివ్యూ..

సినిమా టైటిల్ : మల్లేశం నటీనటులు : అనన్య, ఝాన్సీ, చక్రపాణి, ప్రియదర్శి తదితరులు సంగీతం : మార్కె కె రాబిన్ దర్శకత్వం : రాజ్ ఆర్ నిర్మాతలు : రాజ్ ఆర్, శ్రీ అధికారి చింతకింది మల్లేశం కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘మల్లేశం’. కొన్ని కథలు ఆసక్తికరంగా ఉంటాయి.. వాళ్ల జీవితాల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలనే ఆరాటం ఉంటుంది. అలాంటి వాళ్లల్లో చింతకింది మల్లేశం కథ ఒకటి. ఇప్పటి వరకూ కామెడీ చిత్రాలు చేసుకుంటూ […]

మల్లేశం రివ్యూ..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 21, 2019 | 2:06 PM

Share

సినిమా టైటిల్ : మల్లేశం నటీనటులు : అనన్య, ఝాన్సీ, చక్రపాణి, ప్రియదర్శి తదితరులు సంగీతం : మార్కె కె రాబిన్ దర్శకత్వం : రాజ్ ఆర్ నిర్మాతలు : రాజ్ ఆర్, శ్రీ అధికారి

చింతకింది మల్లేశం కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘మల్లేశం’. కొన్ని కథలు ఆసక్తికరంగా ఉంటాయి.. వాళ్ల జీవితాల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలనే ఆరాటం ఉంటుంది. అలాంటి వాళ్లల్లో చింతకింది మల్లేశం కథ ఒకటి. ఇప్పటి వరకూ కామెడీ చిత్రాలు చేసుకుంటూ వచ్చిన ప్రియదర్శి.. ఈ సినిమాలో హీరోగా మెరిసాడు. మరి ప్రియదర్శికి మల్లేశం కలిసి వచ్చిందా..? లేదా..? తెలుసుకోవాలంటే కథలోకి వెళ్దాం..

కథ :

చేనేత కార్మికుల జీవితాల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా 1980-1990ల మధ్య కాలం నాటి కథ. నల్గొండ జిల్లాలోని ఓ కుగ్రామం. ఆ గ్రామంలో మల్లేశం కుటుంబానికి చేనేత వృత్తే ఆధారం. రాత్రనక.. పగలనక కష్టపడితే కాని.. పదో పరకో వస్తుంది. దాంతోనే జీవితం గడపాలి.. అందులోనూ మధ్యతరగతి కుటుంబం. దీంతో.. మల్లేశం చదువును కూడా ఆరోతరగతితోనే ఆపేస్తారు కుటుంబసభ్యులు. ఓ చీర తయారు చేయడానికి అమ్మ పడుతున్న కష్టం చూడలేని మల్లేశం.. ఓ ఆసుయంత్రం కొనాలనుకుంటాడు. అయితే.. కొనే ప్రయత్నంలో మల్లేశం చాలా అవమానాలు, సమస్యలు ఎదుర్కోవలసివస్తుంది. అసలు ఆ సమస్యలేంటి..? దానికి మల్లేశం ఏంచేశాడు..? అమ్మని, భార్యను కూడా ఎందుకు దూరం చేసుకున్నాడో తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

ఎవరెలా చేశారంటే :

పాత్రలకు తగ్గట్టుగానే.. ప్రియదర్శి, అనన్య, ఝాన్సీ, చక్రపాణి తమ పాత్రలకు న్యాయం చేశారు. వారి వారి పాత్రలలో ఒదిగిపోయారనే చెప్పాలి. కథకు హైలెట్ నిలిచే పాత్ర ‘మల్లేశం’. ఇప్పటివరకూ సిల్లీ పంచ్‌లేస్తూ.. అందర్నీ నవ్వించే ప్రియదర్శి..ప్రేక్షకుల చేత కంటితడి పెట్టిస్తాడు. అమ్మకోసం తాను చేసే పనులు, తన అమాయకత్వంతో అందర్నీ ఆకట్టుకుంటాడు. అనన్య కూడా ప్రియదర్శికి పోటీ పడుతూ నటించింది. చక్కగా తన అభినయంతో.. భర్తకు సేవలు చేస్తూ.. కట్టిపడేసే క్యారెక్టర్‌లో బాగా నటించింది. ఇక తల్లి పాత్రలో నటించిన ఝాన్సీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. ఇక మిగిలిన పాత్రల్లో ఆయా నటులు వాటి పరిధి మేరకు మెప్పించారు.

ఎలా ఉందంటే :

ఈ సినిమా చేనేత వృత్తిలోని కార్మికుల కష్టసుఖాలను ప్రతిబింబించింది. ముఖ్యంగా ఒక పట్టుచీరను మగ్గం మీద నేయాలంటే.. కార్మికుడు పడే కష్టాన్ని కళ్లకు కట్టినట్లు చూపించారు. సాధారణంగా జీవిత కథలను తీయడమంటే కత్తిమీద సాము లాంటిదే. ఎన్నో పరిమితుల మధ్య తీయాల్సి ఉంటుంది. ఓటమి ఎదురైనప్పుడు మనకంటూ ఏదో ఒక దారి ఉండే ఉంటుంది. ఆ దారేంటో తెలుసుకోవాలి తప్ప ఆత్మహత్యలకు ప్రయత్నించకూడదు అనే సందేశాన్ని ఈ సినిమా చాటింది. అసలు.. ఆసు యంత్రం అంటే ఏమిటి..? మగ్గం అంటే ఏమిటో దర్శకుడు రాజ్ ఆర్ ఈ సినిమాలో కళ్లకు కట్టినట్లు చూపించారు. మొదటిభాగం సరదాగా సాగినా.. రెండో భాగం కంటతడి పెట్టిస్తుంది. కాకాపోతే.. ఎలాంటి కమర్షియల్ హంగులు లేని సినిమా ‘మల్లేశం’. ఇక బ్యాక్‌ గ్రౌండ్ మ్యూజిక్.. సన్నివేశాలకు తగ్గట్టుగా సాగింది.

మొత్తానికి ఈ సినిమా సామాజిక సందేశాన్ని అందించడంలో దర్శకుడు కృతకృత్యుడయ్యాడనే చెప్పాలి.