Coronavirus: సినీ ఇండస్ట్రీని వెంటాడుతోన్న కరోనా.. మహమ్మారి బారిన పడిన యాక్షన్ హీరో..

కరోనా థర్డ్ వేవ్ లో సామాన్యులతో పాటు సెలబ్రిటీలు పెద్ద ఎత్తున వైరస్ బారిన పడుతున్నారు. ముఖ్యంగా సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు వరుసగా ఈ వైరస్ కు చిక్కుతున్నారు. వీరిలో కొందరు కోలుకుంటుండగా.. మరికొందరు హోమ్ ఐసోలేషన్

Coronavirus: సినీ ఇండస్ట్రీని వెంటాడుతోన్న కరోనా..  మహమ్మారి బారిన పడిన యాక్షన్ హీరో..
Suresh Gopi
Follow us
Basha Shek

| Edited By: Ravi Kiran

Updated on: Jan 21, 2022 | 6:48 AM

కరోనా థర్డ్ వేవ్ లో సామాన్యులతో పాటు సెలబ్రిటీలు పెద్ద ఎత్తున వైరస్ బారిన పడుతున్నారు. ముఖ్యంగా సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు వరుసగా ఈ వైరస్ కు చిక్కుతున్నారు. వీరిలో కొందరు కోలుకుంటుండగా.. మరికొందరు హోమ్ ఐసోలేషన్ లో చికిత్స తీసుకుంటున్నారు.  కాగా ఇటీవల మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి  కి కరోనా  పాజిటివ్ గా నిర్ధారణ  కాగా నిన్న (జనవరి20) ఆయన కుమారుడు దుల్కర్ సల్మాన్ కూడా కరోనాకు గురయ్యారు. అంతలోనే మరో మలయాళం సూపర్ స్టార్ సురేశ్ గోపీ కూడా కరోనా కు చిక్కారు . ఈ విషయాన్ని ఆయనే సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.

జాగ్రత్తలు తీసుకున్నా!

‘ కరోనాకు సంబంధించి నేను అన్ని జాగ్రత్తలు తీసుకున్నాను. అయినా కూడా  నాకు కోవిడ్  పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం నేను ఇంట్లోనే హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నాను. ప్రస్తుతం నేను బాగానే ఉన్నాను.  తేలిక పాటి జ్వరం తప్ప  మరేవిధమైన సమస్యలు లేవు.  నా  ఆరోగ్యం నిలకడగా ఉంది.  ఈ సందర్భంగా మీ అందరికీ  ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను.  కరోనాకు సంబంధించి అన్నీ జాగ్రత్తలు  తీసుకోండి,  సామాజిక దూరం పాటించండి.  జనసంచారం ఎక్కువగా ప్రదేశాలకు వెళ్లకండి. మీరు క్షేమంగా ఉండండి.  మీ చుట్టుపక్కల ఉన్నవారిని కూడా క్షేమంగా ఉండనివ్వండి’ అని ఆయన ట్విట్టర్ లో సూచించారు.  కాగా  పోలీస్ యాక్షన్ చిత్రాలతో  సురేశ్ గోపీ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.   ఆయన నటించిన పలు చిత్రాలు తెలుగులో కూడా  విడుదలై సూపర్ హిట్ గా నిలిచాయి.  గతేడాది ఆయన నటించిన ‘వరణే అవశ్యముంద్’ (తెలుగులో పరిణయం) డీసెంట్ హిట్ గా నిలిచింది. ఇందులో సురేశ్ తో పాటు దుల్కర్ సల్మాన్, శోభన,  కల్యాణి ప్రియదర్శన్ ప్రధాన పాత్రల్లో నటించారు.

Also Read: Coronavirus: మొన్న తండ్రి.. నేడు కుమారుడు.. కరోనా బారిన పడ్డ స్టార్ హీరో..

AHA Unstoppable: ఫ్యాన్స్ నిరీక్ష‌ణకు ఫుల్‌స్టాప్‌.. బాల‌య్య షోలో మ‌హేష్ సంద‌డి ఎప్పుడంటే.. .Viral Video: 1,019 అక్షరాలతో ఎంత పె…ద్ద.. ‘పేరు’..! గిన్నీస్ వరల్డ్ రికార్డు సాధించిన అమ్మాయిని చూసి షాక్ అవుతున్న నెటిజన్లు..(వీడియో)