ప్రస్తుతం ఇతర భాషల్లో తెలుగు సినిమాలు సత్తా చాటుతున్నాయి. తెలుగు వారి కథలకు దేశవ్యాప్తంగా ఇప్పుడు భారీ డిమాండ్ ఉంది. దీనికి ప్రత్యక్ష సాక్ష్యమే ఇటీవలి కాలంలో హిందీలో భారీ కలెక్షన్లు రాబట్టిన సినిమాలు. బాహుబలితో మొదలైన ఈ ట్రెండ్ కార్తికేయ2 వరకు కొనసాగింది. అయితే కేవలం పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన చిత్రాలే కాకుండా రీమేక్ అయిన సినిమాలు కూడా నార్త్ ప్రేక్షకులకు ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా మరో తెలుగు సినిమా రీమేక్ నార్త్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఆ సినిమానే ‘వేద్’.. ఈ చిత్రాన్ని తెలుగులో సూపర్ హిట్ విజయాన్ని అందుకున్న మజిలీ చిత్రానికి రీమేక్‌గా మరాఠాలో తెరకెక్కించారు.
తెలుగులో నాగ చైతన్య, సమంత పోషించిన పాత్రల్లో రితేశ్ దేశ్‌ముఖ్, జెనిలీయా నటించారు. శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే తాజాగా మరాఠాలో రీమేక్ అయి విడుదలైన వేద్ కూడా ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తోంది. ఈ సినిమా ఇప్పటి వరకు ఏకంగా రూ. 44.92 కోట్ల వసూలు చేసింది. కేవలం రూ.15కోట్ల బడ్జెట్‌తో ఈ మూవీని తెరకెక్కించారు. డిసెంబరు 30న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తొలిరోజు రూ.3.5కోట్లు (గ్రాస్) వసూలు చేయగా, 15రోజుల్లో రూ.44.92కోట్లు రాబట్టింది. మరాఠా బ్లాక్ బస్టర్ ‘సైరాట్’ (రూ.110 కోట్లు) తర్వాత ఆ భాషలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ‘వేద్’ నిలవడం విశేషం.
ఇదిలా ఉంటే మజిలీ సినిమా సమయానికి చై, సామ్ వివాహ బంధంలో ఉన్న విషయం తెలిసిందే. అలాగే రితేశ్, జెనిలీయా కూడా భార్యభర్తలుగా ఈ సినిమాలో నటించడం విశేషం. ఇక ఈ సినిమా గురించి జెనిలీయా మాట్లాడుతూ.. ఒకవేళ రితేశ్ లేకపోతే, ఆ పాత్ర చేయడానికి మరింత సమయం పట్టేది. ఏం చేయాలనుకుంటున్నావో అది చేయడానికి ఇదే సరైన సమయమని రితేశ్ ప్రోత్సహించడం ద్వారానే ఇది సాధ్యమైందని జెనీలియా చెప్పుకొచ్చింది.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..