AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘హి ఈజ్ సో క్యూట్’.. అవును ‘సితార పాప ఈజ్ సో క్యూట్’

అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్‌స్టార్ మహేష్ బాబు నటించిన చిత్రం సరిలేరు నీకెవ్వురు. జనవరి 11న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ చిత్రం నుంచి ఇప్పటివరకు మూడు పాటలు విడుదలయ్యాయి. ఒక మాస్ సాంగ్(మైండ్ బ్లాక్), ఒక ఫ్యామిలీ సాంగ్‌(సూర్యుడివో చంద్రుడివో)తో పాటు రష్మిక, మహేష్‌ను టీజ్ చేసే(హి ఈజ్ సో క్యూట్) పాటలను చిత్ర యూనిట్ విడుదల చేసింది. వీటిలో మైండ్ బ్లాక్ సాంగ్ కాస్త మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ.. సూర్యుడివో […]

'హి ఈజ్ సో క్యూట్'.. అవును 'సితార పాప ఈజ్ సో క్యూట్'
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Dec 21, 2019 | 4:39 PM

Share

అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్‌స్టార్ మహేష్ బాబు నటించిన చిత్రం సరిలేరు నీకెవ్వురు. జనవరి 11న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ చిత్రం నుంచి ఇప్పటివరకు మూడు పాటలు విడుదలయ్యాయి. ఒక మాస్ సాంగ్(మైండ్ బ్లాక్), ఒక ఫ్యామిలీ సాంగ్‌(సూర్యుడివో చంద్రుడివో)తో పాటు రష్మిక, మహేష్‌ను టీజ్ చేసే(హి ఈజ్ సో క్యూట్) పాటలను చిత్ర యూనిట్ విడుదల చేసింది.

వీటిలో మైండ్ బ్లాక్ సాంగ్ కాస్త మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ.. సూర్యుడివో చంద్రుడివో, హి ఈజ్ సో క్యూట్ పాటలు మాత్రం ఫ్యాన్స్‌ను తెగ ఆకట్టుకున్నాయి. హి ఈజ్ సో క్యూట్ పాటకైనా ఎంతోమంది అమ్మాయిలు డ్యాన్స్ వేస్తూ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఇదే పాటకు మహేష్ తనయ సితార డ్యాన్స్ వేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఇక ఈ వీడియోను చూసిన మహేష్ అభిమానులు షి ఈజ్ సో క్యూట్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. మహేష్ బాబు ఎప్పుడూ క్యూట్‌గా ఉంటారు.. అతడే కాదు సితార పాప కూడా క్యూట్ అంటూ వారు సోషల్ మీడియాలో తమ అభిప్రాయలను వ్యక్తపరుస్తున్నారు.

అయితే సరిలేరు నీకెవ్వరుపై సూపర్‌స్టార్ అభిమానులు చాలా అంచనాలు పెట్టుకున్నారు. మరోవైపు వచ్చే ఏడాది మహేష్ ఖాతాలో హిట్ గ్యారెంటీ అని మూవీ యూనిట్ కూడా ధీమా వ్యక్తం చేస్తోంది. ఇదిలా ఉంటే ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుక జనవరి 5న జరగనుంది. హైదరాబాద్‌లోని ఎల్బీస్టేడియంలో జరగబోతున్న ఈ వేడకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా రాబోతున్నారు.

Follow Us
వాట్సప్‌లో ఆయుష్మాన్ భారత్ పథకానికి దరఖాస్తు చేసుకోవడం ఎలా..?
వాట్సప్‌లో ఆయుష్మాన్ భారత్ పథకానికి దరఖాస్తు చేసుకోవడం ఎలా..?
బెల్లంతో సేమియా పాయసం.. పాలు విరగదు, సేమియా ముక్కలవ్వదు
బెల్లంతో సేమియా పాయసం.. పాలు విరగదు, సేమియా ముక్కలవ్వదు
చెక్క చెప్పులు పోయాయని ChatGPTనే అడిగాడు..!
చెక్క చెప్పులు పోయాయని ChatGPTనే అడిగాడు..!
నాగలోకం నిజంగా ఉందా? పురాణాల్లో వర్ణించిన సర్పరాజుల రహస్య ప్రపంచం
నాగలోకం నిజంగా ఉందా? పురాణాల్లో వర్ణించిన సర్పరాజుల రహస్య ప్రపంచం
కన్యారాశిలోకి చంద్రుడు.. ఈ రాశుల వారు పట్టిందల్లా బంగారమే!
కన్యారాశిలోకి చంద్రుడు.. ఈ రాశుల వారు పట్టిందల్లా బంగారమే!
బరువు తగ్గేందుకు మందులు వాడుతున్నారా..? అసలుకే ఎసరు వస్తుంది
బరువు తగ్గేందుకు మందులు వాడుతున్నారా..? అసలుకే ఎసరు వస్తుంది
ఢిల్లీ అక్షర్‌ధామ్‌లో వైభవంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
ఢిల్లీ అక్షర్‌ధామ్‌లో వైభవంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
ఒక్కో ఈవెంట్‏‏కు ఎంత తీసుకుంటానంటే.. జబర్దస్త్ నరేష్
ఒక్కో ఈవెంట్‏‏కు ఎంత తీసుకుంటానంటే.. జబర్దస్త్ నరేష్
సరిహద్దుల వీరుడికి ఆకాశ మార్గంలో త్రివర్ణం..!
సరిహద్దుల వీరుడికి ఆకాశ మార్గంలో త్రివర్ణం..!
పీఎఫ్ ఉద్యోగులకు త్వరలో శుభవార్త.. ఆ పరిమితి రూ.3 వేలకు పెంపు..
పీఎఫ్ ఉద్యోగులకు త్వరలో శుభవార్త.. ఆ పరిమితి రూ.3 వేలకు పెంపు..