AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సారీ పూరి..నువ్వే నన్ను సూపర్‌స్టార్‌ని చేశావ్- మహేష్‌ ట్వీట్

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటించిన ‘మహర్షి’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ బుధవారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు టాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేష్‌తో పాటు, క్రేజీ హీరో విజయ్ దేవరకొండ ముఖ్య అతిథులుగా హాజరై సందడి చేసారు. ‘మహర్షి’ ఈనెల 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. హీరోగా మహేష్ బాబుకు ఇది 25వ సినిమా. అంతేకాదు ఈ సినిమాను వైజయంతి మూవీస్,శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్, పీవీపీ సినిమా […]

సారీ పూరి..నువ్వే నన్ను సూపర్‌స్టార్‌ని చేశావ్- మహేష్‌ ట్వీట్
Ram Naramaneni
|

Updated on: May 02, 2019 | 5:36 PM

Share

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటించిన ‘మహర్షి’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ బుధవారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు టాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేష్‌తో పాటు, క్రేజీ హీరో విజయ్ దేవరకొండ ముఖ్య అతిథులుగా హాజరై సందడి చేసారు. ‘మహర్షి’ ఈనెల 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. హీరోగా మహేష్ బాబుకు ఇది 25వ సినిమా. అంతేకాదు ఈ సినిమాను వైజయంతి మూవీస్,శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్, పీవీపీ సినిమా బ్యానర్‌లు సంయుక్తంగా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించాయి. మహేష్ బాబు సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో అల్లరి నరేష్ ముఖ్యపాత్రలో నటిస్తున్నాడు.

ప్రి రిలీజ్ వేడుకలో మాట్లాడిన మహేష్ బాబు ..తన కెరీర్‌లో మెమరబుల్‌గా నిలిచిపోయిన చిత్రాల గురించి ప్రస్తావించడం హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా ‘రాజకుమారుడు’, ‘ఒక్కడు’, ‘అతడు’, ‘శ్రీమంతుడు’,‘భరత్ అను నేను’ సినిమాల గురించి చెప్పిన మహేష్ బాబు.. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పోకిరి’ సినిమా గురించి ప్రస్తావించక పోవడం అభిమానులకు ఆశ్చర్యానికి గురిచేసింది. అంతేకాదు మహేష్‌కు మరో బ్లాక్‌బాస్టర్ సినిమా బిజినెస్‌మ్యాన్‌ని ఇచ్చింది కూడా పూరినే. సూపర్ స్టార్ అయినా ఈ మధ్య ఆడియెన్స్ అస్సలు పట్టించుకోవడం లేదు. తేడా వస్తే విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. మహేష్ విషయంలో కూడా అదే జరిగింది. నిజానికి మహేష్ బాబును సూపర్ స్టార్‌ను చేసిన చిత్రం ‘పోకిరి’. ఆ తర్వాత మహేష్ తప్పు తెలుసుకున్నాడు.

వెంటనే స్పందించి.. ట్విట్టర్ వేదికగా పూరీకి క్షమాపణ చెప్పాడు. ‘ఇవాళ నా స్పీచ్‌లో ఇంపార్టెంట్ పర్సన్ పేరు చెప్పడం మర్చిపోయాను. పోకిరి నన్ను సూపర్ స్టా‌ర్‌ని చేసింది. పోకిరిలాంటి సినిమా ఇచ్చినందుకు థ్యాంక్యూ సో మచ్ పూరీ.. ఈ సినిమా నాకెప్పటికీ గుర్తుండిపోతుంది’ అని ట్వీట్ చేసాడు మహేష్.. ‘థ్యాంక్యూ సో మచ్ సార్, ఆల్వేస్ లవ్ యూ, మహర్షి ట్రైలర్ ఈజ్ రాకింగ్’.. అంటూ, మహేష్ ట్వీట్‌కి రిప్లై ఇచ్చాడు పూరీ జగన్నాథ్.

బాడీ షేమింగ్‌ చేశారు.. పెళ్లి చేసుకోవాలంటే ఆ కండిషన్ పెట్టారు
బాడీ షేమింగ్‌ చేశారు.. పెళ్లి చేసుకోవాలంటే ఆ కండిషన్ పెట్టారు
కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..