Sarkaru Vaari Paata : మొదలైన మహేష్ బాబు ‘సర్కారువారి పాట’ షూటింగ్.. ఆనందంలో అభిమానులు

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం 'సర్కారు వారిపాట'. ఈ సినిమా కోసం అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు...

Sarkaru Vaari Paata : మొదలైన మహేష్ బాబు సర్కారువారి పాట షూటింగ్.. ఆనందంలో అభిమానులు

Edited By:

Updated on: Jan 25, 2021 | 12:28 PM

Sarkaru Vaari Paata : సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారు వారిపాట’. ఈ సినిమా కోసం అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘గీత గోవిందం’ ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అందాల భామ కీర్తిసురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా మొదటి షెడ్యూల్ దుబాయ్ లో జరగనుంది. బ్యాంకింగ్ రంగంలో జరిగే మోసాల నేపథ్యంలో ఈ సినిమా రూపొందబోతుంది.

తాజాగా ఈ సినిమా షూటింగ్ ప్రారంభించారు చిత్రయూనిట్. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను విడుదల చేశారు చిత్రయూనిట్. తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీలో మహేష్ న్యూ లుక్ లో కనిపించనున్నారు. లాంగ్ హెయిర్, మెడమీద టాటూతో కనిపించనున్నాడు మహేష్. ఈ సినిమా షూటింగ్ ను శరవేగంగా పూర్తి చేసి వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని చూస్తున్నారు మేకర్స్. ఇక మహేష్ మూవీ మొదలవడంతో అభిమానుల ఆనందం అవ‌ధులు దాటింది. ఇప్పటికే సోషల్ మీడియాలో సర్కారు వారి పాట హ్యాష్ ట్యాగ్‌ ను  ట్రెండ్ చేస్తున్న ఫ్యాన్స్.