MAA Elections 2021: ఆసక్తికరంగా ‘మా’ ప్రచారం.. రెబల్ స్టార్‌ను కలిసిన మంచు విష్ణు.. ఆశీస్సులంటూ..

MAA Elections 2021: సినిమాలు వేరు.. రాజకీయాలు వేరు అన్న మాటలను తరచుగా వింటుంటాం.. అదంతా ఒకప్పటి మాటే.. తాజాగా, టాలీవుడ్ ఇండస్ట్రీ రాజకీయాలతో వేడెక్కుతోంది. సినిమాల్లో డైలాగ్‌లు,

MAA Elections 2021: ఆసక్తికరంగా ‘మా’ ప్రచారం.. రెబల్ స్టార్‌ను కలిసిన మంచు విష్ణు.. ఆశీస్సులంటూ..
Vishnu

Edited By: Anil kumar poka

Updated on: Oct 04, 2021 | 3:49 PM

MAA Elections 2021: సినిమాలు వేరు.. రాజకీయాలు వేరు అన్న మాటలను తరచుగా వింటుంటాం.. అదంతా ఒకప్పటి మాటే.. తాజాగా, టాలీవుడ్ ఇండస్ట్రీ రాజకీయాలతో వేడెక్కుతోంది. సినిమాల్లో డైలాగ్‌లు, పంచులు పేలినట్టు.. ‘మా’ ఎన్నికల్లో మాటల తూటాలు పేలిపోతున్నాయి. రోజుకో ట్విస్ట్‌లతో మాలో పోటీచేసే కీలక నటులు ఎన్నికల వాతావరణాన్ని పూర్తిగా మర్చేస్తున్నారు. మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికల తేదీ దగ్గర పడుతుండటంతో అభ్యర్థులు ప్రచారాన్ని వేగవంతం చేశారు. అక్టోబర్‌ 10న మా ఎ‍న్నికలు జరుగనున్న నేపథ్యంలో ఓ వైపు మంచు విష్ణు, మరోవైపు ప్రకాశ్ రాజ్ తమ ప్యానెళ్ల సభ్యులతో ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ టాప్ హీరోలను కలుస్తూ.. ఈ ఎన్నికల్లో తమకే మద్ధతు ఇవ్వాలని కోరుతున్నారు. తనకు మద్దతు ఇవ్వాలని ఆదివారం సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణను కలిసిన మంచు విష్ణు.. తాజాగా రెబల్ స్టార్ కృష్ణం రాజును కలిశారు. ఈ సందర్భంగా మా ఎన్నికల్లో నెలకొన్న ఉత్కంఠపై చర్చించారు. అదేవిధంగా ఈ ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వాలంటూ మంచు విష్ణు కృష్ణంరాజును కోరారు. ఈ మేరకు మంచు విష్ణు ట్విట్ చేశారు. రెబల్ స్టార్ కృష్ణంరాజును కలిసి ఆశీర్వచనలు తీసుకున్నానని మంచు విష్ణు ట్వీట్ చేశారు.


ఈ క్రమంలోనే విష్ణు ఆదివారం నటసింహం బాలకృష్ణను కలిశారు. అయితే ఇప్పటికే మంచు విష్ణు తండ్రి మోహన్ బాబుతో కలిసి సూపర్ స్టార్ కృష్ణని కలిసి మా ఎన్నికలను వేడెక్కించారు. మా ఎన్నికల్లో సపోర్ట్ కోసం మంచు విష్ణు సీనియర్ నటులతో వరుస భేటిలు అవుతుండటంతో మా రాజకీయాలు రోజుకో విధంగా మలుపుతిరుగుతున్నాయి.

ఇదిలాఉంటే.. ఇప్పటికే దూకుడుగా వెళ్తోన్న ప్రకాష్ రాజ్ ఇవాళ మరో అడుగు ముందుకేశారు. హాటైన వ్యాఖ్యలు చేస్తూ ట్విట్ చేశారు. ఎప్పటికీ సాయాలు, చందాలు, ఉచితాలతోనే బ్రతుకుదామా? అంటూ ఆయన మా అసోసియేషన్ సభ్యుల్ని ప్రశ్నించారు. ఆల్ లైట్స్.. యాక్షన్ లతో పనిచేస్తూ జీవిద్దామా..? తేల్చుకోండంటూ ఆయన సభ్యుల్ని ఆకట్టుకునే విధంగా ట్విట్ చేశారు.

Also Read:

Prakash Raj: సాయాలు, చందాలు, ఉచితాలతోనే బ్రతుకుదామా.? మంచు విష్ణు ప్యానల్ పై ప్రకాష్ రాజు సెటైర్లు

Shraddha Srinath: టాలెంటెడ్ హీరోయిన్ స్టైలిష్ ఫొటోస్.. ‘శ్రద్ధా శ్రీనాథ్‌’ వయ్యారాలపై ఓ లుక్కేయండి..